India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిత్తూరు పార్లమెంట్ పరిధిలో 16,43,593 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ ఎస్. షణ్మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నగరి, జి.డి.నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీలలో 8,06,070 మంది పురుషులు, 8,34,000 మంది స్త్రీలు మొత్తం 16,43,593 మంది ఓటర్లు ఉన్నారన్నారు.
ఎన్నికల నేపథ్యంలో అనంతపురం రూరల్ ఎంపీటీసీ నగేశ్‌పై మంగళవారం హత్యాయత్నం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయనను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 82 ఘటనల్లో కేసులు నమోదు చేశామని, నిబంధనలు అతిక్రమించిన 71 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని, 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలో రాజకీయ పార్టీలపై 54 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని సాధారణ పౌరుల కేసుల్లో 61 కేసుల్లో 57 కేసులు పరిష్కరించామని తెలిపారు.
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన ఘటనలు 93 చోటు చేసుకోగా వాటిలో 34 కేసుల్లో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. 67 మంది ప్రభుత్వ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయగా 39 మందిని సర్వీస్ నుంచి తొలగించారు. 17 మందిపై ఇంకా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే 7812 మంది గ్రామ, వార్డు వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేశారు. ఇంకా ఎంసీసీ నిబంధనలు ఉల్లంఘించిన 26 మంది రాజకీయ నాయకులపై 17 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ కొండపిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామిపై సరదాగా వ్యాఖ్యలు చేశారు. ‘మన ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నాడు. నాకంటే పొట్టి, కానీ వయసులో నేనే పెద్ద’ అంటూ నవ్వులు పూయించారు. ఇక్కడి పొగాకు చూస్తే తనకు వీరసింహారెడ్డి సినిమా గుర్తుకువచ్చిందన్నారు. ఈ సందర్భంగా బాలయ్య పలు సినిమాల డైలాగులు చెప్పి అభిమానులను ఉత్సాహపరిచారు.
మేమందరం కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డితోనే ఉంటామని ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట వైసీపీ నేత కదురు రమేశ్ అన్నారు. నిన్న కొంతమంది డేవిస్ పేట నుంచి టీడీపీలో చేరారు. కదురు రమేష్ అనుచరులు కూడా టీడీపీలో చేరారని, ఆయన ఒంటరిగా మిగిలిపోయారని వార్తలు వచ్చాయి. ఇవ్వన్ని అపోహలేనని, మేమంతా వైసీపీలోనే ఉన్నామని వారు స్పష్టం చేశారు.
రాజంపేట పార్లమెంటు బరిలో MP అభ్యర్థులుగా 18మంది బరిలో ఉన్నారు. NDA కూటమి-నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, YCP-మిథున్ రెడ్డి, కాంగ్రెస్-S.భాషీద్, BSP-యుగేంద్ర, అన్న YSR-అక్బర్, M.బాషా, జై భారత్ పార్టీ-రమణయ్య, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ-సల్మాన్ ఖాన్, ఇండిపెండెంట్లు-వేంకటాద్రి, ఓబయ్యనాయుడు, నాగరాజు, నాగేశ్వర్ రాజు, శ్రీనివాసులు, రెడ్డిశేఖర్, ప్రదీప్, శ్రీనివాసులు, మాడా రాజ, సుబ్బనరసయ్య ఉన్నారు.
టీడీపీ- జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంతో అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తులని ఎంపీ, కూటమి ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు భవిష్యత్తు గ్యారంటీని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. జగన్ ఒక దుష్టుడు అని విమర్శించారు. ఏపీలోని రైల్వే స్టేషన్‌కు జగన్ పేరు, ఫొటో వేసుకోవడం కుదరదు కనుకే ఆయా స్టేషన్ల పేర్లు మారలేదని ఎద్దేవా చేశారు.
సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల విధులు సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. పి.ఓలు, ఎపీఓల శిక్షణా తరగతులకు ఆయన హాజరయ్యారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులపై ఉందన్నారు.
కర్నూలు నగరంలోని బి క్యాంపు లో ఉన్న కర్నూలు డీఎస్సీ స్టేడియంలో మే 5న అండర్ 19 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి దేవేందర్ గౌడ్ తెలిపారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. 2005 తర్వాత జన్మించిన వారు మాత్రమే ఈ పోటీలకు అర్హులని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.