India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప పట్టణంలోని ప్రభుత్వ డిఎల్టీసి ఐటిఐలో ఈనెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డిఎల్టీసి అసిస్టెంట్ డైరెక్టర్ రత్నరాజు తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. ఈ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఐటిఐ ఫైనల్ ఇయర్ చదువుతూ ఏఐటిటి – 2024 పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, ఐటిఐ పాసైన విద్యార్థులందరూ హాజరు కావచ్చని తెలిపారు.

చీరాల మండలం ఈపురుపాలెంలో సుచరిత (21) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు రేప్ చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం అమరావతిలో కలిశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమయ్యారు. అసెంబ్లీ, శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పెద్దిరెడ్డితో పాటు ఇతరులకు జగన్ దిశానిర్దేశం చేశారు.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామానికి చెందిన వేమన వెంకట సురేశ్‌కు కెనడాలో అరుదైన గౌరవం లభించింది. అక్కడ ప్రఖ్యాత ఆల్‌బెర్టా యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ రిప్రజెంటేటివ్‌గా కెనడా ప్రభుత్వం ఆయనను నియమించింది. ప్రస్తుతం ఆయన కెనడాలో టెక్నికల్ హైస్పీడ్ రైల్వే ప్రాక్టీస్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 10వ తరగతి వరకు చుంచులూరు ప్రభుత్వ స్కూల్లోనే సురేశ్ చదివారు.

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను జూన్ 24న ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్, తదితర కంపెనీల వాచీలున్నాయి. ఆదేవిధంగా వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో, తదితర కంపెనీల మొబైల్ ఫోన్లు ఉన్నాయి.

నోబుల్ కళాశాలలో ఈ నెల 23న సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు కృష్ణా జిల్లా హాకీ సంఘ కార్యదర్శి హరికృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. 1995, జనవరి 1 కంటే ముందు జన్మించిన ఆటగాళ్లు ఎంపిక పోటీలకు ధ్రువపత్రాలతో 23న ఉదయం 8 గంటలకు నోబుల్ కళాశాలకు రావాలని చెప్పారు. ఎంపికైనవారు అంతర్ జిల్లాల పోటీలలో కృష్ణా జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు.

గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసురావు ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి ఆయన చేత ప్రమాణం చేయించారు. కాగా ఆయన ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యుక్షుడిగా పనిచేస్తున్నారు. ఈసారి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన ఆయన ప్రమాణస్వీకారం చేసే సమయంలో మిగతా సభ్యులు చప్పట్లతో అభినందించారు.

ప్రకాశం జిల్లాలో డ్రగ్స్, గంజాయి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ వాల్ పోస్టర్‌ను పోలీసులు విడుదల చేశారు. ఎవరైనా గంజాయి ఇతరత్రా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు సమాచారం ఉంటే ఇవ్వాలని, పరిష్కరించడానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. అలాగే ఎప్పటికప్పుడు వాటిపై నిఘా ఉంటుందన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను శుక్రవారం వెల్లడించారు. MV నిబంధనలు అతిక్రమించిన 293 మందిపై రూ.54,705 ఈ చలానాలు విధించామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 11 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 34 మందిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయన్నారు.

నెల్లూరు జిల్లా ఉదయగిరి సచివాలయంపై ప్రభుత్వ మారినా జగన్ ఫొటోలు <<13479984>>తొలగించలేదని <<>>ఇవాళ ఉదయం Way2Newsలో వార్త ప్రచురితమైంది. వెంటనే అధికారులు స్పందించారు. సచివాలయం భవనంపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్, నవరత్నాల లోగోలను అధికారులు తొలగించారు.
Sorry, no posts matched your criteria.