India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్కలి మండలం బన్నువాడ గ్రామానికి చెందిన పోలాకి రామారావు(70) అనే వృద్ధుడు మంగళవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. మంగళవారం ఉదయం గ్రామంలో పొలంకి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు షేక్ బాషకు పది సంవత్సరాల జైలు శిక్ష, రూ.3000 జరిమాన విధిస్తూ అనంతపురం ఫోక్సో కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పు వెల్లడించారు. 2020లో బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులకు తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో సాక్ష్యాలు రుజువు కావడంతో శిక్ష విధించింది. శిక్ష పడే విధంగా చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తు కూటమి అభ్యర్థులను కలవరపెడుతోంది. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలోనూ గ్లాస్ గుర్తు ఈవీఎంలో ఉండనుంది. ఇక్కడ మొరసన్నపల్లి YCP సర్పంచ్ జగదీశ్ భార్య నీలమ్మ స్వతంత్ర అభ్యర్థిగా ఉండటంతో గ్లాస్ గుర్తు కేటాయించారు. చంద్రగిరి, మదనపల్లె, శ్రీకాళహస్తి, నగరిలోనూ ఇండిపెండెంట్లకు ఈ గుర్తు ఇచ్చారు. అక్కడ ఫలితాలపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి మరి.
శ్రీకాకుళం జిల్లాలో సాధారణ ఎన్నికల్లో భాగంగా మే 13న జిల్లా వ్యాప్తంగా 2,049 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో 299, పలాస పరిధిలో 284, టెక్కలి పరిధిలో 315, పాతపట్నం పరిధిలో 323, శ్రీకాకుళం పరిధిలో 279, ఆమదాలవలస పరిధిలో 259, ఎచ్చెర్ల పరిధిలో 309, నరసన్నపేట పరిధిలో 290 చొప్పున పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.
పింఛన్ లబ్ధిదారులకు నగదును బ్యాంకు ఖాతాల్లో బుధవారం జమ చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలో 3,15,423 మంది లబ్ధిదారులకు రూ.94.38 కోట్లు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆధార్ నంబరుతో మ్యాప్ అయిన అకౌంట్‌కు నగదు జమ చేస్తామన్నారు. బ్యాంకు ఖాతాల్లేని వారు, దివ్యాంగులు, మంచానికి పరిమితమైన వారికి ఐదో తేదీ లోపు ఇంటి వద్దే పంపిణీ చేస్తామన్నారు.
కర్నూలు జిల్లాలో సూర్యుడు తాండవం చేస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సోమవారం అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఆత్మకూరు వేడెక్కింది. ఇక బనగానపల్లి, డోన్‌లో 45.4, కోడుమూరులో 44.8, కల్లూరు, బండి ఆత్మకూరులో 44.7, మహానందిలో 44.7, పాములపాడులో 44.6, గూడూరులో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతతో సూర్యుడు విలయతాండవం చేస్తున్నాడు. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
మంగళగిరి బరిలో 40 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా, నారా లోకేశ్, మురుగుడు లావణ్య మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న లోకేశ్.. గెలుపుపై ధీమాగా ఉన్నారు. భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని అంటున్నారు. 50 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుస్తానని లోకేశ్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎంత మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అయితే జిల్లాలో అత్యధికంగా కడప నియోజకవర్గంలో 32 నామినేషన్లను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి మధుసూదన్ పేర్కొన్నారు. అత్యల్పంగా మైదుకూరు నియోజకవర్గంలో 7 నామినేషన్లు తిరస్కరించారు. వాటితో పాటు కమలాపురంలో 24, ప్రొద్దుటూరులో 15, బద్వేల్ లో 14, జమ్మలమడుగులో 12 పులివెందులలో 10 నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు.
ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు సోమవారంతో ముగిశాయి. ఈనెల 22వ తేదీన 88 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 38 పరీక్ష కేంద్రాల్లో సజావుగా సాగాయని యూనివర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణ అధికారి పద్మజ తెలిపారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లుగా తెలిపారు.
జిల్లా వాసులను భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. గుంతకల్లులో సోమవారం అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. శింగనమల, తలుపులలో 44.1, బొమ్మనహాళ్ 43.9, యల్లనూరు, తాడిపత్రి, అనంతపురంలో 43.7, పెద్దవడుగూరు 43.2, కూడేరు, చెన్నేకొత్తపల్లి, కొత్తచెరువులో 43.0, విడపనకల్లు, బుక్కరాయసముద్రం 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
Sorry, no posts matched your criteria.