Andhra Pradesh

News June 21, 2024

ముందు నారాయణ.. తర్వాత ఆనం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాల్లో టీడీపీ గెలిచిన విషయం తెలిసిందే. వీరిలో ముందుగా మంత్రి నారాయణ ఇవాళ అసెంబ్లీలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతోంది. మరికాసేపట్లో ఇతర ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతుంది.

News June 21, 2024

నేడు అసెంబ్లీలోకి గద్దె.. ఆయన హామీలివే.!

image

విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా 3వ సారి ఎన్నికైన గద్దె రామ్మోహన్ తాను ఓటర్లకు ఇచ్చిన కింది హామీలు నెరవేర్చాలని ప్రజానీకం ఆశిస్తున్నారు.
☞ కొండప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం
☞ డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి కృషి
☞ పేదలకు ఇళ్ల పట్టాలు
☞ పథకాలను పారదర్శకంగా అమలు
☞ టిడ్కో ఇళ్లను పూర్తి చేయడం
☞ వాన నీటి మళ్లింపుకు డ్రైనేజ్ నిర్మాణం.

News June 21, 2024

కడప: 13 తులాల బంగారు ఆభరణాల చోరీ

image

మహిళ సంచిలో తెచ్చుకున్న 13
తులాల బంగారు ఆభరణాలను దుండగులు చోరీ చేశారు. ఎస్సై మధుసూదన్ రెడ్డి కథనం మేరకు.. గాలివీడు మండలానికి చెందిన పి.ప్రమీల ఫిబ్రవరి 28న దేవుని కడప వద్ద బంధువుల వివాహానికి ఆర్టీసీ బస్సులో వస్తున్నారు. దారిలో తాను తెచ్చుకున్న సంచి జిప్ తెరచి ఉండడంతో ఆందోళనగా తెరచిచూశారు. అందులో ఉన్న బంగారం అపహరణకు గురయ్యాయని గమనించి బోరున విలపించారు. కడప వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 21, 2024

శ్రీకాకుళం: డిగ్రీ ఫలితాల్లో ఎంతమంది పాస్ అయ్యారంటే..!

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం డిగ్రీ 6వ సెమిస్టర్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ మేరకు మొత్తం 9,832 మంది విద్యార్థులు హాజరు కాగా 9,777 మంది ఉత్తీర్ణత సాధించారు. 99.4 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కోర్సులు వారీగా బీఏలో 1235 మందికి 1229 మంది, బీసీఏలో 160 మందికి 155 మంది, బీసిఏలో 158 మందికి 156 మంది, బీకాంలో 1519 మందికి 1509 మంది, బీఎస్సీలో 6760 మందికి 6728 మంది ఉత్తీర్ణత సాధించారు.

News June 21, 2024

ప్రకాశం: 24న ఐటీఐ ప్రవేశాలకు కౌన్సెలింగ్

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలోని ప్రవేశాలకు ఈనెల 24, 25 తేదీలలో కౌన్సెలింగ్ జరుగుతుందని జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు తెలిపారు. పదవ తరగతి మార్కులు జాబితా కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు వంటి పత్రాలతో ఆ తేదీల్లో హాజరుకావాలన్నారు. కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత కళాశాల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వనున్నట్లు వివరించారు.

News June 21, 2024

నేడు అసెంబ్లీలోకి సుజనా.. ఆయన హామీలివే.!

image

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన సుజనా చౌదరి తాను ఓటర్లకు ఇచ్చిన కింది హామీలు నెరవేర్చాలని ప్రజానీకం ఆశిస్తున్నారు. కాగా నేడు సుజనా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
☞ కొండప్రాంత వాసులకు ఇళ్ల రిజిస్ట్రేషన్
☞ లేబర్ కాలనీలో స్టేడియం నిర్మాణం
☞ దుర్గ గుడి, భవానీ ద్వీపం అభివృద్ధికి కృషి
☞ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి
☞ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ
☞ హజ్ హౌస్ నిర్మాణం.

News June 21, 2024

కాకినాడ: తనతో మాట్లాడటం లేదని బాలిక సూసైడ్

image

తునికి చెందిన ఓ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. SI విజయ్ బాబు వివరాల ప్రకారం.. తునిలోని రెల్లికాలనీకి చెందిన 16 ఏళ్ల బాలిక ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా, అక్కడే పనిచేస్తున్న యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ యువకుడు తనతో మాట్లాడకుండా మరో యువతితో చనువుగా ఉంటున్నాడనే మనస్తాపానికి గురై బుధవారం పురుగుల మందు తాగింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.

News June 21, 2024

గుంటూరు : శాసనసభకు ఎవరెవరు ఎన్నోసారంటే..!

image

◆సీనియర్లు: ధూళిపాళ్ల నరేంద్ర (6వసారి)
◆యరపతినేని శ్రీనివాసరావు (4వసారి)
◆నాదెండ్ల మనోహర్ (3వసారి)
◆నక్కా ఆనంద్ బాబు (3వసారి)
◆అనగాని సత్యప్రసాద్(3వ సారి)
◆జీవీ ఆంజనేయులు (3వసారి)
◆తెనాలి శ్రావణ్ కుమార్ (2వసారి)
◆తొలిసారి: నారా లోకేశ్, మొహ్మద్ నసీర్ అహ్మద్, గళ్ళా మాధవి
◆ బూర్ల రామాంజనేయులు, చదలవాడ అరవింద్ బాబు
◆ భాష్యం ప్రవీణ్, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, వేగేశన నరేంద్ర వర్మ

News June 21, 2024

కర్నూలు జిల్లాలో ఏడుగురి తొలిసారి అసెంబ్లీలోకి

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇవాళ ఏడుగురి తొలసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు.
☞డోన్ ఎమ్మెల్యేగా కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి
☞కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్
☞పత్తికొండ ఎమ్మెల్యేగా కేఈ శ్యాంబాబు
☞ కోడుమూరు ఎమ్మెల్యేగా బొగ్గుల దస్తగిరి
☞నందికొట్కూరు ఎమ్మెల్యేగా గిత్తా జయసూర్య
☞ఆదోని ఎమ్మెల్యేగా పీవీ పార్థసారథి
☞ఆలూరు ఎమ్మెల్యేగా విరుఫాక్షి

News June 21, 2024

తూ.గో.: ‘500 మార్కుల కంటే ఎక్కువ వస్తే బహుమతి’

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో ఈ ఏడాది టెన్త్ పరీక్ష ఫలితాల్లో 500 మార్కులు పైగా వచ్చిన భట్రాజు సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు రూ.2 వేల నగదు ప్రోత్సాహక బహుమతి, జ్ఞాపిక అందిస్తామని తూ.గో జిల్లా భట్రాజు సంక్షేమ సంఘం అధ్యక్షుడు లోలభట్టు శ్రీనివాసరాజు రాజమండ్రిలో గురువారం తెలిపారు. మార్కుల జాబితా, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌తో ఈ నెలాఖరులోగా 94935 47944 నంబర్‌కు వివరాలు పంపాలని సూచించారు.