Andhra Pradesh

News October 10, 2024

కర్నూలు: దాడి ఘటనలో 24 మందిపై మరో కేసు

image

కర్నూలు (D) ఆలూరు నియోజకవర్గంలోని రెన్యూ విండ్‌ పవర్‌, గ్రీన్‌ ఇన్‌ఫ్రా కంపెనీల కార్యాలయాలపై దాడులకు పాల్పడిన 24మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు రిమాండ్ విధించగా ప్రస్తుతం ఆదోని సబ్ జైలులో ఉన్నారు. వీరిపై ఆస్పరి, ఆలూరు పోలీస్ స్టేషన్లలో ఒక్కో కేసు నమోదు కాగా తాజాగా దేవనకొండ పీఎస్‌లో మరో కేసు నమోదైంది. ఈ ఘటనలో MLA విరూపాక్షి సోదరుడు వెంకటేశ్వర్లు ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

News October 10, 2024

కమలాపురం మాజీ MLA కుమార్తెపై చర్యలు..!

image

వైసీపీ నేత, కమలాపురం మాజీ MLA వీరశివారెడ్డి కుమార్తె వీర మృణాళినిదేవి దువ్వూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్నారు. 2023 ఆగస్టు 21 నుంచి 2024 ఫిబ్రవరి 19 వరకు ముద్దనూరు ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా కొనసాగారు. జమ్మలమడుగు, ఎర్రగుంట్లలో ఆమె అక్రమంగా 57 రిజిస్ట్రేషన్లు చేయగా వీటిని కలెక్టర్ శివశంకర్ రద్దు చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

News October 10, 2024

ALERT: పొగాకు ఎక్కువ పండించకండి

image

టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో బుధవారంతో కొనుగోళ్లు పూర్తయ్యాయి. మొత్తం 16.1 మిలియన్ల పొగాకు కొనుగోళ్లు చేసినట్లు వేలం కేంద్రం అధికారి అట్లూరి శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది కిలో పొగాకు సరాసరి రూ.221లు రైతులకు లభించింది. ఈ ఏడాదికి రూ.279 అందినట్లు చెప్పారు. ప్రస్తుత ధర పోల్చుకుని పొగాకు అత్యధికంగా పండిస్తే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించారు.

News October 10, 2024

విశాఖ వేదికగా మలబార్ విన్యాసాలు

image

విశాఖ వేదికగా జరుగుతున్న మలబార్-2024 విన్యాసాల ప్రారంభ వేడుకల్లో నాలుగు దేశాలకు చెందిన నౌకాదళాల అధికారులు పాల్గొన్నారు. హిందూ మహాసముద్రంలో సవాళ్లను పరిష్కరించడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం పరస్పర మార్పిడి అవగాహన పెంపొందించుకునే లక్ష్యంతో ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. అమెరికా జపాన్ ఆస్ట్రేలియా భారత్ దేశాల నౌకాదళాలు పాల్గొన్నాయి.

News October 10, 2024

విశాఖ: రూ.40 వేల జీతం.. దరఖాస్తులు ఆహ్వానం

image

కేజీహెచ్-ఏఎంసీలో నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ సెంటర్లో కోర్స్ కోఆర్డినేటర్ పోస్ట్ కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిబాబు తెలిపారు. నెలకు రూ.40 వేలు వేతనం చెల్లిస్తారని అన్నారు. నెల్స్ సిల్క్ ల్యాబ్‌లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 18లోగా పరిపాలన కార్యాలయం ఆంధ్ర మెడికల్ కాలేజీలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

News October 10, 2024

ఈ నెల 14 నుంచి పల్లె పండుగ: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు పల్లెపండుగ, పంచాయతీ వారోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆమె అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఇప్పటికే మంజూరైన పనులను శంకుస్థాపనలు చేయాలన్నారు.

News October 10, 2024

పెదవేగి: ముగ్గురి ప్రాణం తీసిన పందెంకోడి..UPDATE

image

పెదవేగిలో తండ్రి, ఇద్దరు కుమారులు <<14312151>>మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. కోడిపుంజుకు ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు తండ్రి, ఇద్దరు కుమారులు కాలువలో పడి మృతి చెందారు. ఈ ఘటనలో మొదట తండ్రి, పెద్ద కుమారుడి మృతదేహం లభ్యం కాగా..ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బురదలో కూరుకుపోయిన సాయికుమార్ మృతదేహాన్ని వెలికి తీశారు. కుటుంబాన్ని మొత్తాన్ని కోల్పోవడంతో తల్లి ఆవేదన ఆకాశాన్నంటుతోంది.

News October 10, 2024

కర్నూలు: నేటి నుంచే యూనివర్సిటీకి దసరా సెలవులు

image

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీకి నేటి నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం వర్కింగ్ డే ఉన్నప్పటికీ నాన్ టీచింగ్ ఉద్యోగుల అభ్యర్థన మేరకు వైస్ ఛాన్స్‌లర్ సెలవు ఇస్తూ ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు రిజిస్ట్రార్ తెలిపారు.

News October 10, 2024

రాజమహేంద్రవరం: దసరాకు ప్రత్యేక రైళ్లు

image

దసరా సందర్భంగా గురువారం నుంచి 18వ తేదీ వరకు విజయవాడ-శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 07215 నంబరు గల రైలు విజయవాడ-శ్రీకాకుళం రోడ్డు మధ్య ఈ నెల 10, 11, 12, 13, 14, 15, 16, 17 తేదీలలో, 07216 నంబర్ గల శ్రీకాకుళం-విజయవాడ మధ్య 10, 11, 12, 13, 15, 16, 17, 18 తేదీల్లో నడుపుతున్నామని తెలిపారు. ఈ రైళ్లు రాజమహేంద్రవరం మీదుగా తిరుగుతాయన్నారు.

News October 10, 2024

రైల్వే జోన్‌కు త్వరలో భూమి పూజ: ఎంపీ శ్రీభరత్

image

విశాఖ రైల్వే జోన్ త్వరలో ఏర్పాటు కానున్నట్లు విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలిపారు. విశాఖ టిడిపి కార్యాలయంలో మాట్లాడుతూ త్వరలో విశాఖలో రైల్వే జోన్ కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేసినప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్లాంటుకు రూ.1700 కోట్లు విడుదలైనట్లు తెలిపారు.