India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. విక్రమ సింహపురి అమరావతి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కు మూడు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేశామని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ-గూడూరు(12744) రైలుకు ఈనెల 20 నుంచి 30 వరకు.. గూడూరు-విజయవాడ(12743) రైలుకు ఈనెల 21 నుంచి జులై ఒకటి వరకు అదనపు కోచ్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇవి సెకండ్ సిట్టింగ్‌కు సంబంధించినవి.

విజయపురిసౌత్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 17న పురిటి బిడ్డతోపాటు తల్లి పావని మృతి చెందిన ఘటనపై, సమగ్ర విచారణతోపాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఆరోగ్య సేవల కో-ఆర్డినేటర్ (DCHS) రంగారావు తెలిపారు. విచారణ నిమిత్తం గురువారం ఆస్పత్రికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. తల్లీబిడ్డా మృతిపై సమగ్ర విచారణ చేస్తున్నానన్నారు.

పగిడ్యాల మండలంలో పనిచేసిన ఎస్సై మారుతీ శంకర్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి దివ్య గురువారం తీర్పునిచ్చారు. ఘనపురంలో 2015లో నరేంద్రరెడ్డి అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించారు. కేసు విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు రావాలని నరేంద్రరెడ్డిని ఎస్సై పిలవగా వారెంట్ ఉంటేనే వస్తానని చెప్పాడు. దీంతో ఎస్సై కోపంతో దాడిచేశారని బాధితుడు ఫిర్యాదు చేశాడు.

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక తెలిపారు. ఈ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జూన్ 26వ తేదీ ఉదయం ఆర్ట్స్ కళాశాల నుంచి 7 రోడ్డు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. యువత ఉత్సాహంగా పాల్గొనాలని, డగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కోసమే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు అంశాలపై చర్చించారు.

అనంతపురం నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్‌లోనే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌ను పొందవచ్చని ఆర్టీసీ డిపో మేనేజర్ నాగ భూపాల్ ప్రకటనలో తెలిపారు. అనంతపురం రవాణా శాఖ ఉత్తర్వుల మేరకు ఒక రోజు నాన్ రెసిడెన్సియల్ ట్రైనింగ్ ఇచ్చి రెన్యువల్‌ను అందిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆర్టీసీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో విధి నిర్వహణలో అందించిన విశేష సేవలకు గాను ఆత్రేయపురం మండల తహశీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ఎం.పవన్ కుమార్ ప్రభుత్వం నుంచి ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ మేరకు అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన రెవెన్యూ దినోత్సవ వేడుకలలో ఆయన కలెక్టర్ హిమాన్సు శుక్లా చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఆయనను మండలాధికారుల అభినందించారు.

విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కళావెంకట్రావు భవన్‌లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో గురువారం జిల్లా అభ్యర్థుల సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి షర్మిల వివరించారని ఆ పార్టీ ఆదోని ఇన్‌ఛార్జ్ రమేశ్ యాదవ్ తెలిపారు. కర్నూలు ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు యాదవ్ ఉన్నారు.

నీట్ పరీక్ష పత్రం లీకేజ్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాయచోటి పట్టణంలోని కొత్తపేట బాలికల కళాశాల ఆవరణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

చిత్తూరు: పుంగనూరులోని కొత్త ఇండ్లు మున్సిపల్ పాఠశాలలో తమ పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. పాఠశాలలో 750 మంది విద్యార్థులకు చదువుకోవడానికి మౌళిక వసతులు ఉన్నప్పటికీ ఇప్పటికే దాదాపు 1000 మందికిపైగా విద్యార్థులు ఉన్నట్లు హెచ్ఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. 6వ తరగతిలో ఇప్పటికి 150 మంది చేరారని అన్నారు.
Sorry, no posts matched your criteria.