India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ నెల 24 నుంచి ప్రతి సోమవారం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని ఎస్పీ ఎం.దీపిక గురువారం తెలిపారు. ఇకపై ప్రతీ సోమవారం యధావిధిగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు.

నెల్లూరు నగరంలోని బర్మా షేల్ గుంటలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదం ఘటన హృదయ విధారకమైందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి అన్నారు. ప్రభుత్వం తోపాటు స్వచ్చంద సంస్థలు బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 14ఇళ్ళు అగ్నికి అహుతి అయ్యాయని ఆ ఇండ్లలో ఉన్న సామానులు బట్టలు పూర్తిగా కాలిపోవడంతో వారు నిరాశ్రయులు అయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రకాశం జిల్లాలో పరిస్థితిలను పరిశీలించి, సమగ్ర నివేదిక తయారుచేసి జిల్లా ప్రజలను ఆదుకోవాలని మంత్రి స్వామి కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లాలో కరవు పరిస్థితులను అంచనా వేయడానికి వచ్చిన బృందంతో ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని కరవు పరిస్థితులను కలెక్టర్, మంత్రి స్వామి బృందానికి తెలియజేశారు.

వాల్తేర్ రైల్వే డివిజన్ పరిధిలోని బొబ్బిలి, విజయనగరం, రాయగడ రైల్వే స్టేషన్లలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్ వాల్ గురువారం తనిఖీలు నిర్వహించారు. రైల్వే ప్రయాణికులకు భద్రతతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. నిర్మాణంలోనూ ఉన్న వివిధ ప్రాజెక్టుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. జీఎం వెంట వాల్తేరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ ఉన్నారు.

ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఇన్‌ఛార్జ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాద్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది. అతుల్ సింగ్‌కి ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేయాలని పీవీ సునీల్ కుమార్‌కి ఆదేశాలిచ్చింది.

విజయవాడ మీదుగా డిబ్రుగఢ్(DBRG)-కన్యాకుమారి(CAPE) మధ్య ప్రయాణించే వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇకపై ప్రతి రోజు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.22504 DBRG-CAPE ట్రైన్‌ను జూలై 8 నుంచి నం.22503 CAPE-DBRG ట్రైన్‌ను జూలై 12 నుంచి ప్రతిరోజూ నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు శ్రీకాకుళం రోడ్, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.

ప్రొద్దుటూరులో గురువారం 2,893 మద్యం బాటిళ్లను కడప సెబ్ ఎన్ఫోర్స్ మెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు నాయుడు సమక్షంలో ధ్వంసం చేశారు. ప్రొద్దుటూరు రూరల్, వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లు, రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం తరలిస్తున్న 98 కేసుల్లో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. సీఐలు రమణారెడ్డి, శ్రీకాంత్, అబ్దుల్ కరీం, మహేష్ కుమార్ పాల్గొన్నారు.

జిల్లాలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాలో లోపాలు లేకుండా చూడడం కోసం ఆన్లైన్ ట్రాకింగ్ యాప్‌ను వినియోగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. పశువులకు కూడా నీటి సరఫరా చేసేందుకు తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. కనిగిరి, మార్కాపురం, నియోజకవర్గాలలో తాగునీటి ఎద్దడిని 3 రోజులకు ఒకసారి అధ్యయనం చేస్తామన్నారు. పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు.

జులై 1 నుంచే పింఛన్ పెంపును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. జులై 1న ఇచ్చే రూ.4 వేలు, ఏప్రిల్ నుంచి 3 నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ లెక్కన అవ్వతాతలకు జులై 1న ₹7 వేల పింఛన్ అందనుంది. ఈ పెంపుతో అనంతపురం జిల్లాలో సుమారు 2.80 లక్షలు, సత్యసాయి జిల్లాలో 2.72 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 5.60 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.

టమోటా ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ చిత్తూరు జిల్లా నుంచి టమోటాను కొనుగోలు చేసి లాభం నష్టం లేని విధంగా వినియోగదారులకు రైతుబజార్ల ద్వారా అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు. గురువారం కలెక్టరేట్ జిల్లా ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్‌తో కలిసి మార్కెట్లో టమాటాలు, కూరగాయల లభ్యతతో పాటు వాటి ధరలపై చర్చించారు.
Sorry, no posts matched your criteria.