India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టీడీపీ అధికారంలోకి రావడంతో పోలీసుశాఖ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో సీఐలు, ఎస్ఐల బదిలీలు ప్రారంభమయ్యాయి. బుధవారం కొంతమందిని వివిధ ప్రాంతాలకు మార్చారు. మరో రెండు రోజుల్లో సీఐ, ఎస్ఐలతో పాటు డీఎస్పీలకు స్థానచలనం కలగనుంది. వైసీపీ ప్రభుత్వంలో లూప్‌లైన్‌లో ప్రాధాన్యం లేని విభాగాల్లో ఉన్న వారందరూ ప్రస్తుతం తెరపైకి వస్తున్నారు. కొంతమంది అధికారులపై వేటు పడే అవకాశం ఉంది.

ఆహారంలో విషపూరిత జెర్రి ప్రత్యక్షమైన ఘటన తిరుపతిలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తిరుపతిలోని ఓ సినిమా హాలు సమీపంలోని ఓ హోటల్‌లో తినే ఆహారంలో జెర్రి ప్రత్యక్షం కావడంతో కస్టమర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా
విశాఖపట్నం- అమృత్‌సర్ మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌లను కొద్ది రోజులపాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు రైలు నం.20807 విశాఖపట్నం- అమృత్‌సర్ ట్రైన్‌ను జూలై 5, 6, 9 తేదీలలో, నం.20808 అమృత్‌సర్- విశాఖపట్నం ట్రైన్‌ను జూలై 6, 7, 10 తేదీలలో రద్దు చేసినట్లు తెలిపారు.

జిల్లాలో పూర్తిస్థాయిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమవేశాన్ని నిర్వహించారు. కొత్త వ్యక్తులు సమాచారం సేకరణ, అనుమానిత వ్యక్తులపై నిఘా, లాడ్జిలు, వాహనాలను విసృతంగా తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వాహన తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు.

విద్యతోనే గిరిజనల అభివృద్ధి సాధ్యమని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాముఖ్యం ఇస్తోందని ఎస్టీ కమిషన్ సభ్యుడు వాడిత్య శంకర్ నాయక్ పేర్కొన్నారు. గురువారం కర్నూలులో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, గిరిజనులను అభివృద్ధి పథంలో నడిపిస్తోందని అన్నారు. జిల్లా పర్యటనలో గిరిజనుల నుంచి కొన్ని విజ్ఞాపనలు వచ్చాయని తెలిపారు.

పిచ్చి కూతలు కూస్తే రోడ్లమీద ప్రజలు తిరగనీయరని మాజీ మంత్రి కొడాలి నానిని విశాఖ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఎస్.అనంతలక్ష్మి హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం మీద కొడాలి నాని చేసిన విమర్శలపై స్పందించారు. ఈ మేరకు విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని, దోచుకుతినే ప్రభుత్వం కాదన్నారు. కూల్చే ప్రభుత్వం మీది అయితే ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం తమదన్నారు.

దోపిడీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు అడిషనల్ ఏఎస్పీ శ్రీధర్ రావు తెలిపారు. గురువారం ఒంగోలులోని SP కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొండపి మండలం వెన్నూరునకు చెందిన వంశీకృష్ణ తన బంధువుల ఫంక్షన్ నిమిత్తం ఈనెల 16న ఒంగోలు వచ్చారు. వంశీకృష్ణ కుమారుడు జయవర్ధన్ బాబును ఇద్దరు నిందితులు ఫంక్షన్లో మాయమాటలతో చెయిన్, బ్రాస్లెట్, ఉంగరం దొంగిలించారు. ఈమేరకు పోలీసు బృందాలతో పట్టుకున్నామన్నారు.

అంతర్జాతీయ సమాజంలో వస్తున్న మార్పులు ఉద్యోగ అవకాశాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆయా అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లాలోని ఎంపిక చేసిన 20 పాఠశాలు, కె.జి.బి.వి.లు, ఏ.పి.మోడల్ స్కూల్స్ ఒకేషనల్ కోర్సులు కలిగిన జూనియర్ లెక్చరర్లకు గురువారం కొప్పోలులో కెరీర్ ఎడ్యుకేషన్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లాలో పిడుగు పాటుకు వేరువేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సరుబుజ్జిలి మండలం కటకమయ్యపేట గ్రామంలో పిడుగుపాటుకు దేవరపల్లి బారికయ్య (72) మృతి చెందారు. బూర్జ మండలం అయ్యవారిపేట గ్రామంలో పిడుగు పాటుకు ఆవులు కాపరి చోడవరపు సత్యనారాయణ (30) మృతి చెందారు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ నెల 22న మచిలీపట్నంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలన్నారు. జిల్లా ఉపాధి కార్యాలయం స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల ఎదురుగా ఉన్న ఫంక్షన్ హాల్లో జాబ్ మేళా ఉంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.