India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా ఏలూరిని నియమించాలని చంద్రబాబు సర్కార్ చూస్తోందని సమాచారం. రాష్ట్ర మంత్రి మండలిలో ఏలూరికి స్థానం దక్కకపోవడంతో ఆయనకు సముచిత స్థానం కల్పించాలని అధిష్ఠానం చూస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే బాపట్ల జిల్లాలో ఎన్డీఏ కూటమి ఘన విజయానికి కారకులైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకి టీటీడీ ఛైర్మన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు ధీమాగా ఉన్నారు.

జిల్లా వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఓటమిపై నేతలెవరూ అధైర్యపడొద్దని సూచించినట్లు మాజీ మంత్రి తానేటి వనిత చెప్పారు. గెలుపోటములు సహజమేనని, మన ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేశామని చెప్పినట్లు వివరించారు. వైసీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షమే అని, ప్రజా సమస్యలపై పోరాటానికి నేతలందరూ సిద్ధంగా ఉండాలని జగన్ సూచించారన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రతిఒక్కరూ పని చేయాలని చెప్పారన్నారు.

డెంకాడ పోలీసు స్టేషనులో 2020లో నమోదైన హత్య కేసులో నిందితుడు బొల్లు వెంకటరావుకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయాధికారి తీర్పు చెప్పారని జిల్లా ఎస్పీ దీపిక జూన్ తెలిపారు. సింగవరం గ్రామానికి చెందిన సురేశ్ అనే వ్యక్తిని బావ బొల్లు వెంకటరావు కుటుంబ తగాదాల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్‌తో కొట్టడంతో సురేశ్ మృతి చెందాడు. నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైంది.

పాడేరు మండలం మినుములూరులో బంధువుల మధ్య వివాదం జరిగగా ఒకరు మృతి చెందారు. ఈనెల 18న దాగరి సూరిబాబు (63)కు బంధువైన సాగరి.నరసింహమూర్తి మధ్య ఆర్థిక లావాదేవీల విషయమై వివాదం చెలరేగింది. మద్యం మత్తులో నరసింహ మూర్తి సూరిబాబును కర్రతో కొట్టాడు. గాయపడిన సూరిబాబు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. బంధువుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

కార్మికులకు అందుబాటులో ఉంటూ అన్ని శాఖలను సమన్వయ పరచి ఒక కార్మికుడిలా పనిచేస్తానని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గురువారం పండితుల వేదశ్వీరచనల మధ్య తొలిసారిగా తన ఛాంబర్‌లోకి ప్రవేశించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ.. కార్మికులకు ఉపయోగపడే 13 చట్టాలని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమానికి కృషి చేస్తానన్నారు.

సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి ఎమ్మెల్యే బండారు శ్రావణి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వేల కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపుతున్నారని ఆమె కొనియాడారు. ప్రజలపై భువనేశ్వరి చూపే ప్రేమ, ఆప్యాయత మరవలేనిదని తెలిపారు. మరోవైపు శింగనమల ఎమ్మెల్యేగా బండారు శ్రావణి రేపు అసెంబ్లీలో ప్రమాణం చేయనున్నారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూలై 2వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. ఫీజు వివరాలకు https://nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.

తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బదిలీ అయ్యారు. మైనింగ్, జియాలజీ శాఖ కమిషనర్‌గా పదోన్నతిపై వెళ్తుండడంతో కలెక్టరేట్ అధికారులు ఆయనను ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తోంది ఎంపీపీ కాలనీలోని స్పోర్ట్స్ ఎరీనా ప్రాంగణంలో ఉన్న ఇండోర్ స్టేడియంలో యోగాడే వేడుకలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం తెలిపింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొవాలని జిల్లా కలెక్టర్ తరఫున తెలిపారు.

5 నుంచి15 సంవత్సరాల పిల్లలు అందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండాలని అల్లూరి జిల్లా DEO బ్రహ్మాజీరావు అధికారులను, హెచ్‌ఎంలను ఆదేశించారు. రంపచోడవరంలో గురువారం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయాలని ఆదేశించారు. ప్రతీ ఉపాధ్యాయుడు, విద్యార్థుల హాజరు నిర్ణీత సమయంలో వేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.