India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు నూతనంగా డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మద్దేపల్లి సత్యానందరావు నియమితులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా టీకే విశ్వేశ్వర్ రెడ్డిని నియమించారు.

కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో ‘108 పాదరసాల శివలింగం’ భక్తుల పూజలందుకుంటోంది. శివకుమార్ అనే మహర్షి రాష్ట్రాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చిన సందర్భంలో లింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ లింగాన్ని పూజిస్తే కోటి లింగాలకు పూజ చేసిన ఫలితం కలుగుతందని భక్తుల నమ్మకం. ఏటా శివరాత్రికి ముందు రోజు అన్నపూర్ణకు, శివునికి వివాహం జరుపుతారని, పాదరసాలతోనే అభిషేకాలు చేస్తారు. మీరు ఎపుడైనా వెళ్లారా..?

విజయనగరం జిల్లాలో ఆదివారం ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి హైకోర్ట్ జడ్జిలను నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లక్ష్మణరావు ఈ నెల 6న ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా హైకోర్టు ఇన్‌ఛార్జి జడ్జిగా జస్టిస్ జయసూర్యను నియమించారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన కనుమూరు రవిచంద్రారెడ్డి అధికార ప్రతినిధిగా పలు టీవీ డిబేట్లలో YCP వాయిస్ వినిపించారు. MLAలు, MPలతో పాటు కొందరు నేతలతో టీవీ డిబేట్లలో పాల్గొనే వాళ్ల లిస్ట్‌ను YCP తాజాగా విడుదల చేసింది. వీళ్లను తప్ప మిగిలిన వాళ్లను డిబేట్లకు పిలవకూడదని.. వాళ్ల కామెంట్స్‌కు పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ జాబితాలో రవిచంద్రా రెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

కడప జిల్లాలో నేటి ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిద్దవటం మండలంలోని కడప-చెన్నై జాతీయ రహదారి బొగ్గిడివారిపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ఆటో ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందగా.. నలుగురు గాయాలయ్యాయి. ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వస్తోంది. ఏపీ దుస్థితికి చలించి పోయిన వారంతా విరాళాలు ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు, NRIలు పలువురు, ఏపీ ఉద్యోగుల సంఘం తమ విరాళాలను ప్రకటించింది. ఇంకా పలువురు ప్రముఖులు విరాళాలను ప్రకటిస్తూనే ఉన్నారు. విరాళాలు అందజేసిన దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. సంజామల పాలేరు వాగు పరివాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను మంత్రి శనివారం పరిశీలించారు. రైతులు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. పంట నష్టపరిహారంపై సమగ్ర నివేదిక తయారు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

గూడూరు బైపాస్ జంక్షన్‌లో శనివారం సాయంత్రం గంజాయి దొరికింది. అనంతపురం, గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురి నుంచి 30 కేజీల 900 గ్రాముల గంజాయి సీజ్ చేసినట్లు రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు. వీరు వైజాగ్ నుంచి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. గంజాయి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని.. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో భీమడోలు శ్రీ వెంకటేశ్వర కళాశాల (స్కిల్ హబ్)లో ఈ నెల 10వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి సుధాకర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 180 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీలలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 30ఏళ్ల వయసు వారు అర్హులని తెలిపారు.
Sorry, no posts matched your criteria.