India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం పాగోడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నేతింటి వైకుంఠరావు ఆదివారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. తన ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్తుండగా.. విజయనగరం జిల్లా తగరపువలస సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మే- మాసానికి సంబంధించి కలెక్టర్ శివ శంకర్ ఆదివారం స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలో గల 2,83,665 మంది పింఛన్ దారులకు రెండు విధాలుగా.. మే ఒకటో తేదీ నుంచి పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. డీబీటీ ద్వారా వారి ఖాతాలోకి ఒక పద్దతి, రాలేని వారికి ఇంటి వద్ద సచివాలయ సిబ్బంది ఇవ్వడం మరో పద్దతి అన్నారు.
జిల్లా ఎండ తీవ్రతతో మండిపోతోంది. ఆదివారం ఉదయం నుంచే ఎండ తీవ్రతతో పాటు వేడిగాలులతో ప్రజానీకం ఉక్కిరిబిక్కిరైంది. మార్కాపురం, కంభం, అర్దవీడులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా అనేక మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా పశ్చిమ ప్రాంత మండలాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.
తిరుమలలో శ్రీవారి గురువు జగద్గురు భగవద్ శ్రీరామానుజ ఉత్సవాలు మే 3న ప్రారంభం అవుతాయి. 4న సర్వ ఏకాదశి, 10న అక్షయ తృతీయ నిర్వహిస్తారు. 12న జగద్గురు భగవద్ శ్రీ రామానుజ(శ్రీ భాష్యకారుల) శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరుపుతారు. 22న నృసింహ జయంతి, నమ్మాల్వార్ వార్షిక శాత్తుమొర, 23న అన్నమాచార్య జయంతి జరుగుతుంది.
మే 1వ తేదీ నుంచి 5వ తేదీలోగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, తదితర ఫించనుదారులు 1,26,773 మంది, మెడికల్ ఫించన్లు పొందుతున్న వారు 1,121 మంది కలిపి 1,27,894 మందికి పంపిణీ చేయాల్సి ఉందన్నారు. గత నెలలో 99.18 శాతం ఫించన్లు పంపిణీ చేసి రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచామని, అదే స్ఫూర్తితో ఈనెల కూడా ఫించన్లు పంపిణీ చేయాలన్నారు.
ఏలూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిమిత్తం సువిధ ద్వారా 2,255 అభ్యర్థనలు వచ్చాయని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడించారు. వీటిలో 2,162 అభ్యర్థనలకు అనుమతులు ఇచ్చామన్నారు. ఇంకా 93 పరిశీలనలో ఉన్నాయన్నారు. సి-విజిల్ ద్వారా 439 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. అటు ఎన్నికల ఉల్లంఘనలపై వచ్చిన 114 ఫిర్యాదులు పరిష్కరించామని స్పష్టం చేశారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల విషయంలో హేతు భద్రత కలిగి ఉండాలని ఎన్నికల పరిశీలకులు అన్బు కుమార్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సాధారణ, వ్యయ, పోలీసు పరిశీలకులు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పారదర్శకంగా, ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలన్నారు.
ప్రొద్దుటూరు రామేశ్వరంలోని శ్రీముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం స్వామి, రాజరాజేశ్వరి దేవీకి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. రాత్రి గంగా రాజరాజేశ్వరి సమేత ముక్తి రామలింగేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి నంది వాహనంపై ఆశీనులు చేశారు. భక్తులు స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు.
ఎన్నికలలో ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మే 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ప్రాంతాన్ని ఆళ్ల నాని కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం బహిరంగ సభను వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
రాజకీయ పక్షాలు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా ఆదివారం తెలిపారు. ఓట్లను పొందటం కోసం కులం, మత పరమైన భావాల పరంగా అభ్యర్థనలు చేయరాదన్నారు. ఎన్నికల ప్రచారం కోసం మసీదులు, చర్చీలు, దేవాలయాలు లేక మరే ఆరాధనా ప్రదేశాలనూ వేదికగా ఉపయోగించకూడదన్నారు. నాయకులు, కార్యకర్తల వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయరాదన్నారు.
Sorry, no posts matched your criteria.