India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మండలంలోని పెద్ద కొజ్జిరియా జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న భార్యాభర్తలతో పాటు ఓ చిన్నారికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సోంపేట ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అరటిపండు తొక్కలాగా జగన్ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలో పడేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. ఏలేశ్వరంలో పవన్ ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. దళితుల కోసం గత టీడీపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టిందన్నారు.
కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలోని వల్లూరు మండలం తోల్లగంగనపల్లె సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కడప నుంచి కమలాపురం వైపు బైక్‌లో వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడులో భారీ మద్యం డంపును సెబ్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన గంగిరేగుల వెంకట్‌రావు గోవా నుంచి తెచ్చిన 180ML బాటిళ్లు 1001లను మరోచోటకి తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు సెబ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు విలేకరులతో మాట్లాడుతూ.. అతని కాల్ డేటా ఆధారంగా మిగిలిన నిందితులను గుర్తించి కేసు నమోదు చేస్తామని చెప్పారు.
పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే నాగరాజు రెడ్డి ఆదివారం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. నేడు తాడిపత్రిలో జరిగిన సీఎం సభలో జగన్ ఆయనకు వైసీపీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని నాగరాజు తెలిపారు.
సర్వేపల్లి మాజీ MLA ఈదురు రామకృష్ణారెడ్డి సోదరుడు రాంప్రసాద్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయనకు వైసీపీ కండువా కప్పారు. ముత్తుకూరు మండలంలో రాంప్రసాద్ రెడ్డికి గట్టిపట్టుందని.. అలాంటి నాయకుడు వైసీపీలోకి రావడం సంతోషంగా ఉందని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని షర్మిల స్పష్టం చేశారు. విశాఖ నగరం అక్కయ్యపాలెం, మహారాణి పార్లర్ వద్ద రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీగా సత్యారెడ్డిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తారని చెప్పారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని ఎద్దేవా చేశారు. విశాఖ అభివృద్ధికి ఈ ఐదేళ్లలో వైసీపీ చేసిందేమీ లేదని మండిపడ్డారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ప్రచారానికి సీఎం జగన్ రానున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు కలికిరికి చేరుకుంటారు. కలికిరి నాలుగు రోడ్ల కూడలిలో జరిగే బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ మేరకు వైసీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మండలంలోని దింటి మెరక ప్రధాన పంట కాలువ గట్టుపై ఆదివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమయింది. కోడూరు ఎస్సై శిరీష కాలువ గట్టుపై నివసిస్తున్న యానాదుల గుడిసెల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం అందిందన్నారు. ఈ విషయంపై అవనిగడ్డ సీఐ త్రినాథ్ మృతుడి వివరాలు, మరణానికి గల కారణలపై విచారణ జరుపుతున్నట్లు ఎస్సై చెప్పారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మే 1 నుంచి 5వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ చేపడతామని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం వెల్లడించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో పెన్షన్ సొమ్ము జమ చేస్తామన్నారు. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మంచానికి పరిమితమైన వారు, సైనిక, సంక్షేమ పింఛన్లు పొందే వారికి ఇంటి వద్దనే సెక్రటేరియట్ సిబ్బంది పెన్షన్లు అందజేస్తారన్నారు.
Sorry, no posts matched your criteria.