India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా వైద్య అధికారులతో కలెక్టర్ టీఎస్ చేతన్ సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2023 నుంచి 2024 వరకు ఐదు మాతృ మరణాలు, 32 శిశు మరణాలు సంభవించడం దారుణమన్నారు. ప్రతి మరణానికి కారణాలు క్షుణ్ణంగా విశ్లేషించాలన్నారు. వైద్యశాలలో అన్ని సదుపాయాలు కల్పించిన తీరు మారలేదు అన్నారు. కార్యక్రమంలో సంబంధిత వైద్య అధికారులు పాల్గొన్నారు.

అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో పాచిపెంట మండలంలో అన్ని పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. ఈ మేరకు రెవిన్యూ డివిజనల్ అధికారి కే.హేమలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాచిపెంట తహశీల్దార్, మండల విద్యాశాఖ అధికారి సిఫార్సుల మేరకు సెలవు ప్రకటించినట్లు ఆమె తెలిపారు.

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కుమార్తె రేష్మిత చిన్న వయసులో పెద్ద మనసు చాటుకున్నారు. విజయవాడ ప్రాంతంలో అజిత్ సింగ్ నగర్‌లో సర్వం కోల్పోయిన మహిళలకు 50 చీరలతో పాటు నిత్యావసర సరుకులైన బియ్యం, పప్పులు, అరటి పళ్ళు పంపిణీ చేశారు. పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా రేష్మిత మాట్లాడుతూ.. తన వంతుగా కొందరు బాధితులకు సాయం అందించానని అన్నారు.

విజయవాడ వరద బాధితుల సహాయార్థం నెల్లూరు జిల్లా రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు తమ దాతృత్వం చాటుకున్నారు. గురువారం సీఎం సహాయనిధికి రూ.1,10,116 చెక్కును కలెక్టర్ ఆనంద్‌కు అందించారు. అసోసియేషన్ ట్రెజరర్ మస్తానయ్య మరో రూ.15 వేల చెక్కును అందజేశారు. రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులను కలెక్టర్ అభినందించారు.

భారతదేశ తొలి ఉపరాష్ట్రపతిగా చరిత్ర లిఖించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు మన అనంతపురంతో ప్రత్యేక అనుబంధం ఉంది. స్వాతంత్య్రానికి ముందు తన ఉద్యోగ రీత్యా అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ సమయంలో నగరంలోని రెండో రోడ్డులో ఓ అద్దె ఇంట్లో కొంతకాలం నివసించారు.

డెంకాడ మండలంలోని చింతలవలస గ్రామంలో MVGR ఇంజినీరింగ్ కళాశాలకు సమీపంలో ఉన్న నీలగిరి తోటలో గంజాయి విక్రయిస్తున్న, తాగుతున్న ఏడుగురిని అరెస్టు చేశామని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపారు. స్థానిక పోలీసులు వచ్చిన పక్కా సమాచారం మేరకు రైడ్ చేయగా గంజాయి అమ్ముతున్న ముగ్గురితో పాటు, తాగుతున్న మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారని, వారి వద్ద నుండి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

జిల్లాలోని పర్యాటక కేంద్రాలు, ప్రముఖ ఆలయాలను కలుపుతూ కళింగ టెంపుల్ సర్క్యూట్ టూరిజంను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. అందుకు తగ్గ ప్రతిపాదనలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పర్యాటక ప్రాజెక్టుల ప్రగతిపై సంబంధిత శాఖలతో కలెక్టరేట్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. కళింగ టెంపుల్ సర్క్యూట్ టూరిజం ప్రసాదం పథకంకు ఎంపిక అయ్యేలా కేంద్ర మంత్రి సహకారం తీసుకుందామన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న బాధితుల సహాయార్థం పెమ్మసాని ఫౌండేషన్ రూ. కోటి విరాళం అందించారు. పెమ్మసాని ఫౌండేషన్ తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి రూ. కోటి చెక్కును కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అందజేశారు. విజయవాడ కలెక్టరేట్‌లో రివ్యూ కార్యక్రమాల్లో పాల్గొని, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సమక్షంలో ఆయన చెక్కు అందజేశారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం తాడిపూడిలో టాటాఏస్ వాహనం ఢీకొని రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఇర్లపాటి నరేష్ టెంట్ హౌస్ వ్యాపారం చేస్తాడు. గురువారం అతడి వద్ద పనిచేసే గూడపాటి బాబి ఇంటి వద్ద ఉన్న సామగ్రి తీసుకువెళ్లడానికి టాటాఏస్‌పై వచ్చాడు. అక్కడ ఆడుకుంటున్న నరేష్ కుమారుడు లాస్విక్(2)ను గమనించకుండా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. SI శ్రీనివాస్ కేసు నమోదు చేశారు.

అన్నమయ్య జిల్లా రామాపురం మండల పరిధిలోని డాక్టర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఆర్ట్ మాస్టర్ డి ఆనంద్ రాజు, తన రక్తంతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వి.వి వరప్రసాద్ సిబ్బంది కలసి ఆర్ట్ మాస్టర్ ఆనంద్ రాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.