India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప.గో జిల్లాలో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. నెల రోజుల నుంచి పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం కేజీ రూ.80 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. అదే రైతుబజారులో అయితే రూ.66 ఉంది. ఆయా చోట్ల వర్షాలతో పంట నష్టం జరిగిందని అందుకు ఉత్పత్తి తగ్గి ఉన్న సరకుకి మంచి డిమాండ్ ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు.

చీమకుర్తి మండల పరిధిలో పరివర్తకం మార్పిడి పనుల కారణంగా కె.వి.పాలెం, ఏలూరివారిపాలెం, గోనుగుంట, రామచంద్రాపురం, పిడతలపూడి, మర్రిపాలెం, మువ్వవారిపాలెం, జీఎలప్పురం గ్రామాలకు.. గురువారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈఈ కృష్ణారెడ్డి, ఏడీఈ శ్రీనివాసరావు తెలిపారు. చీమకుర్తి ఉపకేంద్రం పరిధిలోని పరిశ్రమలకు సైతం అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.

గుంతకల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన సూర్యనారాయణపై ఎస్సీ, ఎస్టీ, లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ సురేశ్ బుధవారం తెలిపారు. ఎస్ఐ వివరాలు.. సూర్యనారాయణ ఓ మహిళను గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిపారు. మంగళవారం రాత్రి ఆ మహిళ ఇంట్లోకి చొరబడి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత మహిళ, ఆమె భర్త బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

కర్నూలు జిల్లాలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. ఆదోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ తేజోమూర్తి వైఎస్సార్ జిల్లా చిన్న చౌక్ స్టేషన్‌కు, ప్రొద్దుటూరు ఫ్యాక్షన్ జోన్‌లోని కంబగిరి రాముడు కర్నూలు సీపీఎస్‌కు బదిలీ అయ్యారు. చచిన్న చౌక్ పీఎస్ సీఐ భాస్కర్ రెడ్డి, ఖాజీపేట అర్బన్ సీఐ రామాంజనేయులును కర్నూలు రేంజ్ వీఆర్‌కు పంపుతూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

యద్దనపూడి మండలం వింజనంపాడు అధికార పార్టీ ఫ్లెక్సీలను చించివేసిన ఘటన కలకలం రేపింది. వైసీపీకి చెందిన సీనియర్ నేత సమక్షంలోనే ఆ పార్టీ కార్యకర్త కావాలనే సమీపంలో ఉన్న టీడీపీ ఫ్లెక్సీ చించివేయడంపై ఆగ్రామ టీడీపీ నేతలు యద్దనపూడి పోలీసులను ఆశ్రయించారు. కావాలని వైసీపీ నాయకులు, శ్రేణులు అధికార టీడీపీకి చెందిన ప్లెక్సీలు చించివేయడంపై ఆ గ్రామాల్లో కలకలం రేపుతోందని గ్రామస్థులు పేర్కొన్నారు.

టమాట ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు వాటిని కొనలేక ఇబ్బంది పడుతున్నారు. గోపాలపట్నం రైతు బజార్‌లో బుధవారం కిలో టమాట రూ.58కి విక్రయించారు. బయట మార్కెట్లో కిలో ధర రూ.75 వరకు ఉందని వినియోగదారులు తెలిపారు. టమాటోతో పాటు ఉల్లి ధర కూడా కిలో రూ. 50 దాటింది. రోజు కూరల్లో వినియోగించే వీటి ధరలు తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు.

పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో రూ.1.36 కోట్ల జనరల్ ఫండ్ దుర్వినియోగం జరిగింది. ఈ విషయమై సంబంధిత అధికారులకు మెమో జారీ చేసినట్లు ఎంపీడీవో మునిరెడ్డి వెల్లడించారు. జడ్పీ సీఈవో గ్లోరియా ఆదేశాల మేరకు గతంలో పుంగనూరు ఎంపీడీవో, ఏవోగా పని చేసిన వారికి నిధుల దుర్వినియోగంపై సంజాయిషీ నోటీసులు ఇచ్చామని చెప్పారు. మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

వర్షాల కారణంగా టమాట పంటలు దెబ్బతింటున్నాయి. ఈ కారణంగా వ్యాపారులు టమాటాలను దిగుమతి చేయట్లేదు. వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ శాఖ పుంగనూరు నుంచి టమాటాలను కొనుగోలు చేసి కడప రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్ ద్వారా అమ్మకాలు చేపట్టింది. వినియోగదారులకు కిలో రూ.60 విక్రయిస్తున్నారు. కాగా కొన్ని ప్రాంతాల్లో కిలో టమాటా రూ.70 నుంచి రూ.80 పలుకుతోంది.

సంతబొమ్మాలి, నౌపడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగూడు, గంటపేటలోని అమ్మవారి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని స్థానికులు వాపోయారు. అమ్మవారి ఉత్సవాల పేరుతో మంగళవారం రాత్రి గ్రామాల్లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయించడం వివాదాస్పదంగా మారింది. సంతబొమ్మాలి, నౌపడ పోలీస్ స్టేషన్లకు సమీపంలో నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో పలువురు మండిపడుతున్నారు.

ఈ నెల 24 నుంచి ‘మీకోసం’ కార్యక్రమాన్ని అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి దయానిధి ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి బదులుగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.