Andhra Pradesh

News September 2, 2024

We miss you, Dad: జగన్

image

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం తన తండ్రిని గుర్తు తెచ్చుకుని ‘We miss you, Dad’ అని ట్వీట్ చేశారు. దీనికి నివాళి అర్పించిన ఫొటోలను జత చేశారు.

News September 2, 2024

విశాఖ: ట్రైన్ టికెట్ రీఫండ్‌కు హెల్ప్‌డెస్క్

image

వాల్తేరు డివిజన్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రద్దు చేశారు. ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరింత సమాచారం కోసం విశాఖపట్నంలో 0891-2746330, 0891-2744619.. విజయనగరంలో 8712641260, 08922 221202 నెంబర్లతో హెల్ప్‌డెస్క్‌లను అందుబాటులోకి తెచ్చారు.

News September 2, 2024

తూ.గో.: సముద్రంలోకి 4,82,213 క్యూసెక్కుల జలాలు

image

గోదావరి జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఆదివారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి డెల్టా కాలువలకు నీటి విడుదలను తగ్గించారు. ఆదివారం సాయంత్రం డెల్టా కాలువలకు మొత్తం 3,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజీ నుంచి 4,82,213 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలినట్టు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

News September 2, 2024

3వ తేదీ నుంచి ఒంటిమిట్టలో పవిత్రోత్సవాలు

image

ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో మంగళవారం నుంచి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు, ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో నరేశ్ బాబు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరంలో వివిధ కరణాల వల్ల, తెలిసీ తెలియక జరిగిన దోషాలను నివారించేందుకు ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని ఆయన తెలియజేశారు.

News September 2, 2024

శ్రీకాకుళం: 7న మద్యం దుకాణాల బంద్

image

శ్రీకాకుళం జిల్లాలో ఈనెల 7న మద్యం షాపులు బంద్ కానున్నాయి. నూతన మద్యం పాలసీ తీసుకురానున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 7న రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల బంద్ నిర్వహించాలని ఏపీ స్టేట్‌బేవరేజస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. నూతన మద్యం పాలసీ పేరిట మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆరోపించారు.

News September 2, 2024

నేడు SKUలో జరగాల్సిన పరీక్షలు వాయిదా

image

అనంతపురం జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన ఎంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షలను భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. నేడు జరగాల్సిన పరీక్షను సెప్టెంబర్ 11వ తేదీన నిర్వహిస్తామని ఈ మార్పును విద్యార్థులు గమనించాలని కోరారు.

News September 2, 2024

నెల్లూరు: 7న మద్యం దుకాణాల బంద్

image

నూతన మద్యం పాలసీ తీసుకురానున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 7న రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల బంద్ నిర్వహించాలని ఏపీ స్టేట్‌బేవరేజస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. వారు మాట్లాడుతూ.. నూతన మద్యం పాలసీ పేరిట మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ఇదే జరిగితే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.

News September 2, 2024

అందాల పోటీల్లో మెరిసిన విశాఖ యువతి

image

అమెరికాలోని అట్లాంటాలో జరిగిన అందాల పోటీల్లో విశాఖ నగరానికి చెందిన డాక్టర్ తిరుమలిని దాసరి మెరిశారు. మిస్సెస్ ఇండియా యూఎస్ఏ టైటిల్ గెలుచుకున్నారు. విశాఖ ఆంధ్ర మెడికల్ కళాశాలలో MBBS చదివారు. ప్రస్తుతం అమెరికాలో రుమటాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. మిస్సెస్ ఇండియా యూఎస్ఏ టైటిల్ గెలుచుకున్న ఆమెకు సినీ నటి అమీషా పటేల్ టైటిల్ అందజేశారు.

News September 2, 2024

శ్రీకాకుళం: తహశీల్దార్లకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు

image

శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు తహశీల్దార్లకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు వచ్చాయి. రాష్ట్రంలో పలువురిని ఉద్యోగోన్నతి లభించగా.. వారిలో ముగ్గురు మన జిల్లాకు చెందిన తహశీల్దార్లు ఉన్నారు. సాదు దిలీప్ చక్రవర్తి, పప్పల వేణుగోపాలరావు, ఆమెపల్లి సింహాచలం ప్రమోషన్లు పొందారు.

News September 2, 2024

విజయనగరం: గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు

image

విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గణేశ్ గుడివద్ద గుర్తుతెలియని మృతదేహం గుర్తించినట్లు ఒకటో పట్టణ సీఐ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40- 45 మధ్య ఉంటుందన్నారు. చుట్టూ పక్కల వారిని విచారణ చేయగా ఫలితం లేదని, మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్‌లో భద్రపరిచామన్నారు. ఆచూకీ తెలిసినవారు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌‌ను సంప్రదించాలని కోరారు.