Andhra Pradesh

News April 26, 2024

శ్రీకాకుళం: కంట్రోల్ రూం పరిశీలన

image

నూతన కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి జనరల్ అబ్జర్వర్ సందీప్ కుమార్ గురువారం పరిశీలించారు. కంప్లైంట్ మోనిటరింగ్ సెల్, సీ-విజిల్స్ టీం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, పోస్టల్ బ్యాలెట్, ఎక్సైజ్ కంట్రోల్ రూం, పోలీస్ కంట్రోల్ రూం, తదితర వాటిని ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News April 26, 2024

మే 1వ తేదీన ఏలూరులో జగన్ పర్యటన

image

వైసీపీ అధినేత YS జగన్ మోహన్ రెడ్డి మే 1వ తేదీన ఏలూరులో నిర్వహించనున్న ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పర్యటన వివరాలను గురువారం విడుదల చేశారు. 1వ తేదీన (బుధవారం) మధ్యాహ్నం 3 గంటలకు సభలో పాల్గొంటారని పేర్కొన్నారు.

News April 26, 2024

మన్యం: కౌంటింగ్ కేంద్రాలను సందర్శించిన ఎన్నికల పరిశీలకులు

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కమాండ్ కంట్రోల్ రూమ్‌ను అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ప్రమోద్, శాంతి భద్రతల పరిశీలకులు నయీం ముస్తఫా మన్సూరి గురువారం సందర్శించారు. జిల్లాకు విచ్చేసిన సాధారణ పరిశీలకులు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఎన్నికల ప్రవర్తన నియమావళి విభాగం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

News April 26, 2024

ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి: ఎన్నికల పరిశీలకులు అమిత్ శర్మ

image

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అధికారులందరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా అధికారులను విశాఖపట్టణం లోక్ సభ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు అమిత్ శర్మ, పోలీసు పరిశీలకులు అమిత్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ సాహసంతో కూడుకున్నదని జాగరూకత వహిస్తూ ముందుకు సాగాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలను తూ.చా పాటించాలన్నారు.

News April 26, 2024

CTR: 27న పాలిసెట్ ప్రవేశ పరీక్ష

image

రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఆధ్వర్యంలో పాలిసెట్-2024 పరీక్ష ఈనెల 27న నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ డాక్టర్ జేమ్స్, ప్రిన్సిపల్ జగన్నాథరావు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరులో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కుప్పంలో 561 మంది, పలమనేరులో 1243 మంది విద్యార్థులు హాజరుకానుట్లు చెప్పారు. విద్యార్థులు ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని సూచించారు.

News April 26, 2024

పల్నాడు: జిల్లాలో ఏడో రోజు 89 నామినేషన్లు 

image

జిల్లాలో ఏడవ రోజు గురువారం మొత్తం 89 నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. నరసరావుపేట పార్లమెంట్‌కు 11, నరసరావుపేట అసెంబ్లీకి 14, పెదకూరపాడు అసెంబ్లీకి 10, చిలకలూరిపేట అసెంబ్లీకి11 సత్తెనపల్లి అసెంబ్లీకి 9, వినుకొండ అసెంబ్లీకి 12, గురజాల అసెంబ్లీకి 13, మాచర్ల అసెంబ్లీకి 9 నామినేషన్లు దాఖలు చేశారని ఆయన పేర్కొన్నారు. 

News April 26, 2024

NTR: ఎన్నికల పరిశీలకుడిగా న‌రీంద‌ర్ సింగ్ బాలి

image

జ‌గ్గ‌య్య‌పేట‌, నందిగామ, మైల‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సాధార‌ణ పరిశీలకులుగా విచ్చేసిన ఐఏఎస్ అధికారి న‌రీంద‌ర్ సింగ్ బాలితో ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఢిల్లీ రావు గురువారం భేటీ అయ్యారు. విజ‌య‌వాడ‌లోని మునిసిప‌ల్ గెస్ట్ హౌస్‌లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా వారిని క‌లిసి పుష్ప గుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

News April 25, 2024

నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ నంబర్లకు ఫోన్ చేయండి: నంద్యాల కలెక్టర్

image

ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థుల నిబంధనలు ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేయవచ్చని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలో 08514-293917, ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 08514-293910, శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీస్ అబ్జర్వర్ హిమాన్సు శంకర్, 08514-293913 నంబర్లకు ఫిర్యాదులు అందించాలని విజ్ఞప్తి చేశారు.

News April 25, 2024

చంద్రబాబుకు సాదర వీడ్కోలు

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేట, కోడూరు బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి టీడీపీ, జనసేన నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. వాళ్లు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

News April 25, 2024

27న పెద్దాపురానికి పవన్ కళ్యాణ్

image

పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈనెల 27న వస్తున్నట్లు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సామర్లకోట రింగ్ రోడ్ సెంటర్లో శనివారం సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తామని, పవన్ కళ్యాణ్ సహా ఎన్డీఏ నేతలు పాల్గొంటారని తెలిపారు. పవన్ కళ్యాణ్ సభకు ఏర్పాట్లు చేపట్టినట్లు టౌన్ అధ్యక్షులు అడబాల కుమార్ స్వామి తెలిపారు.

error: Content is protected !!