India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిత్తూరు జిల్లా యాదమరి వద్ద లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. పెరియంబాడికి చెందిన సంపత్(34) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై బస్ స్టాప్నకు వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. కిందపడిపోవడంతో సంపత్ తలకు తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అతడి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి 36 ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పశువులకు గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలకు సంబంధించి గోడ పత్రికలను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సోమవారం ఆవిష్కరించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వైవీ రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 19 వరకు జిల్లా వ్యాప్తంగా ఐదో విడత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తారని, పాడి రైతులు వినియోగించుకోవాలని కోరారు.

చట్ట పరిధిలో ఉన్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 25 ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ లో సూచించారు.

మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేసి, మహిళలకు భద్రత కల్పించాలని ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కన్వీనర్ రామకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రాయలసీమ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం సమాజానికి సిగ్గుచేటని అన్నారు.

ఫేక్ ప్రొఫైల్ DPలతో అపరిచిత ఫోన్ నంబర్ల నుంచి వచ్చే నగదు అభ్యర్థనలకు స్పందించకండి అని ప్రకాశం జిల్లా ఎస్బీ దామోదర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. స్నేహితుల ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ల DPలుగా పెట్టుకొని మోసాలకు పాల్పడతారని అటువంటి వారిపై జాగ్రత్తగా ఉండాలన్నారు.

ప.గో జిల్లాలో ఈనెల 20న జరగాల్సిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని SEP 17కు, ‘మాప్ అప్ దినం’ను SEP 25కు మార్చినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఏటా 2సార్లు నులిపురుగుల నిర్మూలన దినోత్సవం జరుగుతుందని, అంగన్వాడీలు విద్యా సంస్థల్లోని 19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయాలన్నారు. నరసాపురంలో 23వ తేదీన జరిగే ఉద్యోగ దిక్సూచి కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మరికాసేపట్లో సోమశిలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన గురుకుల పాఠశాల వద్ద హెలిపాడ్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జలాశయం వద్ద నుంచి గ్రామంలో వరకు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే భారీగా కూటమి నాయకులు చేరుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమశిలకు చేరుకున్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ పథకం ద్వారా రూ.వేల కోట్లు నిధులు వెచ్చిస్తున్నామని, ప్రతి రూపాయిని బాధ్యతతో ఖర్చు చేయాలన్నారు.

మంత్రి నిమ్మల రామానాయుడుకు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని మహిళలు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. అనురాగం, ఆప్యాయత, అనుబంధాలకు రాఖీ పండుగ ప్రతీక అని అన్నారు. కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.