India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సాలూరులో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. టౌన్ సీఐ వాసునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీ థియేటర్, చిన్ని లాడ్జి ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో గుర్తు తెలియని మృతదేహం ఉందని మంగళవారం సాయంత్రం వచ్చిన సమాచారం మేరకు వెళ్లి పరిశీలించామన్నారు. మృతదేహం గుర్తు పట్టలేనంతగా కుళ్లిపోయిందని సీఐ తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్సై సీతారం చెప్పారు.

నెల్లూరు జిల్లాలోని పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ కె.ఆరీఫ్ హఫీజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం నెల్లూరులోని పోలీస్ కార్యాలయంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. సబ్ డివిజన్ పరిధిలో నేర సమీక్షలు నిర్వహించాలని, లోక్ అదాలత్‌పై అవగాహన, రాత్రి పూట గస్తీ పటిష్టం చేయాలని, స్కూల్స్ కళాశాలలు ప్రారంభం, ముగింపు సమయంలో తప్పకుండా విజబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు.

ఉమ్మడి తూ.గో జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘పుష్ప-2’ మూవీ షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ మూవీలో హీరో అల్లుఅర్జున్ వినియోగించిన లారీతో పాటు జీపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉన్నాయి. వీటి వద్ద అభిమానులు, పర్యాటకులు పలువురు ఫొటోలు దిగుతున్నారు.

ఎన్నికలకు సంబంధించిన కేసుల్లో అరెస్టు కావలసిన ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశించారు. మంగళవారం చిలకలూరిపేట టౌను, రూరల్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించారు. సిబ్బంది సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని పాతూరు రైల్వే గేట్ సమీపంలో మంగళవారం కదులుతున్న రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు బిహార్ రాష్ట్రానికి చెందిన సుజన్ మహాల్దార్(24)గా గుర్తించామన్నారు. డెడ్‌బాడీని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

జమ్మలమడుగు మున్సిపాలిటీలో 3 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని ఛైర్‌పర్సన్ శివమ్మ అధ్యక్షతన నిర్వహించారు. మున్సిపాలిటీకి సాధారణ నిధులు ఎంత మేర వస్తున్నాయి, ఎంత ఖర్చు చేశారన్న విషయాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ విస్తరణలో భాగంగా అభివృద్ధికి భూములను ఇచ్చిన రైతులు, భూ యజమానులకు చెల్లించవలసిన నష్టపరిహారంపై, తగిన ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి గన్నవరం విమానాశ్రయ విస్తరణ సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన రైల్వే కోడూరు మండలం బొజ్జవారిపల్లె గ్రామంలో జరిగింది. మంగళవారం సాయంత్రం రైతు జనార్ధన్(51) పొలానికి నీరు పెట్టడానికి వెళ్లగా అక్కడ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఉదయగిరి మండలంలోని ఏపీ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ పుష్పరాజ్ తెలిపారు. ఇంగ్లిష్, టీజీటీ, గణితం, బయోలాజికల్ సైన్స్, పీజీటీ, ఫిజికల్ సైన్స్ గెస్ట్ ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నాయన్నారు. 2018 డీఎస్సీ గైడ్లైన్స్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు విద్యార్హతల జిరాక్స్ కాపీలను ఈనెల 24వ తేదీలోపు అందించాలన్నారు.

వయోవృద్ధుల దర్శనార్థం వారి టికెట్లకు సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది పూర్తిగా అబద్దమని, ఇటువంటి ఫేక్ న్యూస్ భక్తులు నమ్మొద్దని TTDవిజ్ఞప్తి చేసింది. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం TTD ప్రతినెల 23న 3నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోందన్నారు. www.tirumala.org, https://ttdevastanams.ap.inను మాత్రమే సంప్రదించగలరన్నారు.
Sorry, no posts matched your criteria.