India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. తేలు కుట్టి పదేళ్ల బాలుడు మృతి చెందాడు. మూడు రోజుల క్రితం నాగచరణ్ ఆడుకుంటుండగా తేలు కుట్టింది. విషయాన్ని బాలుడు ఇంట్లో ఆలస్యంగా చెప్పాడు. దీంతో ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ బాలుడు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

ఏలూరుకు చెందిన దంపతులు రైలులో 20 కాసుల బంగారం, వెండి ఆభరణాలతో కూడిన బ్యాగ్ మర్చిపోగా.. రైల్వే పోలీసులు తిరిగి అప్పగించారు. శ్రీనివాసరావు-శ్రీదేవి సికింద్రాబాద్‌లో రైలు ఎక్కారు. ఏలూరులో దిగేటప్పుడు బ్యాగు మర్చిపోయారు. దానిలో ఆభరణాలు ఉండటంతో విజయవాడ జీఆర్పీ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి నిడదవోలు అవుట్ పోస్ట్‌కు సమాచారం రాగా హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు వెళ్లి ఆ బ్యాగును గుర్తించారు.

కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ కాలనీ దుర్గాదేవి ఆలయ జంక్షన్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కొండయ్యపాలెంకు చెందిన రిటైర్డ్ SI మోర్త అప్పారావు మృతి చెందారు. అప్పారావు ద్విచక్ర వాహనంపై కాకినాడ నుంచి యానాం వైపునకు వెళ్తుండగా రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కోరంగి పోలీసులు ఘటనాస్థలి చేరుకొని వివరాలు సేకరించారు.

విజయనగరం సంస్థానాధీశులు పీవీజీ రాజు సోషలిస్ట్ భావాలు గల అభ్యుదయవాది. 1952 నుంచి 1984 వరకు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించారు. 1952లో సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా, 1956లో ప్రజా సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. 1957లో విశాఖ లోక్ సభకు ఎన్నికయ్యారు. 1960 నుంచి 1964 వరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

కావలిలో రియల్ ఎస్టేట్ మాఫియా 123 ఎకరాలు ప్రభుత్వానికి చెందిన భూములను ఆక్రమించుకుంది వాస్తవమేనని కావలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు కిషోర్ బాబు పేర్కొన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి దొంగ సర్వే నెంబర్లతో అమ్ముతున్నారని అన్నారు. కావలి ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

పెండ్లిమర్రి మండలం నల్లయ్యగారి పల్లెకు చెందిన ప్రసాద్ రెడ్డికి సోమవారం మధ్యాహ్నం మహిళా బంధువులు దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. ప్రసాద్ రెడ్డి గత కొంతకాలంగా ఓ వివాహితకు ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తుండేవారు. దీంతో ఆమె బంధువులు ప్రసాద్ రెడ్డికి దేహ శుద్ధి చేశారు. అనంతరం ప్రసాద్ రెడ్డిని పోలీసులకు అప్పగించారు.

పరవాడ సినర్జిన్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కెమిస్ట్ సూర్యనారాయణ మృతి చెందాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వంగర మండలం కోనంగిపాడు గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. 15 రోజుల క్రితం మృతుడి భార్య సునీత మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనారోగ్య కారణంగా అప్పటి నుంచి భార్య కుమారుడు శ్రీకాకుళంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

‘మన టీడీపీ’ యాప్‌లో టాప్‌లో నిలిచిన టీడీపీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. యాప్ ద్వారా తెలుగుదేశంపార్టీ కంటెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లి టాప్ స్కోర్‌లో సాధించిన వారికి వారు ప్రశంస పత్రాలను పంపించారు. ఈ సందర్భంగా శింగనమల నియోజకవర్గంలో ఉత్తమ ప్రతిభ చూపిన కార్యకర్తలకు ఆ ప్రశంస పత్రాలను ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అందజేసి అభినందించారు.

గుంటూరు జిల్లాలోని ప్రజలకు ఎస్పీ సతీశ్ కుమార్ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కష్టసుఖాలు, గెలుపోటములు సమస్థితిలో చూడటమే శ్రీకృష్ణ తత్వమని అన్నారు. ఇది అందరికీ స్ఫూర్తిదాయకం, ఆచరణీయమన్నారు. జిల్లా ప్రజలు ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో పర్వదినాన్ని జరుపుకోవాలని చెప్పారు.

విజయనగరం మహారాజు డా.పీవీజీ రాజు రైతు బాంధవులుగా పేరొందారు. వారి పక్షాన పోరాడి జైలు జీవితం గడిపారు. 1949లో జామి మండలం అన్నమరాజుపేటలో కాలువ తవ్వకంలో శ్రమదానం చేశారు. కర్నూలు జిల్లా కలివెన్న గ్రామంలో ఈనాం సత్యాగ్రహంలో పాల్గొని 40 రోజులు జైలు శిక్ష గడిపారు. బిహార్‌లో జరిగిన రైతు ఉద్యమానికి పీవీజీ నాయకత్వం వహించి పూర్నియా జైలులో 45 రోజులు గడిపారు. నాగార్జున సాగర్ నిర్వాసితులకు అండగా నిలిచారు.
Sorry, no posts matched your criteria.