Andhra Pradesh

News June 18, 2024

గిద్దలూరు: లారీ, కారు ఢీకొని ఇద్దరికి గాయాలు

image

గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో మంగళవారం కారు, లారీ ఢీకొని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు గిద్దలూరు నుంచి నంద్యాల వెళ్తున్న కారు, నంద్యాల నుంచి గిద్దలూరు వైపు వస్తున్న లారీ మూల మలుపు వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు.

News June 18, 2024

నాయుడుపేట: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ 

image

నాయుడుపేట మండలం పండ్లూరు జాతీయ రహదారిపై నట్టేటి చెంగయ్య (70)ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామ సమీపంలోని పంట పొలాల వద్దకు నడిచి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 18, 2024

విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం

image

విజయవాడ- జక్కంపూడి ఫ్లైఓవర్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కొత్తపేట సీఐ గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన హర్షవర్ధన్ కంచికచర్లలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కాలేజీ పూర్తవగానే మంగళవారం మధ్యాహ్నం విజయవాడ బయలుదేరి ద్విచక్ర వాహనంపై వస్తుండగా లారీ ఢీకొంది. ఈ ఘటనలో లారీ టైరు అతనిపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

News June 18, 2024

శ్రీకాకుళం: సిరిమానోత్సవంలో అపశ్రుతి.. ఒకరి మృతి

image

ఎచ్చెర్ల మండల పరిధిలోని కుప్పిలి గ్రామంలో మంగళవారం గ్రామ దేవత శ్రీ అసిరితల్లి సిరిమానోత్సవంలో అపశ్రుతి నెలకొంది. స్థానికుల వివరాలు.. గ్రామంలో ఉరేగిస్తున్న సిరిమాను ఒక్కసారిగా విరిగిపోవడంతో సిరిమానుపై కూర్చున్న పూజారి కింద ఉన్న వారిపై పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించగా కారి పల్లేటి అనే వ్యక్తి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అప్పన్న అనే మరో వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా ఉంది.

News June 18, 2024

ATP: 5,27,620 మంది రైతులకు రూ.2 వేలు జమ

image

పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదలయ్యాయి. జిల్లాలోని రైతులకు రూ.2 వేలు చొప్పున అకౌంట్లలో జమకానుంది. అనంతపురం జిల్లాలోని 2,76,147 మంది రైతులకు రూ.55.23 కోట్లు, సత్యసాయి జిల్లాలోని 2,51,473 మంది రైతులకు రూ.50.29 కోట్ల మేర సాయం అందనుంది. లబ్ధిదారుల లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఈ లింక్ <>క్లిక్<<>> చేసి చూసుకోవచ్చు.

News June 18, 2024

వేటపాలెం: చావు దాక వెళ్లి తిరిగి వచ్చిన మత్స్యకారులు

image

వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెం సముద్రతీరానికి 27 కి.మీ దూరంలో బోటు బోల్తా పడిన ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన రాములు, చిట్టిబాబు, గోవిందు, శ్రీను వేటకు వెళ్ళగా..  సముద్రంలో గాలులకు ఒక్కసారిగా బోటు బోల్తా పడింది. ఐస్ బాక్సులు సహాయంతో సముద్రంలోనే 8 గంటలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు. ఓమత్స్యకారుడు అటు వెళ్తు వారిని గమనించి తనబోటులో ఒడ్డుకు తెచ్చినట్లు తెలిపారు.

News June 18, 2024

శ్రీకాకుళం: మంత్రులను కలిసిన ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లా జెడ్పీ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడును శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జీ.ఆర్ రాధిక మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం వివిధ శాఖల జిల్లా ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధులతో పలు అంశాలపై సమావేశం నిర్వహించారు.

News June 18, 2024

గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణపై కలెక్టర్ సమీక్ష

image

గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ విస్తరణలో భాగంగా అభివృద్ధికి భూములను ఇచ్చిన రైతులు, భూ యజమానులకు చెల్లించవలసిన నష్టపరిహారంపై, తగిన ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి గన్నవరం విమానాశ్రయ విస్తరణ సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

News June 18, 2024

జంతువు వెంట్రుకలు, అడుగులు ల్యాబ్‌కు పంపించాం: ఫారెస్ట్ అధికారి

image

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో నిన్న పులి కారును ఢీకొట్టింది. ఈ ఘటనపై ఆత్మకూరు ఫారెస్ట్ అధికారి శేఖర్ స్పందించారు. స్థానికుల సమాచారంతో అటవీ ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం నుంచి 25 మంది సిబ్బందితో తనిఖీలు చేయిస్తున్నట్లు చెప్పారు. గ్రామంలో కాపరులకు జంతువులు ఎదురైతే సమాచారం ఇవ్వాలని కోరారు. కారుకు తగిలిన వెంట్రుకలు, జంతువు అడుగులు ల్యాబ్ కు పంపించామని తెలిపారు.

News June 18, 2024

అమ్మవారి సేవలో సినీ దర్శకుడు త్రివిక్రమ్

image

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని మంగళవారం మాటల మాంత్రికుడు, ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద ఫోర్ట్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.