India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహణలో భాగంగా ఆయా అసెంబ్లీ నియోజక వర్గంలో ఏర్పాటు చేసే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి అవసరమైన తాగునీరు, అల్పాహారం, భోజనం వంటి వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని చెప్పారు.
సీఎం జగన్ పాలనలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, శ్యాండ్ మాఫియాతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంతో వెనుకబడిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. బుధవారం రాత్రి అనకాపల్లిలో ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆధ్వర్యంలో రోడ్ షో ర్యాలీగా నిర్వహించారు. మోదీ ప్రభుత్వం ఆంధ్రాలో 3,600 కి.మీ మేర జాతీయ రహదారులు నిర్మించారన్నారు. జగన్ వైఫల్యం వలన ఏపీ వెనుకబడి పోయిందన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్నూలు జిల్లాలో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రోజు నుంచి నేటి వరకు జిల్లాలోని పార్లమెంట్‌తో పాటు 8 నియోజకవర్గాలకు 180 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు తెలిపారు. పాణ్యం, కర్నూలు, కోడుమూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు సంబంధించి 161 మంది అభ్యర్థులు 180 నామినేషన్ పత్రాలను అందజేశారన్నారు.
తన విజయం కోసం సైకిల్ యాత్ర చేస్తున్న వ్యక్తిని కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మంగళవారం కలిసి కాసేపు సైకిల్ తొక్కిన విషయం తెలిసిందే. దీనిపై X (ట్విటర్) వేదికగా RGV స్పందించారు. ‘పై ఫొటొలో ఉన్నది నేను. ఇంటర్ చదవుతున్న రోజులవి. కింద ఎవరున్నారో నాకు తెలియదు. కానీ రెండు ఫొటోల్లో సైకిల్ కామన్. జై టీడీపీ’ అంటూ సెటైరికల్ కామెంట్ చేశారు.
టీడీపీకి మద్దతుగా హీరో బాలకృష్ణ ప్రచారానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన తొలివిడత స్వర్ణాంధ్ర సాకార యాత్ర పూర్తి అయ్యింది. రెండో విడతలో భాగంగా ఈనెల 26న నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కందుకూరులో సభ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. రూరల్, సిటీ నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారు.
ఇండియన్ రైల్వేస్‌లోని డీజిల్ లోకో షెడ్ నందు త్రీ ఫేజ్ జీ-9 ఎలక్ట్రికల్ ఇంజిన్ల నిర్వహణలో గుత్తి లోకో డీజిల్ షెడ్ సెకండ్ బెస్ట్ డీజిల్ షెడ్‌గా ఎంపికైంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జై షీల్డ్ బహుకరించారు. గుత్తి డీజిల్ షెడ్ సీనియర్ డీఎంఈ రమేష్ షీల్డ్ అందుకున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి వినూత్నంగా నామినేషన్ వేశారు. శాంతిపురం మండలం 121 పెద్దూరు గ్రామానికి చెందిన పార్థసారథి రెడ్డి ఇండిపెండెంట్‌గా నామినేషన్ పత్రాలను అందజేశారు. సంబంధిత డిపాజిట్ సొమ్మును 6.88 కిలోల బరువు ఉన్న చిల్లర నాణేలను సమర్పించారు. తనను గెలిపిస్తే కుప్పం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కుప్పం కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తానని తెలిపారు.
విజయనగరంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ తరుణంలో ఇరు పార్టీల నేతలు ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ దాఖలు చేయగా, నేడు టీడీపీ అభ్యర్థి అధితి గజపతిరాజు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ఆమె తండ్రి, మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో అతను ఎమ్మార్వో ఆఫీస్ బయట ఉన్న చెట్టు కింద సేదతీరారు.
జిల్లాలోని ఏపీ గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8 తరగతులకు సంబంధించి ప్రవేశ పరీక్షను 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షల జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. హాల్ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డును తెచ్చుకోవాలన్నారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి అశ్వవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజన బృందాల మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి అశ్వవాహనంపై భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.