Andhra Pradesh

News April 25, 2024

కంభం మండలంలో ఆటో బోల్తా.. ఒకరి మృతి

image

కంభం మండలంలోని ఎర్రబాలెం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఆటోలోని నాగయ్య(60) మృతి చెందడంతో పాటు మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 25, 2024

బీఫామ్ అందుకున్న జయచంద్రా రెడ్డి

image

తంబళ్లపల్లె MLA సీటుపై సస్పెన్స్ వీడింది. టీడీపీ అభ్యర్థి జయచంద్రా రెడ్డికే బీపాం అందింది. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబును ఆయన కలిసి బీఫామ్ అందుకున్నారు. మొదటి లిస్టులోనే జయచంద్రా రెడ్డిని TDP అభ్యర్థిగా ప్రకటించారు. కూటమిలో తంబళ్లపల్లె, అనపర్తి టికెట్ల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ సీటు బీజేపీకి ఇస్తారని, టీడీపీలోనే అభ్యర్థిని మార్చుతారని ఇన్ని రోజులు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

News April 25, 2024

స్వతంత్ర అభ్యర్థిగా బూడి రవికుమార్ నామినేషన్ దాఖలు

image

అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి మంత్రి బూడి ముత్యాలనాయుడు కుమారుడు బూడి రవికుమార్ బుధవారం మాడుగుల స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే వైసీపీ తరఫున అక్క ఈర్లె అనురాధ నామినేషన్ వేసిన విషయం తెలిసిదే. నామినేషన్ అనంతరం రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు సేవలు అందించేందుకే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానన్నారు. తన నామినేషన్ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

News April 25, 2024

జిల్లా పోలీస్ అబ్జర్వర్‌గా అశోక్ టి.దుధే

image

ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చునని పోలీస్ అబ్జర్వర్ అశోక్ టి.దుధే ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లా పోలీసు పరిశీలకులుగా ఆయన నియమితులయ్యారు. ఉదయం 10.30 నుంచి 11.30 వరకు నెల్లూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లోని గెస్ట్ హౌస్‌లో ఆయన అందుబాటులో ఉంటారు. అత్యవసర సమయంలో 7569618685, policeobserver73@gmail.com ద్వారా ఆయన్ను సంప్రదించవచ్చు.

News April 25, 2024

హిందూపురం ఎంపీ అభ్యర్థిగా షాహీన్ నామినేషన్ దాఖలు

image

హిందూపురం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున షాహీన్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబుకు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. సాదాసీదాగా ఆయన నామినేషన్ కార్యక్రమం కొనసాగింది. సినీయర్ నాయకుడు బాలాజీ మనోహర్ ఆయన వెంట వచ్చారు.

News April 25, 2024

BJP యువమోర్చా రాష్ట్ర జనరల్ సెక్రటరీగా శివరామ 

image

BJP యువమోర్చా రాష్ట్ర సెక్రటరీగా అనపర్తి నియోజకవర్గానికి చెందిన శివరామ కృష్ణంరాజు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధీశ్వరి ఉత్తర్వులు జారీ చేశారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలుత శివరామకృష్ణంరాజును ప్రకటించినా.. కూటమి సమీకరణాల్లో భాగంగా అనపర్తి టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మార్చారు. దీంతో శివరామకు ఈ పదవి ఇచ్చారు.

News April 25, 2024

కడప స్వతంత్ర MP అభ్యర్థిగా కూటమి అభ్యర్థి తండ్రి నామినేషన్ 

image

కడప పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూటమి అభ్యర్థి భూపేశ్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి విజయరామరాజుకు నామినేషన్ పత్రాలను అందించారు. ఇప్పటికే కడప ఎంపీ బరిలో వైసీపీ నుంచి అవినాశ్, కాంగ్రెస్ నుంచి షర్మిల, కూటమి నుంచి భూపేశ్ రెడ్డి బరిలో నిలిచిన విషయం తెలిసిందే.   

News April 25, 2024

అనంత: ఇంటర్ ఫలితాలలో..470కి 464 మార్కులు

image

అనంతపురం నగరానికి చెందిన మసప్పగారి సంజనరెడ్డి బుధవారం విడుదల చేసిన తెలంగాణ ఇంటర్ ఫలితాలలో మంచి ప్రతిభ కనబరిచింది. సంజనరెడ్డి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలలో 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించింది. ఆమె తల్లిదండ్రులు ఎం.మధుసూదన్ రెడ్డి, పి.ప్రార్థన రెడ్డిలు నగరంలోని నీరుగంటి వీధిలో నివాసం ఉంటూ వృత్తిరీత్యా ప్రైవేట్ విద్యారంగంలో పనిచేస్తున్నారు.

News April 25, 2024

సింహాచలం ఆలయ ప్రాంగణంలో వినోదాత్మక సన్నివేశం

image

సింహాచలం సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా బుధవారం వినోదాత్మక సన్నివేశం జరిగింది. సింహాద్రి అప్పన్న ఉంగరం పోయింది.. ఎవరు తీశారంటూ.. ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్, జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంటల శ్రీనుబాబుతో పాటు పలువురు భక్తులను విచారించారు. కొందరు భక్తులు ఇది నిజమేననుకుని కంగారుపడ్డారు. చివరకు పట్టు వస్త్రాల్లో దొరికిందని ఆలయ అర్చకులు ప్రకటించారు.

News April 25, 2024

కర్నూలు టీడీపీ అభ్యర్థి ఆస్తి విలువ రూ.278.27 కోట్లు

image

కర్నూలు టీడీపీ అభ్యర్థిగా టీజీ భరత్ మంగళవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. టీజీ భరత్ మెుత్తం ఆస్తుల విలువ రూ.278.27 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చరస్తుల విలువ రూ.83.08కోట్లు, స్థిరాస్తుల విలువ రూ.195.19 కోట్లుగా పేర్కొన్నారు. అప్పులు రూ.19.38 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.

error: Content is protected !!