Andhra Pradesh

News April 27, 2024

చిత్తూరులో EVM స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన ఎస్పీ

image

చిత్తూరు నగరం ఎస్వీ సెట్ కళాశాలలోని ఈవీఎం స్ట్రాంగ్ రూములను ఎస్పీ మణికంఠ చందోలు పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆరిఫుల్లా తదితరులు పాల్గొన్నారు.

News April 27, 2024

అమెరికా యూనివర్సిటీ ఎన్నికల్లో అద్దంకి వాసి

image

అమెరికాలో యూనివర్సిటికీ సంబంధించిన ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికలలో ఏపీకి చెందిన రోహిత్ శ్రీసాయి బాచిన అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. వీరి స్వగ్రామం అద్దంకి నియోజకవర్గం జె. పంగులూరు గ్రామం. వీరి తండ్రి బాచిన హనుమంత రావు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా ఏపీ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్నారు.

News April 27, 2024

అనంత: రైలు కిందపడి వెస్ట్ బెంగాల్ వాసి ఆత్మహత్య

image

గుంతకల్లు పట్టణ శివారులో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన విశ్వజిత్ అనే వ్యక్తి శనివారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 27, 2024

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో హీరో సుదీప్

image

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధికి కన్నడ, తెలుగు నటుడు సుదీప్ కుటుంబ సమేతంగా వచ్చారు. వీరికి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అధికారులు గ్రామ దేవత శ్రీ మంచాలమ్మ దేవిని, శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. హీరో సుదీప్‌కు శ్రీ మఠం అర్చకులు ఫల మంత్రాక్షితలు అందజేశారు.

News April 27, 2024

VZM: రైలు నుంచి జారిపడి.. ఒడిశా వాసి మృతి

image

పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ వద్ద గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ రైలు నుంచి జారి పడి ఒడిశా రాయగడకు చెందిన నాయుడు సాయి గౌతమ్(25) శనివారం మృతి చెందాడు. గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న హెచ్. సీ రత్న కుమార్ ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. అనంతంర ఘటనపై కేసు నమోదు చేసి  దర్యాప్తు చేపట్టారు. 

News April 27, 2024

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పవన్‌ వ్యాఖ్యలు: గీత

image

మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు చేశారని పిఠాపురం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగా గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం మండలం కుమరాపురంలో శనివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్లేడ్స్‌తో దాడి చేస్తున్నారని రౌడీతత్వాన్ని పిఠాపురం నియోజకవర్గానికి అంటగట్టారని పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు.

News April 27, 2024

పొన్నూరుకు మరో గజదొంగ వచ్చాడు: ధూళిపాళ్ల

image

అంబటి మురళీకృష్ణ సేవ పేరుతో పొన్నూరు ప్రజలను వంచించడానికి రాజకీయాల్లోకి వచ్చాడంటూ టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించారు. పొన్నూరులో మాట్లాడుతూ.. అంబటి రాంబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత సత్తెనపల్లికి మురళీకృష్ణ షాడో ఎమ్మెల్యేగా మారి రాజ్యాంగ శక్తిగా ఎదిగాడన్నారు. ఒక దొంగను గత ఐదేళ్లుగా భరించామని.. ఇంకో గజదొంగ వచ్చాడంటూ ఎద్దేవా చేశారు. గజదొంగ నిజస్వరూపం బయట పెడతామని చెప్పారు.

News April 27, 2024

శ్రీకాకుళం: క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్

image

కంచిలి మండలంలోని బూరగాం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాహనదారుల వివరాల ప్రకారం.. జాతీయ రహదారి డివైడర్ మధ్య మొక్కలకు నీరుపోసే వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం ధ్వంసం కాగా, క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కపోవడంతో సమాచారం అందుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు డ్రైవర్‌ను బయటకు తీసి అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు.

News April 27, 2024

175లో 150 సీట్లు కూటమి గెలుస్తుంది: మాండ్ర శివానందరెడ్డి

image

రాష్ట్రంలో ఉన్న 175 సీట్లలో 150 సీట్లు కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని నంద్యాల పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి పేర్కొన్నారు. నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో ఆయన మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు సాగు, తాగు నీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో 150 సీట్లతో టీడీపీ కూటమి గెలుస్తుందన్నారు.

News April 27, 2024

30న టంగుటూరు రానున్న సీఎం జగన్

image

ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచార సభ ఈ నెల 30న ఉదయం 10 గంటలకు టంగుటూరులో జరగనున్నట్లు రాష్ట్ర మంత్రి, కొండపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. వైసీపీ శ్రేణులు ముందుగా కొండపిలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని షెడ్యూలు విడుదల చేశారు. అయితే సీఎం పర్యటనకు, జన సమీకరణకు టంగుటూరు అనుకూలంగా ఉంటుందని భావించి మార్చినట్లు మంత్రి సురేశ్ తెలియచేశారు.