Andhra Pradesh

News April 27, 2024

NLR: వీఎస్ఆర్ మాస్కులు ధరించిన అభిమానులు

image

నెల్లూరు సిటీ 8వ డివిజన్ లో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎండీ ఖలీల్ అహ్మద్, డివిజన్ కార్పోరేటర్ మొగలపల్లి కామాక్షి దేవి శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఐదేళ్ల కాలంలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తించి మరోసారి తమకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. పలువురు అభిమానులు వీఎస్ఆర్ మాస్కులు ధరించి ఆయనతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.

News April 27, 2024

ద్రావిడ వర్సిటీలో యుజీ, పీజీ పరీక్షలు వాయిదా

image

ద్రావిడ వర్సిటీలో మే 1వ తేదీ నుండి జరగాల్సిన యూజీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఏకే వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. యూజీ, పీజీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు మే 1వ తేదీ నుంచి నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందని.. అయితే కొన్ని పరిపాలన కారణాలవల్ల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని, విద్యార్థులు గమనించాలన్నారు.

News April 27, 2024

కర్నూలు: బొలెరో ఢీకొని వ్యక్తి మృతి.. వీఆర్వోకి గాయాలు

image

బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. కోడుమూరులోని కర్నూలు రహదారిలో బొలేరొ వాహనం వేగంగా దూసుకొచ్చి రెండు బైక్‌లు ఢీకొని బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తి పోతుగల్ వీఆర్వో వెంకటేశ్‌గా స్థానికులు గుర్తించారు.

News April 27, 2024

తాడిగడపలో భార్యను హత్య చేసిన భర్త

image

తాడిగడపలో శనివారం దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను భర్త హత్య చేశాడు. భర్త శ్రీనివాసరావు ఇంటికి వచ్చే సమయంలో భార్య షకీలా ఫోన్ మాట్లాడుతూ ఉంది. ఈ క్రమంలో హత్య చేసినట్లు సమాచారం. శ్రీనివాసరావును షకీలా రెండో వివాహం చేసుకుంది. ఫేస్‌బుక్ ద్వారా ఇరువురికి పరిచయం ఏర్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పెనమలూరు సీఐ రామారావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

News April 27, 2024

కాంగ్రెస్ గెలిస్తే ప్రత్యేక హోదా ఇస్తాం: షర్మిల

image

కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పాయకరావుపేటలో ఈరోజు ఆమె రోడ్‌ షోలో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు అమరావతిని భ్రమరావతి చేశారని ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ మోదీకి తొత్తులుగా మారిపోయారని ఆమె ఆరోపించారు. జగన్ కారణంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు.

News April 27, 2024

రేపు రేణిగుంటకు నందమూరి బాలకృష్ణ

image

ఆదివారం రేణిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద జరగబోవు కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ రానున్నారని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. శనివారం మండల పరిధిలోని కరకంబాడి పంచాయతీ బీసీ కాలనీలో టీడీపీ పార్టీ నాయకులు డాలర్స్ దివాకర్ రెడ్డితో కలిసి సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపలో హారతులతో ఆత్మీయ స్వాగతం లభించింది.

News April 27, 2024

అనంత: పరీక్ష రాయడానికి వెళుతూ.. విద్యార్థిని దుర్మరణం

image

నార్పల మండల పరిధిలోని నడి దొడ్డి గ్రామానికి చెందిన నాగార్జున కూతురు ఝాన్సీ(9) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. గురుకుల పాఠశాలలో పరీక్షలు రాయడానికి తండ్రి, కూతురు మరో విద్యార్థి బైక్ మీద బయలుదేరారు. ఈ క్రమంలో కేశేపల్లి వద్ద కుక్క దూరడంతో బైక్ అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో విద్యార్థి ఝాన్సీ తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన ఇద్దరికి గాయలయ్యాయి.

News April 27, 2024

రేపు వెంకటగిరికి ముఖ్యమంత్రి రాక

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంకటగిరికి రానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కార్యాలయ వర్గాలు తెలిపాయి. త్రిభువని కూడలి ప్రాంతంలో సభ నిర్వహణకు అవసరమైన ప్రాంతాలను స్థానిక నాయకులు పరిశీలించారు.

News April 27, 2024

గుర్రం ఎక్కి చింతమనేని ప్రచారం

image

పెదపాడు మండలం కొత్తూరు గ్రామంలో శనివారం దెందులూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అభిమానులు ఏర్పాటు చేసిన గుర్రం ఎక్కి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలకు తెలియజేశారు.

News April 27, 2024

ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ ఆమోదం

image

చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్‌ను చీరాల నియోజకవర్గ ఎన్నికల అధికారి సూర్యనారాయణరెడ్డి శనివారం ఆమోదించారు. ఆమంచి కృష్ణమోహన్‌కు రూ.4.63 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు పలువురు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమంచి నామినేషన్‌ను ఆర్ఓ పెండింగ్‌లో ఉంచారు. శనివారం విద్యుత్ బకాయిలపై ఆమంచి వివరణ ఇవ్వడంతో నామినేషన్ ఆమోదించారు.