India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బుడమేరుకు మళ్లీ వరద పుకార్లు నమ్మవద్దని NTR జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఓ ప్రకటనలో తెలిపారు. బుడమేరుకు ఎలాంటి ముంపు ప్రమాదం లేదన్నారు. ప్రజలు ఎలాంటి భయందోళన చెందవద్దన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సురక్షితంగా ఎవరి ఇంట్లో వాళ్లు నివసించవచ్చని ఆమె సూచించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి పట్టణ ప్రాంతంలో స్కూటీ బోల్తా పడి యువతి మృతి చెందింది. సెయింట్ ఆన్స్ స్కూల్ స్కూల్ ఎదురుగా జాతీయ రహదారిపై శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో యువతి ధన (25) స్కూటీ అదుపుతప్పడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. గుంతల కారణంగా స్కూటీ అదుపుతప్పిందని, ఈ క్రమంలోనే ధన మృతి చెందినట్లు యువతి తల్లిదండ్రులు ఆరోపించారు.

కడప జిల్లాలోని చారిత్రాత్మక ప్రదేశం గండికోటలో నగరవనం, మైలవరం జలాశయంలో బోటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. ఈ మేరకు గండికోటలో ఏర్పాటు చేయబోయే నగరవనం స్థల పరిశీలనతోపాటు.. మైలవరం జలాశయంలో బోటింగ్‌ను శనివారం ఆయన పరశీలించారు. బోట్ ఎక్కి ఎంత దూరం ప్రజలను సౌకర్యవంతంగా తిప్పగలరు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. గండికోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానన్నారు.

కర్నూలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఈనెల 16న(సోమవారం) నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ జి.బిందు మాధవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు కర్నూలుకు రావద్దని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఎస్పీ బిందు మాధవ్ సూచించారు.

కర్నూలులో రేపు గణేశ్ నిమజ్జనోత్సవం నేపథ్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ బిందు మాధవ్ సమావేశం నిర్వహించారు. ‘ఎక్కడా చిన్నపాటి సంఘటన చోటు చేసుకోకూడదు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు. శోభయాత్రలో ప్రజలు, భక్తుల పట్ల పోలీసులు సత్ప్రవర్తనతో మెలగాలి. నిమజ్జనం ముగిసే వరకు పోలీసులు తమకు కేటాయించిన విధుల్లో ఉండాలి’ అని దిశా నిర్దేశం చేశారు.

ఒంగోలు పట్టణంలోనిసంఘమిత్ర ఆసుపత్రి వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనకనుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. హైవే పోలీసులు వెంకటరామయ్య, రాజాలు, మేదరమెట్ల వద్ద లారీని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సిఉంది.

తిరుపతిలోని శ్రీనివాసం వెనుక వైపు డీబీఆర్ ఆసుపత్రి రోడ్డులో ఓ లాడ్జీ పై ఈస్ట్ పోలీసులు దాడులు నిర్వహించారు. లాడ్జీ పైన ఉన్న 7 స్పా సెంటర్ పై దాడి చేశారు. అందులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలను, నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు స్టేషన్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హిందూపురం పట్టణంలో ఎక్సైజ్ స్టేషన్‌లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటానికి శనివారం ఎక్సైజ్ పోలీసులు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు కమలాకర్, రాంప్రసాద్‌లు మాట్లాడుతూ.. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, ఎక్సైజ్ శాఖను విలీనం చేస్తూ ఎక్సైజ్ శాఖను పునరుద్ధరణ చేయడం ఎంతో అభినందనీయమన్నారు.

కడప జిల్లాలో గంజాయి విక్రయాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాడులు ముమ్మరంగా చేయడంతో గంజాయి వ్యసనానికి అలవాటుపడ్డ యువత, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలలో మత్తు కలిగే మందుల కోసం మెడికల్ షాప్‌లకు వచ్చే అవకాశం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను విక్రయించవద్దని జిల్లా SP హర్షవర్ధన్ రాజు, మెడికల్ షాప్ నిర్వాహకులకు శనివారం సూచించారు.

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఏడాది ఏప్రిల్ నెలలో పీజీ ( PG) LLM మొదటి సెమిస్టర్, జులైలో M.A, M.COM, M.SC నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Sorry, no posts matched your criteria.