India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం హిందూపురం తహశీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అభిషేక్ కుమార్‌కు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. హిందూపురం శాసనసభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నారు.
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన B.ED ( బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) రెండవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. పరీక్షా ఫలితాలను http://www.manabadi.co.in, http://www.schools9.com వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి మంగళవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి విధివిధానాలు నచ్చక వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరానని మెట్టుకూరు చిరంజీవి రెడ్డి అన్నారు.
చిలకలూరిపేట మండలంలోని గొట్టిపాడు వాగు వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు మంగళవారం గుర్తించారు. రూరల్ పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, మహిళ వయసు 30 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. ఈ మహిళను ఎవరైనా గుర్తిస్తే చిలకలూరిపేట రూరల్ పోలీసులను సంప్రదించాలని కోరారు.
చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని సీపీఎఫ్ కంపెనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే గుడిపాల పోలీసులను సంప్రదించాన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆమంచి కృష్ణమోహన్ ఇంటికి షర్మిల చేరుకున్నారు. ఆమంచి నామినేషన్ కార్యక్రమంలో షర్మిల పాల్గొంటారు. మరికాసేపట్లో పందిళ్లపల్లి నుంచి వేటపాలెం మీదుగా చీరాలకు ర్యాలీగా వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చీరాల గడియారస్తంభం కూడలిలో సభలో షర్మిల ప్రసంగించనున్నారు.
నెల్లూరు ఎంపీ వైసీపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి హరినారాయణ్‌కు నామినేషన్ అందించారు. విజయసాయిరెడ్డి వెంట రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, న్యాయవాది మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు ఉన్నారు.
దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల కుమారుడు మాగుంట విజయబాబు మరణం బాధాకరమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని వారి నివాసంలో విజయబాబు భౌతిక కాయానికి సోమిరెడ్డి నివాళులర్పించారు. ఒంగోలు ఎంపీ శ్రీనివాసులు రెడ్డితో పాటు కుటుంబసభ్యులను సోమిరెడ్డి పరామర్శించారు.
తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదని సుంకర పద్మశ్రీ ట్వీట్ చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థినిగా పోటీ చేయాలని ఆశించానని, అధిష్ఠానం అవకాశం కల్పించలేకపోయిందని ఆమె అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు తన వంతు కృషి చేస్తానన్నారు. తన నిర్ణయాన్ని అధిష్ఠానం మన్నిస్తుందని భావిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు అభ్యర్థిగా పద్మశ్రీని నిన్న కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
జిల్లాలోని పలు పొగాకు వేలం కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన వేలంలో వెల్లంపల్లి, కొండపిలో పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.266, ఒంగోలు-1 రూ. 265, ఒంగోలు-2 రూ. 261, టంగుటూరు రూ.263 చొప్పున పలికింది. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 3,374 బేళ్లు తీసుకురాగా, అందులో 2,683 బేళ్లు, ఎస్ఎల్ ఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 3,534 బేళ్లురాగా, అందులో 2,697 బేళ్లను కొనుగోలు జరిగాయి.
Sorry, no posts matched your criteria.