India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాములపాడు మండలంలోని వానాల గ్రామంలో ఎస్సీ కాలనీవాసులకు తెలుగు గంగ నీళ్లు వదులుతున్నారని కాలనీవాసులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. నీళ్లు అపరిశుభ్రంగా ఉంటున్నాయని వాటిని తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నామని పేర్కొన్నారు. అలాగే డయేరియా సంబంధిత వ్యాధులు సంభవించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని మంచి నీటిని సరఫరా చేయాలని కోరారు.

రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పాత వంతెనలు, అధ్వాన రహదారులు, మలుపులు, అతివేగం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. చందోలు, యాజలి, బుద్దాం, కర్లపాలెం వద్దగత రెండున్నరేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 15 మంది మృతి చెందారు. బాపట్ల మండలంలో వెదుళ్లపల్లి-పర్చూరు రహదారిలో పేరలి వంతెన రక్షణ గోడలు పూర్తిగా కూలగా.. 2022 నవంబర్‌లో ఈ మలుపు వద్ద ఐదుగురు అయ్యప్ప దీక్షదారులు మృత్యువాతపడ్డారు.

పోరుమామిళ్ల మండలం అక్కల రెడ్డి పల్లె గ్రామ సమీపాన టెలిఫోన్ టవర్‌కు ఉరి వేసుకొని సోమవారం ఉదయం యువకుడు మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. మృతుడు దాసరపల్లి ప్రేమ సాగర్ (22) గా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోరుమామిళ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కూటమి జోరులోనూ పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మరోసారి గెలిచారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత ఊరైన సదుం మండలం ఎర్రాతివారిపాలెంలో ఆయనకు పడిన ఓట్లపై పలువురు ఆరా తీస్తున్నారు. స్థానిక గ్రామంలో మొత్తం 862 ఓట్లు ఉన్నాయి. ఇందులో 846 మంది వైసీపీకి ఓటు వేశారు. కేవలం 9 మందే టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి ఓటు వేశారు. ఐదుగురు కాంగ్రెస్‌కు, ఇద్దరు బీసీవై పార్టీకి మద్దతు తెలిపారు.

నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ కేంద్ర సహాయ మంత్రిగా మంగళవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11:11 గంటలకు, 12:15 గంటలకు రెండు శాఖల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. భీమవరంలో ఉన్న ఆయన సోమవారం (నేడు) ఢిల్లీ వెళ్తున్నారు. తిరిగి 20వ తేదీన భీమవరం రానున్నారు.

వ్యవసాయం, ఆక్వా రంగాల్లో ప్రోత్సాహం, నిరుద్యోగులకు ఉపాధి లేక శ్రీకాకుళం జిల్లా నుంచి 6 లక్షల మందికిపైగా వలస వెళ్లారు. అలా అక్కడే మరణిస్తే కుటుంబ సభ్యులకు చివరిచూపు కూడా దక్కడం లేదు. కేంద్ర, రాష్ట్ర కేబినేట్‌లో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడుకు చోటు లభించడంతో జిల్లా ప్రజలు వీరిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సిక్కోలు వ్యవసాయం, ఆక్వా రంగానికి అనుకూలంగా ఉండటంతో వీటిని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

నాగచైతన్య, సాయిపల్లవి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ‘తండేల్’ సినిమా షూటింగ్ ఉమ్మడి విశాఖలో జరుగుతోంది. ఆదివారం ఉదయం తంతడి-వాడపాలెం వద్ద సాంగ్ షూట్ చెయ్యగా.. మధ్యాహ్నం కొండకర్ల ఆవ వద్ద చేపల వేట, హీరో, హీరోయిన్ల మధ్య కొన్ని సీన్లు తీశారు. షూటింగ్ చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. షూటింగ్ విరామంలో నాగచైతన్య, సాయిపల్లవి 30 నిమిషాల పాటు దివ్యాంగులతో ముచ్చటించారు.

పాములపాడు మాజీ ఎంపీపీ గాండ్ల లక్ష్మీదేవమ్మ ఆదివారం హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 9న లక్ష్మీ దేవమ్మ గృహంలో ఉదయం పూజ నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. 50% గాయాలైన ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్ చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కొత్త తరహా సైబర్ మోసాలతో తక్కువ సమయంలో నగదు సంపాదించాలని నేరగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. పార్ట్‌టైం ఉద్యోగాల పేరిట టెలిగ్రామ్‌లో లింక్ పంపి క్లిక్ చేయగానే రూ.లక్షల్లో నగదు వసూలు చేస్తున్నారన్నారు. హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

ఏలూరు జిల్లా పోలవరంలో ఆదివారం దొంగ నోట్లు కలకలం రేపాయి. నేడు సీఎం పర్యటన నేపథ్యంలో కాఫీ హోటళ్లు, తినుబండారాల షాపులు, కిరాణా దుకాణాలు కిటకిటలాడాయి. లావాదేవీలు సమయంలో వచ్చిన కొత్తనోట్లను ఆ తర్వాత మరొకరికి ఇచ్చే సమయంలో దొంగనోట్లని తేలడంతో తాము మోసపోయినట్లు వ్యాపారులు గుర్తించారు. సుమారు ఏడుగురు వ్యాపారులు మోసపోయినట్లు గుర్తించారు.
Sorry, no posts matched your criteria.