India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈపూరు మండలంలోని కొండ్రముట్ల రైతు భరోసా కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి రైతు భరోసా కేంద్రం తాళాలు పగులగొట్టి, కంప్యూటర్, టీవీలను చోరీ చేశారు. ఆదివారం ఉదయం అటువైపు వెళుతున్న రైతు ఒకరు రైతు భరోసా కేంద్రం తెరిచి ఉండటం చూసి వ్యవసాయశాఖ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వ్యవసాయశాఖ ఏవో రామినేని రామారావు తెలిపారు.

రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముడమాల బాలముని రెడ్డి ఆదివారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్‌కు, మేనేజింగ్ డైరెక్టర్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. కూటమి అధికారంలోకి రావడంతో తమ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.

వ్యవసాయ డిప్లమో కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆచార్య రంగా వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.సంధ్యారాణి తెలిపారు. కోర్సుల్లో చేరేవారు ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులు 2023 ఆగస్టు 31 నాటికి 15 సంవత్సరాల నుంచి 22 వయస్సు కలిగి ఉండాలన్నారు.

ఎమ్మెల్యేగా గెలిపించిన జగన్‌ను కాదని పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆలూరు ఎమ్మెల్యే విరూఫాక్షి స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లడానికి తన ఆత్మసాక్షి ఒప్పుకోదని పేర్కొన్నారు. పార్టీ మారుతున్నట్లు పత్రికల్లో వస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వదంతులు నమ్మెుద్దని ప్రజలను కోరారు.

పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఎమ్మెల్యే అయ్యి కేబినేట్‌లో చోటు దక్కించుకున్న కొండపల్లి శ్రీనివాస్‌పై జిల్లా ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. MSME మంత్రిగా అవకాశం రావడంతో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెర్ప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నిర్మూళన దిశగా, NRI సాధికారత& సంబంధాలతో విదేశాల్లో ఉండే జిల్లా ప్రజానీకానికి అండగా నిలవాలని కోరుతున్నారు.

టెక్కలి మండలం జెండాపేట గ్రామం సమీపంలో ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని టెక్కలి పోలీసులు గుర్తించారు. అతని వద్ద లభ్యమైన గుర్తింపు కార్డు ఆధారంగా మృతుడిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన హుమయున్ మియా (37)గా గుర్తించారు. మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో TDP నాయకులు, కార్యకర్తలను ఆదివారం సాయంత్రం మాజీ MLA SVSN వర్మ కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌కు కేటాయించిన శాఖలు రాష్ట్రం, పిఠాపురం అభివృద్ధికి దోహదపడేలా ఉన్నాయన్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వంటి శాఖలతో నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఉప్పాడ, చేబ్రోలులో అన్నక్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది సీట్లను TDP కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో గెలిచిన YCP ఎమ్మెల్యేలంతా ఓడిపోయారు. ఈక్రమంలో సోషల్ మీడియాలోని తమ ఖాతాల్లో కావలి, నెల్లూరు సిటీ, కోవూరు మాజీ MLAలు అని రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డి అప్‌డేట్ చేశారు. ఆత్మకూరు MLA మేకపాటి విక్రమ్ రెడ్డి అని ఆయన ట్విటర్(X) ఖాతాలో ఇంకా అలాగే ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి.

కడప – మైదుకూరు జాతీయ రహదారిలో మైదుకూరుకు చెందిన రామచంద్రయ్య అనే వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 7 గంటలకు బైకుపై కడప నుంచి మైదుకూరు వెళ్ళే మార్గంలో ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. అది గమనించిన స్థానికులు అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారని తెలిపారు.

తాడిపత్రిలో దారుణ హత్య జరిగింది. తాడిపత్రిలోని నందలపాడుకు చెందిన లాల్‌స్వామి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేసి హత మార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.