India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజల ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని మంత్రి అంజాద్ బాష అన్నారు. సోమవారం సాయంత్రం కడప నగరంలోని 26వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని వివరించారు. మరోసారి కడప ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వైఎస్ అవినాశ్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
26వ తేదీలోగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను అందజేయాలని శ్రీ సత్యసాయి కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఉద్యోగులు ఎక్కడ ఉన్నా పని చేసే చోట ఫామ్-12ను సమర్పించే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు. ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకోవచ్చన్నారు.
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారి సంఖ్య 23,157 కాగా ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు 2,774 తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారి సంఖ్య 902గా ఉంది. జిల్లా మొత్తం ఉత్తీర్ణులైన వారి సంఖ్య 26,833గా అధికారులు సోమవారం వెల్లడించారు. వీరందరికీ జిల్లాలోని విద్యాశాఖ అధికారులతో పాటుగా పలువురు ఉన్నతాధికారులు అభినందించారు.
తమిళనాడులోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైన పళని దేవాలయమునకు చెందిన అర్చకులు, సేవకులు దురైరాజ్, రాజన్ ఆధ్వర్యంలో 50 మంది సభ్యులు
రేపు చిత్రాపౌర్ణమి సందర్భంగా పళని సుబ్రహ్మణ్య స్వామి అభిషేకానికి మహానంది క్షేత్రంలోని కోనేటి నీరును తీసుకుని వెళ్లారు. దేశంలోని అనేక ప్రసిద్ధ తీర్ధములు నుంచి ప్రతి ఏడాది నీరు తీసుకుని వెళ్ళడం ఆనవాయితని తెలిపారు. ఆరేళ్లుగా మహానంది నుంచి నీరు తీసుకెళ్తున్నామన్నారు.
ప్రకాశం జిల్లాలో సోమవారం ఒంగోలు పార్లమెంట్, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు 51 నామినేషన్లు దాఖలయినట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఒంగోలు పార్లమెంట్‌కు 4, ఒంగోలు అసెంబ్లీకి 5, యర్రగొండపాలెంకు 6, దర్శికి 4, సంతనూతలపాడుకు 6, కొండపికి 3, మార్కాపురానికి 5, గిద్దలూరుకు 5, కనిగిరి నియోజకవర్గానికి 3 నామినేషన్లు దాఖలయినట్లు తెలిపారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమార్తె దీపిక సోమవారం ప.గో. జిల్లా తణుకులో ప్రచారం చేపట్టారు. పట్టణంలోని స్థానిక 24వ వార్డులో తణుకు MLAగా నాన్న కారుమూరి వెంకట నాగేశ్వరరావు గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఓ ఇస్త్రీ దుకాణంలో ఇస్త్రీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు.
అనకాపల్లి జిల్లాలో 10 పరీక్షల్లో 89.04 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. జిల్లాలో మొత్తం 21,169 మంది పరీక్షకు హాజరు కాగా 18,848 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 14,725 ప్రథమ శ్రేణిలో, 2,867 మంది ద్వితీయ శ్రేణిలో, 1256 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లు డీఈఓ వెంకటలక్ష్మమ్మ తెలిపారు. పాయకరావుపేట జడ్పీ బాలికల హైస్కూల్‌కు చెందిన కె. సత్య ధనస్వాతి 592 మార్కులు సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది.
అమరావతి మండలంలోని పలు గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను ఎస్పీ బిందు మాధవ్ సోమవారం తనిఖీ చేశారు. ధరణికోట, ఉంగుటూరు, ఎనుకపాడు తదితర గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా చూడాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
నామినేషన్ల స్వీకరణలో భాగంగా 4వ రోజైన సోమవారం జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 31 నామినేషన్లు దాఖలవ్వగా ఇందులో మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి 03, 7 అసెంబ్లీ స్థానాలకు 28 నామినేషన్లు పడ్డాయి. మచిలీపట్నం అసెంబ్లీకి 04, గన్నవరం 02, గుడివాడ 08, పెడన 06, అవనిగడ్డ 02, పామర్రు 03, పెనమలూరు 03 నామినేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో మొత్తం 57 నామినేషన్లు దాఖలయ్యాయి.
ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి నామినేషన్ వేయడం చాలా సంతోషంగా ఉందని టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది నామినేషన్ కార్యక్రమం అనేకంటే నెల్లూరు జిల్లా అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమం అనొచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.