India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరులో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న యువకుడిని సోమవారం లాలాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. CI దేవ ప్రభాకర్ తెలిపిన వివరాల మేరకు.. ఏటుకూరు రోడ్డులో మత్తు పదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో ఎస్ఐ అమర్నాథ్ తనిఖీలు నిర్వహించారు. రాజస్థాన్‌కి చెందిన మహేందర్ సింగ్ తన స్నేహితుల ద్వారా మత్తు పదార్థాలు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. 11 గ్రాముల మత్తు పదార్థాలు సీజ్ చేశారు.
భీమిలి ఏపీఆర్ఎస్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారని హెచ్ఎం కోడి రాంబాబు తెలిపారు. వారిలో నైమిష 588, ఎల్.దుర్గ 586, వి.జ్యోతి 583, ఎం.త్రిష 580 మార్కులు సాధించారన్నారు. కేజీబీవీ విద్యార్థినులు శతశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ గంగాకుమారి తెలిపారు. వారిలో ఏడుగురికి 500 మార్కులు దాటాయన్నారు. పండిట్ నెహ్రూ స్కూల్‌లో 72 మంది విద్యార్థులకు 55 మంది పాసయ్యారని హెచ్ఎం శ్రీదేవి తెలిపారు.
కాకినాడ జిల్లా సామర్లకోట RTC కాంప్లెక్స్‌లో ఓ మహిళను ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొట్టగా ఆమె మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. కాంప్లెక్స్‌లో బస్సును మలుపు తిప్పేందుకు ప్రయత్నిస్తుండగా మహిళను ఢీకొట్టిందన్నారు. మృతిచెందిన మహిళ వివరాలు తెలియాల్సి ఉంది.
కళాశాల బస్సుకు ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి ప్రవేశం లేకపోయినప్పటికీ.. ఎందుకు వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం నగరానికి చెందిన బైనేని జాష్ణవి సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాలలో 594 మార్కులతో సత్తా చాటింది. ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరింత కష్టపడి చదివి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగడమే తన లక్ష్యమన్నారు. ఆమెను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.
ఇంజినీరింగ్ పనుల కారణంగా ఈనెల 29వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు గుంటూరు- రాయగడ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ (17243) రైలు రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. అదే విధంగా రాయగడ నుంచి గుంటూరు వచ్చే (17244) ఈనెల 30వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు నిలిపివేసినట్లు తెలిపారు. ఈ మేరకు రైల్వే ప్రయాణికులు గమనించాలని తెలిపారు.
మండలంలోని తంబలంపాడు గ్రామంలో నరసింహారావు పొలంలో చేపల చెరువు మేత వేయడానికి వెళ్లిన వల్లూరి విజయబాబు ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు ఎస్సై చంటిబాబు తెలిపారు. బాపులపాడు మండలానికి చెందిన విజయ్ కుమార్ చేపల చెరువు వద్ద కాపలా ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మేత వేసేందుకు పడవలో వెళ్లగా, పడవ బోల్తా పడి యువకుడు మృతి చెందినట్లు ఎస్సై వెల్లడించారు.
కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి ట్రాన్స్ జెండర్ అడ్డాకుల గీతా రాణి సమర్పించారు. సోమవారం కురుపాం తాహశీల్దార్ కార్యాలయంలో ట్రాన్స్‌జెండర్ గీతా రాణి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న తాము ఎన్నికలలో పోటీ చేసి తమ బలాన్ని నిరూపించుకోవాలన్నదే లక్ష్యం అన్నారు.
తాడేపల్లిగూడెంలోని వైసీపీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డిని ఉభయగోదావరి జిల్లాల క్రిస్టియన్ మైనార్టీ సెల్ జోనల్ ఇన్‌ఛార్జి, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ జాన్ వెస్లీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో రేపు ఎన్నికల్లో వైసీపీ జెండా మరోసారి ఎగిరేందుకు, సీఎం జగన్‌ను రెండోసారి గెలిపించేందుకు కృషి చేయాలన్నారు.
ధర్మవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ మంగళవారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా కేంద్ర మంత్రి విజయ్ కుమార్ సింగ్ ధర్మవరానికి రానున్నారని ఆయన కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి రావాలని వారు వెల్లడించారు.
హిరమండలం రెల్లివీధికి చెందిన కళింగపట్నం ధనుంజయ(26) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ధనుంజయకు రూ.5000 అప్పుగా ఇచ్చిన పందిరి రాజా అనే వ్యక్తి, అతని అనుచరులు అప్పు తీర్చమని ఇటీవల దారుణంగా కొట్టి, ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. వేధింపులకు భయపడి తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడు తండ్రి భూలోకం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.