India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిపై తాత్కాలికంగా నిర్మించిన బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలు సాగించవచ్చని బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై లోవరాజుతో కలిసి బ్రిడ్జిని ఆదివారం పరిశీలించారు. భారీ వరద కారణంగా పాడైన ప్రదేశాన్ని పరిశీలించిన ఆయన.. మరమ్మతుల అనంతరం భారీ వాహనాలకు అనుమతులిచ్చారు. కాగా.. పారాది వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చెయ్యాలని వాహనదారులు కోరుతున్నారు.

బక్రీద్ పండుగను ముస్లిం సోదర సోదరీమణులు ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా జరుపుకోవాలని, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ముస్లిం సోదరులు కూడా దేవునిపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి, ఎదుటివారికి సహాయం చేయాలనీ తెలియజేసే బక్రీద్ పండుగను సుఖశాంతులతో జరుపుకోవాలన్నారు.

హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే ఆదివారం లక్ష్మీ అనే వివాహిత పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త వీరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఏల్చూరులోని పంట పొలాలకు మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ పక్కకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. బోల్తా పడిన ట్రాక్టర్‌ను స్థానికులు పైకి లేపారు.

సీపీఐ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశాలను జూలై 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఒకటో తేదీ ఉదయం 10 గంటలకు కార్యవర్గ సమావేశం ప్రారంభమవుతుందని, 2, 3 తేదీల్లో రాష్ట్ర సమితి సమావేశాలు కొనసాగుతాయన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ సమావేశాలకు హాజరవుతారని, ఈ సమావేశాలు జయప్రదం చేయాలని ఆయన తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీంకు అరుదైన అవకాశం లభించింది. ఈనెల 21న రష్యాలో వివిధ దేశాల మేయర్లతో జరిగే సదస్సుకు అనంతపురం మేయర్‌కు ఆహ్వానం అందింది. బ్రిక్స్ దేశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే సదస్సుకు 50 మందికి పైగా మేయర్లు హాజరవుతారు. ఏపీ నుంచి కేవలం అనంతపురం మేయర్‌కు మాత్రమే ఆహ్వానం రావడం విశేషం.

ఉమ్మడి జిల్లాలో గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, కావలి, ఆత్మకూరు మున్సిపాల్టీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిలిచిపోయాయి. మన జిల్లా వాసి నారాయణకే మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రి పదవి రావడంతో సమస్యలు తీరుతాయని ప్రజలు భావిస్తున్నారు. మరి మీ పట్టణంలో సమస్యలు ఏంటో కామెంట్ చేయండి.

కవిటి మండలం శవసానపుట్టుగలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు నేటితో ముగిశాయి. కత్తివరం- బోడర్ మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో బోడర్ జట్టు విజయం సాధించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎంపీపీ అభ్యర్థి ప్రకాశ్.. విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రతి ఒక్కరూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రామారావు అన్నారు.

ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎప్పుడు సన్యాసం తీసుకుంటారని TDP నాయకుడు ముక్తియార్ ప్రశ్నించారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. కొన్ని కులాల వారికి కళ్యాణ మండపాలు కట్టిస్తానని రాచమల్లు చెప్పారని ఎప్పుడు కట్టిస్తారని అడిగారు. ప్రార్థన మందిరాలకు చందాలు ప్రకటించారని, అసంపూర్తిగా ఉన్న పనులను ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు.

వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు టచ్‌లో ఉన్న మాట వాస్తవమే కానీ.. వారిని చేర్చుకునే ప్రసక్తే లేదని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆదివారం స్పష్టం చేశారు. అద్భుతమైన పాలనను ఆంధ్ర ప్రజలు చూస్తారని ఆయన పేర్కొన్నారు. మాటల ప్రభుత్వం కాదు.. చేతల ద్వారా చూపించేది కూటమి ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని అన్నారు.
Sorry, no posts matched your criteria.