India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేడు YCP,TDP ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైసీపీ నుంచి రేపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి ఈపూరి గణేశ్, చిలకలూరిపేట నుంచి మనోహర్ నాయుడు, తాడికొండ నుంచి మేకతోటి సుచరిత ఉన్నారు. ప్రత్తిపాడు టీడీపీ నుంచి బూర్ల రామాంజనేయులు, గుంటూరు పశ్చిమ పిడుగురాళ్ల మాధవి, తూర్పు మహ్మద్ నజీర్, గురజాల యరపతినేని శ్రీనివాసురావు, వేమూరు నుంచి నక్కా ఆనందబాబు నామినేషన్ వేయనున్నారు.
‘పది’ ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
☞ తూ.గో జిల్లాలో 137 కేంద్రాల్లో 30,116 మంది పరీక్షలు రాశారు. కాగా.. గతేడాది ఈ జిల్లా రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది.
☞ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 21,113 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ఈ జిల్లా 13వ స్థానంలో నిలిచింది.
☞ కాకినాడ జిల్లాలో 27,712 మంది పరీక్షలు రాయగా.. గతేడాది ఈ జిల్లా 19వ స్థానంలో నిలిచింది.
ఒంగోలులో దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి కుమారుడు విజయ్ రెడ్డి (విజయ్ బాబు) సోమవారం ఉదయం నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయనకు పలు అనారోగ్య సమస్యలుండటంతో ఆసుపత్రిలో చేర్చి వైద్య సేవలు అందించినా ఉపయోగం లేకపోయింది. ఒంగోలు నుంచి MPలుగా ఆయన తల్లిదండ్రులు సుబ్బరామరెడ్డి, పార్వతమ్మ ఇద్దరూ గెలిచారు. ప్రస్తుతం మృతుని బాబాయ్ శ్రీనివాసులరెడ్డి TDP తరఫున ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేడు వైసీపీ, టీడీపీ బలపరిచిన , ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ఈపూరి గణేశ్, చిలకలూరిపేట నుంచి కే మనోహర్ నాయుడు, తాడికొండ నుంచిమేకతోటి సుచరిత వైసీపీ నుంచి నామినేషన్ వేయనున్నారు.
ఉమ్మడి ప.గో జిల్లాలో నేడు నామినేషన్లు వేసే అభ్యర్థులు వీరే.
☞ ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్.
☞ నరసాపురం BJP ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ.
☞ దెందులూరు- చింతమనేని ప్రభాకర్ (TDP).
☞ చింతలపూడి- సొంగా రోషన్ కుమార్ (TDP).
☞ ఉండి- రఘురామకృష్ణరాజు (TDP).
☞ నరసాపురం- బొమ్మిడి నాయకర్ (JSP).
☞ కైకలూరు- దూలం నాగేశ్వరరావు (YCP).
భార్య గొంతు నులిమి హత్య చేసిన ఘటన వరదయ్యపాళెంలో జరిగింది. మండలంలోని సాధనవారిపాళెంనకు చెందిన అంజలి(23)కి తూకివాకంకు చెందిన రాజశేఖర్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన 5 నెలలకే భర్త అనుమానంతో వేధిస్తుండడంతో అంజలి పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో19వ తేదీన అత్తవారింటికెళ్లి అక్రమసంబంధం ఉందంటూ భార్యతో గొడవపడ్డాడు. ఇరువురి మధ్య వాగ్వాదం తీవ్రమై ఆవేశంతో రాజశేఖర్ తన భార్య గొంతు నులమడంతో మృతి చెందింది.
కమలాపురంలో TDP అభ్యర్థిని మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పుత్తా నరసింహారెడ్డికి కాకుండా కుమారుడు చైతన్యరెడ్డికి అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒకింత అసహనం ఏర్పడింది. ఆదివారం చంద్రబాబు జిల్లా నేతలకు బీఫారాలు ఇవ్వగా ఇందులో చైతన్య చంద్రబాబు వద్ద కమలాపురం సీటు తన తండ్రికి ఇస్తే బాగుంటుందని, దాని వలన చేకూరే లబ్ధిని వివరించారు. పరిశీలిస్తామని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.
భవనంపై నుంచి పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దిల్లేశ్వర్ రహ్మత్ నగర్‌లో ఉంటూ కూలీ పని చేసేవాడు. ఆదివారం సంజయ్ నగర్ బస్తీలోని నాల్గో అంతస్తులో పని చేస్తుండగా పైనుంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.
వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో శ్రీసత్యసాయి జిల్లాలో 2012 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. జిల్లాలో మొత్తం 9187మంది వాలంటీర్లు ఉండగా ఇప్పటివరకు 2012 మంది రాజీనామా చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. వారిలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన 69మందిని తొలగించినట్లు పేర్కొన్నారు. దీంతో మెుత్తం 2072 మంది అయ్యారు.
పెళ్లికూతురిని ఆహరణకు యత్నించిన ఘటన తూగో జిల్లా కడియం(M)లో జరిగింది. కడియం సీఐ వివరాలు..చాగలమర్రి(M) గొడిగనూరుకు చెందిన స్నేహ, కడియంకు చెందిన బత్తిన వెంకటనందు నరసరావుపేటలో ఓ కాలేజీలో చదివారు. ఈ క్రమంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వెంకటనందు తన ఇంట్లో చెప్పగా పెద్దలు అంగీకరించారు. ఆదివారం మరోసారి పెళ్లి చేస్తుండగా పెళ్లికుతూరు తరుఫువాళ్లు వచ్చి వారిపై కారం చల్లి స్నేహ అపహరణకు యత్నించారు.
Sorry, no posts matched your criteria.