Andhra Pradesh

News June 16, 2024

ఆదోనిలో సినీ నటుడు సుమన్ సందడి

image

ఓ కాటన్ షాపు ప్రారంభోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి సినీ నటుడు సుమన్ ఆదివారం ఆదోనిలో పర్యటించారు. పట్టణంలోని కేవీఆర్ కాలనీలో కాటన్ షాపును ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదోని భవిష్యత్తు పూర్తిగా మారుస్తానని, పెద్దల సహకారంతో పరిశ్రమలను తీసుకొస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

News June 16, 2024

తాను చనిపోయి నలుగురికి అవయవదానం

image

పామిడికి చెందిన నితిన్(20) 4 రోజుల క్రితం పెయింటింగ్ పని చేస్తూ మూడంతస్తుల భవనం నుంచి కిందపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే తాను చనిపోయాక అవయవాలను దానం చేయాలని, ఇదే చివరి కోరిక అని తల్లికి చెప్పి చనిపోయాడు. తన కొడుకు కోరిక మేరకు నితిన్ అవయవాలను శనివారం దానం చేశారు.

News June 16, 2024

సీఎం టూర్.. పోలవరంలో ఎస్పీ తనిఖీలు

image

పోలవరంలో సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాలలో భద్రతా పరమైన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, వీవీఐపీ భద్రత కొరకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.

News June 16, 2024

ప.గో జిల్లాలో 3.4 మిల్లీమీటర్ల వర్షపాతం

image

గడచిన 24 గంటల వ్యవధిలో పశ్చిమ గోదావరి జిల్లాలో 3.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో యలమంచిలి మండలంలో 2.0 మిల్లీమీటర్లు, పాలకొల్లు మండలంలో 1.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాలేదని వివరించారు. సరాసరి జిల్లా వర్షపాతం 0.2 మిల్లీమీటర్లు నమోదయింది.

News June 16, 2024

రుషికొండపై పచ్చని రిసార్ట్స్ తొలగించి విలాస భవనం కట్టారు: గంటా

image

ప్రకృతి అందానికి నిలయమైన రుషికొండపై చెట్లను తొలగించడంతో పాటు రిసార్ట్స్ నేలమట్టం చేశారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఆదివారం ఆయన టీడీపీ నాయకులతో కలిసి రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ ఎంతో ముచ్చటగా కట్టుకున్న ఈ భవనంలోకి రాకుండా ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు.

News June 16, 2024

దేవాదాయ శాఖ మంత్రిని కలిసిన జిల్లా కలెక్టర్

image

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నెల్లూరు సంతపేటలోని ఆనం
రామ నారాయణరెడ్డి నివాసంలో ఆదివారం కలెక్టర్ హరి నారాయణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆనం రామనారాయణ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై కాసేపు వారు చర్చించుకున్నారు.

News June 16, 2024

విజయవాడ: విద్యార్థిని అనుమానాస్పద మృతి

image

విజయవాడ శివారు గూడవల్లిలో విద్యార్థిని శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని పటమట సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. అనంతపురానికి చెందిన జాహ్నవి చదువు నిమిత్తం గూడవల్లి వచ్చింది. శనివారం విద్యార్థిని ఆకస్మికంగా మృతి చెందడంతో పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. జాహ్నవి గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్ధారించగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

News June 16, 2024

సాలూరు: రోడ్డు ప్రమాదంలో హెల్త్ అసిస్టెంట్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో హెల్త్ అసిస్టెంట్ మృతి చెందాడు. రొంపల్లి ఆదినారాయణ(37) పాచిపెంట మండలం జిఎన్‌ పేట పీహెచ్సీలో హెల్త్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం విధులు ముగించుకొని బైక్‌పై వస్తుండగా ముచ్చర్లవలస సమీపంలో లారీ ఢీకొట్టింది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ శ్రీరాములు తెలిపారు.

News June 16, 2024

హోంమినిస్టర్‌కు గౌరవ వందనం సమర్పించిన పోలీసులు

image

నక్కపల్లిలో హోంమినిస్టర్ వంగలపూడి అనిత ఇంటి వద్ద పోలీసులు ఆమెకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు.

News June 16, 2024

VZM: ఈ చలానాల రూపంలో రూ.48,015 జరిమానా

image

విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక ఎం.పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. మోటార్ వెహికల్ నిబంధనలను అతిక్రమించిన వారిపై మొత్తం రూ.48,015 ఈ చలనా రూపంలో విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపినవారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 8 కేసులు నమోదు చేయగా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై 21 కేసులు నమోదు చేశామన్నారు.