India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పవన్ భీమవరం సభలో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రకాశం చౌక్‌లో పవన్ మాట్లాడుతుండగా.. ఇద్దరి కదిలికలపై అనుమానంతో పోలీసులు పట్టుకునేందుకు యత్నించారట. ఓ యువకుడు చాకుతో దాడికి దిగగా.. అతడిని, దుర్గాపురానికి చెందిన మరో యువకుడిని సైతం స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. వీరు జేబు దొంగతనాలకు వచ్చారా..?, మరేదైనా కారణమా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో కొలువైన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నేటి సోమవారం దర్శించుకున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10.15 గంటలకు సున్నిపెంటకు చేరుకుంటారు. 10.45 సాక్షిగణపతి దర్శించుకుంటారు. 11.20 వీరభద్రస్వామి దర్శనం,11.40 నుంచి12.30 గంటల మధ్య భ్రమరాంబ మల్లిఖార్జున స్వాములను దర్శించుకుంటారు.
ఇద్దరు మనుషులు కలిసి జీవించడానికి దేశాలు, భాషలు, ప్రాంతాలు, ఆచారాలు అడ్డు కావని ఓ ప్రేమ జంట రుజువు చేసింది. ఆదివారం ఈ తరహా వివాహమే జరిగింది. కొరిసపాడు మండలం మేదరమెట్లకు చెందిన ముప్పాళ్ల రాజా జపాన్‌లోని టోక్యో నగరంలో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అదే నగరంలో నివసిస్తున్న షిహో అనే యువతితో పరిచయం ఏర్పడింది. పెద్దల అంగీకారంతో టీటీడీ కళ్యాణ మండపంలో వారిద్దరి వివాహం జరిగింది.
తాడిపత్రిలో జేసీ పవన్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మురళి కృష్ణ తెలిపారు. పట్టణంలో 19న టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా యువకులు రెండు దొంగ ఓట్లు వేసి అయినా టీడీపీని గెలిపించాలని చేసిన వ్యాఖ్యలపై ఎంసీసీ టీం ఇన్‌ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ రాంమోహన్ ఫిర్యాదు మేరకు జేసీ పవన్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
రణస్థలం మండలం అల్లివలసలో మరో నిమిషాల్లో తాళి కట్టాల్సి ఉండగా.. ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మైలపల్లి లక్ష్ముడు ఇంట్లో ఆదివారం రాత్రి జరుగుతున్న వివాహ వేడుకల్లో విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందగా.. 12మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జీరుపాలెంకు చెందిన అంబటి సీతమ్మ(45) మరణించగా.. గాయపడిన వారు రణస్థలంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నాదెండ్ల మండల పరిధిలోని తూబాడు గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. తూబాడు చిరుమామిళ్ళ గ్రామాల మధ్యనున్న సాగర్ కాలువలో ఈత కొడదామని వెళ్ళిన ఇద్దరు చిన్నారులు షేక్ సిద్దిక్ (15), షేక్ అత్తర్ (15) నీట మునిగి చనిపోయారు. నీటి ప్రవాహానికి కాలువలో కొట్టుపోవడంతో గమనించిన స్థానికులు బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా సమీర్ ఖాన్‌ను నియమించారు. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర కమిటీ అధికారికంగా ఆదివారం ప్రకటన జారీచేసింది. వైసీపీ మైనార్టీ నేతగా క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు జిల్లాలో సోనుసూద్ ట్రస్ట్ తరఫున అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి దక్కింది.
ప.గో. జిల్లా కాళ్ళ మండలం జక్కరం గ్రామంలో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి పార్టీల కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఉండి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే మంతెన రామరాజు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ఉండి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థులు గెలిపించాలని సూచించారు.
సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్న వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ఆదివారం రాత్రి పండిత సదస్సును వైదిక వర్గాలు సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వేద పండితులు సింహాద్రి అప్పన్న శ్రీదేవి భూదేవిని కొనియాడుతూ కీర్తించారు. అనంతరం వేద పండితులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి, అదనపు కమిషనర్ చంద్రకుమార్ పాల్గొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న నాగరాజు గుండెపోటుతో అదివారం మృతిచెందారు. చిలమత్తూరులో గుండెపోటుకు గురి కావడంతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సన్నిహితులు తెలిపారు. విషయం తెలుసుకున్న సన్నిహితులు సంతాపం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.