Andhra Pradesh

News August 17, 2024

ఏడాదికి 15% వృద్ధి సాధించే దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్

image

రానున్న ఏడాదికి 15శాతం వృద్ధి సాధించే దిశగా జిల్లా ప్రణాళిక సిద్ధం చేయాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఈవో పీఆర్డీలతో ఆంధ్ర-2047 జిల్లా యాక్షన్ ప్లాన్‌పై సమావేశం నిర్వహించారు.

News August 17, 2024

విజయవాడ: ద్విచక్రవాహనదారులకు పోలీసులు హెచ్చరికలు

image

ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేయకూడదని డీసీపీ చక్రవర్తి స్పష్టం చేశారు. ఒకవేళ మార్పు చేస్తే వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్‌పై కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడలో ఆయన ద్విచక్ర వాహన మెకానిక్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా బైకుల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని తెలిపారు.

News August 17, 2024

విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు: జిల్లా వైద్యాధికారి

image

ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి హెచ్చరించారు. శనివారం బండి ఆత్మకూరు మండలంలోని నారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. రికార్డ్స్ వెరిఫై చేసి వాక్సినేషన్ పెర్ఫార్మన్స్, BCG, ANC, రికార్డులను ఇంప్రూవ్ చేసుకోవాలని డాక్టర్ కిరణ్ కుమార్‌కు సూచించారు.

News August 17, 2024

మక్కువలో మంత్రి సంధ్యారాణికి ఘన స్వాగతం

image

ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శనివారం మొదటిసారి తన సొంత మండలానికి వచ్చిన గుమ్మిడి సంధ్యారాణికి ఘన స్వాగతం లభించింది. అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికి, దారి పొడవునా పూలు చల్లారు. మజ్జి గౌరమ్మ తల్లి గుడి నుంచి 4రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చాలా కాలం పాటు పదవిలో లేకపోయినా, తన వెన్నంటే ఉండి గెలిపించిన వారందరినీ మరవనని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.

News August 17, 2024

కడప: జడ్పీటీసీలకు వైసీపీ అధిష్ఠానం నుంచి పిలుపు

image

కడప జిల్లా జడ్పీటీసీలు ఈ నెల 21వ తేదీ విజయవాడకు రావాలంటూ వైసీపీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి నిలుపుకోవడానికి మాజీ సీఎం జగన్ జడ్పీటీసీలతో సమావేశం అవుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేయడంతో జడ్పీ ఛైర్మన్ పదవి ఖాళీగా ఉంది.

News August 17, 2024

నెల్లూరు నుంచి తిరుగు పయనమైన ఉప రాష్ట్రపతి

image

నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకుని తిరిగి వెళుతున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ దంపతులకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు వీడ్కోలు పలికారు. వీరితో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి హెలికాప్టర్ లో వెళ్లారు. వీడ్కోలు పలికిన వారిలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా అధికారులు కూడా ఉన్నారు.

News August 17, 2024

GNT: 19 వరకు దరఖాస్తులకు గడువు

image

గుంటూరు మెడికల్ కాలేజీ పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తులు, కౌన్సిలింగ్ తేదీల్లో మార్పులు జరిగాయి. గతంలో ఆగస్టు 6 వరకు దరఖాస్తులు, 19న కౌన్సెలింగ్ జరుగుతుందని ప్రకటించారు. ఏపీ పారామెడికల్ బోర్డు ఆదేశాల మేరకు ఈనెల19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 27వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తాజాగా స్పష్టం చేవారు. ఈ విషయాన్ని దరఖాస్తుదారులు గమనించాలని కోరారు.

News August 17, 2024

దువ్వాడ వాణికి 41ఏ నోటీసులు జారీ

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణీకి శనివారం టెక్కలి పోలీసులు 41ఏ నోటీసులను జారీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ శ్రీనివాస్ నివాసం ఆవరణలో నిరసన తెలుపుతున్న వాణీకి నోటీసులు అందజేసేందుకు టెక్కలి పోలీసులు వెళ్లారు. అయితే తానే స్వయంగా టెక్కలి పోలీస్ స్టేషన్‌కు వచ్చి నోటీసులు తీసుకుంటానని వాణి పోలీసులకు వివారించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో వాణిపై కేసు నమోదైన విషయం విధితమే.

News August 17, 2024

పుట్టపర్తి – ధర్మవరం మధ్య రాకపోకలు ప్రారంభం

image

పుట్టపర్తి-ధర్మవరం మధ్య రాకపోకలు ప్రారంభమైనట్లు పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ తెలిపారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొత్తచెరువు మండల పరిధిలోని కేశవరం వద్ద వంకపేరు వరద నీటి ప్రవాహానికి రాకపోకలు స్తంభించాయి. మరమ్మతుల అనంతరం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశాల మేరకు రాకపోకలు ప్రారంభించినట్లు ఆర్డీవో పేర్కొన్నారు. కొన్నిచోట్ల వాగుల్లో వరద ఉద్ధృతి తగ్గడంతో రాకపోకలు ప్రారంభమైయ్యాయి.

News August 17, 2024

ఏలూరులో వైసీపీ కార్యాలయం కూల్చివేత

image

ఏలూరులో వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు. ఈ అంశంపై మాజీ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. కార్యాలయ కూల్చివేతలో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. రెండేళ్ల లీజు కోసం స్థలం తీసుకుని తాత్కాలిక నిర్మాణం చేపట్టామన్నారు. లీజు గడువు ముగియడంతో భవనాన్ని యజమానికి అప్పగించామని చెప్పారు. ఇక వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగతంగా ఇకపై అందరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.