India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హిరమండలంలోని దాసుపురం గ్రామానికి చెందిన సిద్ధమడుగుల శంకర్రావు (26) చవితి సీది వెళ్తుండగా కోడూరు దగ్గరలో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయినట్లు హిరమండలం పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ఈ ప్రమాదంలో అతని ముఖం రోడ్డును బలంగా తాకి తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన హిరమండలం ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విజయనగరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీనును పార్టీ ప్రకటించింది. గజపతినగరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో ఆయన పోటీచేశారు. ఆయన సేవలను అధిష్ఠానం గుర్తించి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్ అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించాలని శ్రీను కోరారు.
స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఉచిత యోగ వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నట్లు అమరావతి యోగా, ఏరోబిక్ సంఘ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటలకు కలెక్టర్ ఢిల్లీ రావు ఈ శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. నగరంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
జిల్లాలో ఆదివారం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో తెనాలి నియోజకవర్గ పరిధిలో రూ.4,60,880ల విలువ గల 6584 గ్రాముల వెండి సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన తనిఖీలలో ఏప్రిల్ 21 వ తేది సాయంత్రం 6 గంటల వరకు రూ.2,31,26,840ల నగదు, మద్యం జప్తు చేశామన్నారు.
ఉండి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా TDP తొలుత సిట్టింగ్ MLA మంతెన రామరాజు పేరును ఖరారు చేసి, తర్వాత ఆ స్థానం నుంచి రఘురామకృష్ణను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా..ఈ రోజు కాళ్ళ మండలం జక్కరంలో కూటమి నాయకులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో వారిద్దరూ ఒకేవేదికను పంచుకొన్నారు. ఈ సందర్భంగా నవ్వులు చిందిస్తూ ముచ్చటించిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. సమన్వయంతో పనిచేసి గెలుస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు నియమితులయ్యారు. ఆత్మకూరు నియోజకవర్గానికే చెందిన పుట్టం బ్రహ్మానందరెడ్డిని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఈ క్రమంలో ఇద్దరు నేతలను ఆత్మకూరు అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అభినందించారు.
అచ్చుతాపురం మండలంలో కరెంట్ షాక్‌కు గురై ఒక వ్యక్తి మృతి చెందాడు. రామన్నపాలెంకి చెందిన ధర్మిరెడ్డి శ్రీను (42) తన ఇంటి ముందు ఏర్పాటు చేసిన రేకుల షెడ్‌లో విద్యుత్ వైర్లు తగిలించే క్రమంలో కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బుచ్చిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గుంటూరులో వృద్ధురాలు మృతి చెందిన ఘటనపై ఆదివారం లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు సుమారు 70 సంవత్సరాలు కలిగిన గుర్తుతెలియని వృద్ధురాలు సంగడిగుంట లాంచర్ రోడ్డులో అపస్మారక స్థితిలో పడి ఉంది. స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆచూకీ తెలిసినవారు లాలాపేట పోలీసులకు తెలియజేయాలని అన్నారు.
కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని చొప్పెల్ల గ్రామంలో ఆదివారం లారీ బోల్తాపి ఓ వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై శ్రీను నాయక్ తెలిపారు. వివరాలు ఇలా.. కొత్తపేటకు చెందిన పెద్దరెడ్డి రాజు చొప్పెల్ల గ్రామంలోని ఓ ఇటుక బట్టీ వద్ద మట్టితో ఉన్న లారీ అన్లోడింగ్ చేయడానికి వాహనాన్ని వెనుక వైపు కదిలించగా ప్రమాదవశాత్తు లారీ బోల్తాపడింది. దీంతో రాజు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పారు.
వేటపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలను దాటుతున్న ఓ యువకుడిని రైలు ఢీకొట్టిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయసు 30 సంవత్సరాలు ఉంటుందని, మట్టి కలర్ చొక్కా, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. యువకుడి వివరాలు తెలిస్తే చీరాల రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.