Andhra Pradesh

News October 3, 2024

రోజా గారూ.. అప్పుడు ఏమైంది: వాసంశెట్టి

image

అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి రోజా ట్వీట్ చేయగా..దీనికి కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కౌంటర్ ఇచ్చారు. ‘రోజా గారూ మీరు మంచి మనసుతో ఇలా స్పందించడం చాలా ఆనందం. కానీ ఆరోజు రాజకీయాలకు సంబంధంలేని లోకేశ్ తల్లి భువనేశ్వరిని నిండు సభలో YCP నేతలు అవమానించినప్పుడు పకపక నవ్వారు కదా అప్పుడు ఏమైంది మీ స్పందన?’అని వాసంశెట్టి ట్వీట్ చేశారు.

News October 3, 2024

సాలూరు- విశాఖ వయా బొబ్బిలి.. రేపే ట్రైల్ రన్

image

కొన్నేళ్ల నుంచి ట్రైన్ సాలూరు వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజలకు శుక్రవారం ట్రైల్ రన్ నిర్వహిస్తున్నట్లుగా తెలియ వచ్చింది. రేపు ఉదయం 10 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభమై 12.30కు బొబ్బిలి 1.10 కి సాలూరు చేరుకుని తిరుగు ప్రయాణమై సాయంత్రం 4.30 గంటలకు విశాఖపట్నం చేరుకోనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం రైల్వే అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 3, 2024

ముంబై నటీ జెత్వానీ కేసులో నేడు హైకోర్టులో విచారణ

image

ముంబై నటీ జెత్వానీ కేసులో నేడు గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారుల తరఫు న్యాయవాదులు మంగళవారం తమ వాదనలు వినిపించగా న్యాయస్థానం కేసును ఈ రోజుకు వాయిదా వేసింది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపించనున్నారు

News October 3, 2024

కృష్ణా: ముంబై నటీ జెత్వానీ కేసులో నేడు హైకోర్టులో విచారణ

image

ముంబై నటీ జెత్వానీ కేసులో గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారుల తరఫు న్యాయవాదులు మంగళవారం తమ వాదనలు వినిపించగా న్యాయస్థానం కేసును గురువారానికి వాయిదా వేసింది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ.. న్యాయవాది వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపించనున్నారు.

News October 3, 2024

వాహనాలకు ఎలాంటి పాస్ ఇవ్వడంలేదు: కలెక్టర్

image

విజయవాడ దసరా ఉత్సవాలలో VIP దర్శనాలకు ప్రత్యక యాప్ అందుబాటులోకి తెచ్చి 21 కేటగిరిల్లో పాస్‌లు ఇచ్చామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఈ పాస్‌లు కేవలం దర్శనం కోసమేనని, వాహనాలకు ఎలాంటి పాస్ ఇవ్వడంలేదన్నారు. ఈ పాస్‌లు ఉన్నవారు పున్నమి ఘాట్ వద్దకు చేరుకుంటే, అక్కడి నుంచి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన కార్లలో ఇంద్రకీలాద్రి కొండపైకి చేరుస్తామని కలెక్టర్ చెప్పారు.

News October 3, 2024

సూళ్లూరుపేటలో వీఆర్వోపై ఇసుక మాఫియా దాడి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మహిళా VROపై దాడి జరిగింది. సూళ్లూరుపేట(M) కాళంగి నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను ఇలుపూరు దగ్గర వీఆర్వో శ్రీదేవి పట్టుకున్నారు. దానిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మన్నారుపోలూరు వద్ద ట్రాక్టర్ యజమాని వీఆర్వోని అడ్డగించారు. ఆమెను బెదిరించి ఫోన్ పగలగొట్టే ప్రయత్నం చేశాడు. ఆమె వెంటనే ఎమ్మార్వోకు సమాచారం ఇవ్వగా.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News October 3, 2024

కడపలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు

image

కడపలోని కాగితాలపెంట ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ఏడీ కె.రత్నబాబు తెలిపారు. ఈనెల 4న ఉదయం 10 గంటలతు టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్థులు హాజరుకావాలన్నారు. ICICI బ్యాంకు, అభి గ్రీన్ టెక్నాలజీ, రిలయన్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలన్నారు.

News October 3, 2024

విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి APSRTC ఏసీ బస్సు

image

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి ఇంద్ర AC బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజు అర్థరాత్రి ఒంటి గంటకు విజయవాడ చేరుకునే ఈ బస్సు (సర్వీస్ నం.47745) ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని ఆర్టీసీ అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

News October 3, 2024

పుంగనూరులో బాలిక మృతి.. ఎప్పుడు ఏం జరిగిందంటే?

image

పుంగనూరులో అస్పియా అంజుమ్(7) మృతి కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి బాలిక అదృశ్యమైంది. అదే రోజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉబేదుల్లా కాంపౌండ్ వద్ద బాలిక మిస్ అయినట్లు గుర్తించి చెంగ్లాపురం రోడ్డు పరిసరాల్లో పోలీసు జాగీలాలతో సోమవారం గాలించారు. డీఐజీ షేముషఇ భాజ్‌పాయి మంగళవారం పుంగనూరు వచ్చి బాధితులతో మాట్లాడారు. బుధవారం సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో బాలిక శవమై కనిపించింది.

News October 3, 2024

VZM: టెట్ ఎగ్జామ్‌కి వెళ్లే వారు ఇవి పాటించండి

image

ఈ రోజు నుంచి జరిగే టెట్ ఆన్లైన్ పరీక్షలకు అభ్యర్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి 30 నిమిషాలు ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒరిజినల్ ఐడీ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. వీహెచ్, పీహెచ్ అభ్యర్థులకు 50 నిమిషాలు అదనంగా సమయం కేటాయిస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో రావడం నిషేధం.