Andhra Pradesh

News September 1, 2024

సెంట్రల్ సూపర్‌వైజరీ బోర్డు సభ్యురాలిగా శబరి

image

నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి కేంద్రంలో మరో కీలక పదవి లభించింది. ఆమెను సెంట్రల్ సూపర్‌వైజరీ బోర్డు సభ్యురాలిగా నియమించారు. దేశ వ్యాప్తంగా లింగ నిర్ధారణ పరీక్షల నిషేధాన్ని ఈ బోర్డు పర్యవేక్షిస్తుంటుంది. ఈమెతో పాటు మహారాష్ట్రలోని దూలే ఎంపీ డాక్టర్ బచావ్ శోభా దినేశ్‌ను సభ్యురాలిగా కేంద్రం నియమించింది. దీంతో బైరెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

News September 1, 2024

గాలివీడు: బాల్య వివాహం కేసులో ఏడుగురి అరెస్ట్

image

గాలివీడు మండలంలోని రెడ్డివారిపల్లెకు చెందిన మైనర్ బాలికకు ఆమె తల్లిదండ్రులు, వారి బంధువుల ప్రోద్బలంతో ఆగస్టు 22న వివాహం జరిపించారు. ఈ విషయమై ఐసిడిఎస్ సూపర్వైజర్ ఫిర్యాదు మేరకు బాల్య వివాహ నేర చట్టం క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణ అనంతరం పెళ్లి కుమారుడు, వారి తల్లిదండ్రులు, బంధువులు మొత్తం 7 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

News September 1, 2024

విజయవాడ – నరసాపురం రైలు రద్దు

image

రాష్ట్రమంతా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొన్ని రైళ్లను రద్దు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 2న విజయవాడ – నరసాపురం రైలును రద్దు చేసినట్లు రైల్వే శాఖ విజయవాడ డివిజన్ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలన్నారు.- SHARE IT

News September 1, 2024

శ్రీకాకుళం: నేటి ఖో ఖో జట్ల ఎంపికలు వాయిదా

image

శ్రీకాకుళం జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీన (ఆదివారం) శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో జరగనున్న సబ్ జూనియర్ జిల్లా జట్లు ఎంపికలు వర్షం కారణంగా వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఆ సంఘం అధ్యక్షుడు నాగ భూషణరావు తెలిపారు. ఎంపికలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని క్రీడాకారులు గమనించాలన్నారు.

News September 1, 2024

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో బిగ్ ట్విస్ట్

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, భార్య దువ్వాడ వాణీ వివాదం ఎపిసోడ్‌లో శనివారం ఒక బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్‌తో సన్నిహితంగా ఉంటున్న దివ్వెల మాధురి రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురికి ఫోన్ చేశారు. “దువ్వాడ వాణీ వేధింపుల కారణంగానే నేనే ఆత్మహత్య ప్రయత్నం చేసానని శ్రీనివాస్ మాధురికి సలహా ఇచ్చిన ఆడియో తాజాగా బయటకు రావడం చర్చనీయాంశమైంది.

News September 1, 2024

మదనపల్లెలో యువకుడి మృతి.. ఆచూకీ లభ్యం

image

మదనపల్లె బెంగుళూరు రోడ్డులో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ లభించినట్లు తాలూక ఎస్ఐ హరిహరప్రసాద్ తెలిపారు. నిమ్మనపల్లె మండలం చౌకిల్లపల్లెకు చెందిన శివ(30) బెంగళూరు నుంచి బైకుపై స్వగ్రామానికి వస్తుండగా, మదనపల్లె చిప్పిలి వద్ద లారీ ఢీకొని తీవ్రంగా గాయపడి అక్కడి కక్కడే దుర్మరణం చెందాడు. మృతునికి భార్య జ్యోతి, పిల్లలు ఉన్నట్లు తెలిపారు.

News September 1, 2024

ప్రకాశం: ఈనెల రేషన్‌తో పాటు పంచదార పంపిణీ

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సెప్టెంబరు నెలకు సంబంధించి రేషన్‌తో పాటు పంచదారను పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసింది. ఆమేరకు చౌక ధరల దుకాణాలకు చేర్చడం జరిగింది. ఏఏవై కార్డులకు 1 కిలో రూ 13.50, ఇతర కార్డులకు 1/2 కేజీ రూ.17 పంపిణీ చేయనున్నారు. తూకం, నాణ్యత, పంపిణీలో లోపాలుంటే 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

News September 1, 2024

వర్షాల ఎఫెక్ట్..రెండు రోజుల పాటు రైళ్ల రద్దు

image

భారీ వర్షాల కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసినట్లు డివిజన్ రైల్వే మేనేజర్(DRM) కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు విజయవాడ నుంచి డోర్నకల్, గుంటూరు, భద్రాచలం రోడ్ వెళ్లే మెము రైళ్లను సెప్టెంబర్ 1,2వ తేదీలలో రద్దు చేశామని పేర్కొంది. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు.

News September 1, 2024

VZM: తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే..

image

జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌న్న వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు మేర‌కు జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ఈ నేప‌థ్యంలో కంట్రోల్ రూమ్‌ల‌ను ఏర్పాటు చేశారు. క‌లెక్ట‌రేట్ కంట్రోల్ రూమ్ 08922 236947, విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్ కంట్రోల్ రూమ్ 08922 276888, బొబ్బిలి డివిజ‌న్ కంట్రోల్ రూమ్ 9390440932, చీపురుప‌ల్లి కంట్రోల్ రూమ్ 7382286268 నంబర్లను కేటాయించామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు.

News September 1, 2024

విశాఖ: వాహన చోదకులు తస్మాత్ జాగ్రత్త.. పోలీసుల హెచ్చరిక

image

వాహన చోదకులారా.. తస్మాత్ జాగ్రత్త.. నిబంధనలు పాటించండి, రోడ్డు ప్రమాదాలు నియంత్రించండి అంటూ సిటీ పోలీస్‌లు అప్రమత్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి గానీ, వెనుక కూర్చున్న వ్యక్తి గానీ, వాహనంపై ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరు BIS మార్క్ కలిగిన హెల్మెట్ ధరించాలి. ఫోర్ వీలర్ నడిపే వారు సీట్ బెల్ట్ ధరించవలెను.