India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ధర్మవరం పట్టణంలోని కేతిరెడ్డి కాలనీకి చెందిన బాలుడు శనివారం అదృశ్యమయ్యాడు. బాలుడు విహాన్ రాజు ఇంటి బయట ఆడుతూ ఉండగా కొద్దిసేపటికి చూసేలోపే అదృశ్యం అయ్యాడని తల్లిదండ్రులు హరి ప్రసాద్, రామలక్ష్మి పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు ధర్మవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కి అప్పగించాలని పోలీసులు తెలిపారు .

శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ శనివారం తొలిసారిగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) అధికారులతో దిల్లీలో సమావేశమయ్యారు. పౌర విమానయాన రంగంలో AAI విధులు, ఇటీవల AAI సాధించిన విజయాలను తెలుసుకున్నానని రామ్మోహన్ పేర్కొన్నారు. విమానయాన రంగంలో నూతన ప్రమాణాలు నెలకొల్పడానికి ఇదే సరైన సమయం అని వారికి తదుపరి కార్యాచరణపై దిశానిర్దేశం చేశానని ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆంధ్రా యూనివర్సిటీ(AU) పరిధిలో ఏప్రిల్- 2024లో జరిగిన బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(B.F.A) 8వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.
డిగ్రీ విద్యార్థులు పరీక్షల ఫలితాలు చెక్ చేసుకోవాలని ఆంధ్రా యూనివర్శిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/ చూడాలని AU పరీక్షల విభాగం తెలిపింది.

కడప నగరంలోని రాజారెడ్డికి వీధికి చెందిన దివ్యాంగుడు కనపర్తి మనోజ్ కుమార్‌కు సీఎం చంద్రబాబు ఆర్థిక సహాయం ప్రకటించారు. శనివారం మంగళగిరిలో సీఎం చంద్రబాబును మనోజ్ కలిశారు. తన సమస్యను వివరించి వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని కోరగా.. సీఎం అతడికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. మనోజ్ కుమార్ చాలా రోజుల నుంచి అనారోగ్యంతో వీల్ చైర్‌కే పరిమితమయ్యాడు.

సోంపేట సెబ్ సీఐ ఆర్.జై భీమ్ ఆధ్వర్యంలో మందస మండలం కొండలోగాం పంచాయతీలోని నాటుసారా స్థావరాలపై శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. రామరాయి, పట్టులోగాం, ఇంద్రాడ వీధి, టుబ్బాగాం గ్రామాలో దాడులు నిర్వహించి 1600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా బట్టీలు ఎవరు నిర్వహిస్తున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నాటుసారా అమ్మకాలు గూర్చి సమాచారం తెలిస్తే 94409 02358కు సమాచారం ఇవ్వాలన్నారు.

గోవులను వధించినా, అక్రమంగా నిల్వ ఉంచినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ రామకృష్ణ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 17న బక్రీద్ సందర్భంగా జంతువుల అక్రమ రవాణా, వధ అరికట్టే ఉద్దేశ్యంతో జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. జంతువుల అక్రమ రవాణా, వధ జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

రావికమతం మండలం టి.అర్జాపురం గ్రామంలో శనివారం పిడుగు పడి రైతు రాజాన పెంటయ్య మృతి చెందాడు. పెంటయ్య తన పశువులను మేతకు తీసుకువెళ్లాడు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో ఇంటికి వెళ్లే ప్రయత్నంలో రైతుకు సమీపంలో పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

చిత్తూరు పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 18 మందికి పదివేలు రూ.1,80,000 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు తెలిపారు. చిత్తూరు పరిధిలో నిర్వహించిన వాహనాల తనిఖీలలో శుక్రవారం 18 మంది పట్టుబడినట్లు చెప్పారు. వారిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో ప్రవేశ పెట్టగా జడ్జి ఉమాదేవి ఫైన్ విధించినట్లు తెలిపారు.

శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా నీరు వచ్చి చేరుతోంది. శనివారం తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి 15,131 క్యూసెక్కులు చేరాయి. అదే సమయానికి జలాశయ నీటిమట్టం 810.90 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం 34.8332 టీఎంసీలుగా ఉంది. ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిస్తే అనుకున్న మేరకు నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉంది.

వాల్తేరు డివిజన్ పరిధిలోని కోటబొమ్మాళి-టీలేరు వంతెన మరమ్మతుల కారణంగా17న పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. 17న పలాస-విశాఖ-పలాస పాసింజర్ రైలు, విశాఖ-గుణుపూర్-విశాఖ పాసింజర్ రైలును రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే 17న బయలుదేరే విశాఖ-బ్రహ్మపూర్, 18న బయలుదేరే బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.