Andhra Pradesh

News April 21, 2024

వెంకటగిరి అభ్యర్థి రామకృష్ణనే ..!

image

వెంకటగిరి టీడీపీ MLA అభ్యర్థిగా కురుగొండ్ల రామకృష్ణ పోటీలో ఉండనున్నారు. ఈమేరకు మంగళగిరికి వచ్చి బీఫారం తీసుకెళ్లాలని ఆయనకు TDP కేంద్ర కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఈ సీటును ఆయన కుమార్తె లక్ష్మీసాయిప్రియకు కేటాయించారు. ఇప్పటికే ఆమెతో పాటు రామకృష్ణ నామినేషన్ వేశారు. ఆయన అయితేనే అనుకూల వాతావరణం ఉంటుందని వచ్చిన నివేదికల మేరకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు సమాచారం.

News April 21, 2024

ఈనెల 23న ఎంపీ అభ్యర్థి సునీల్ నామినేషన్

image

ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఈనెల 23న నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 23న ఉదయం 9 గంటలకు ఏలూరు పాత బస్టాండ్ నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి తరలి వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ నామినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.

News April 21, 2024

అనంత: పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి

image

పుట్టపర్తి మండలంలోని దిగువ చెర్లోపల్లికి చెందిన ఆకుల వీరప్ప పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. శనివారం సాయంత్రం మేకలను మేపుకొని ఇంటికి వస్తుండగా వర్షం రావడంతో వీరప్ప మర్రిచెట్టు కిందకి వెళ్ళాడు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో ఆకుల వీరప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News April 21, 2024

కోలగట్ల వీరభద్రస్వామి అప్పు ఎంతో తెలుసా!

image

☞ అభ్యర్థి: కోలగట్ల వీరభద్రస్వామి
☞ నియోజకవర్గం: విజయనగరం
☞ పార్టీ: వైసీపీ
☞ చరాస్తులు: రూ.6.48
☞ కేసులు: 2
☞ బంగారం: 1KG
☞ స్థిరాస్తి: రూ.15.34
☞ అప్పులు: రూ.7.49 కోట్లు
☞ భార్య పేరిట చరాస్తులు: రూ.2.97 కోట్లు
☞ భార్య పేరిట స్థిరాస్తి: రూ.4.60 కోట్లు
☞ భార్య పేరిట బంగారం: 2KG
☞ కార్లు: లేవు
➠ కోలగట్ల వీరభద్రస్వామి శనివారం నామినేషన్ దాఖలు చేయగా, ఆఫిడవిట్‌లో ఈ వివరాలను వెల్లడించారు.

News April 21, 2024

రేపు జగ్గంపేటలో పర్యటించనున్న చంద్రబాబు

image

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జగ్గంపేటలో పర్యటించనున్నట్లు ఆపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. చంద్రబాబు రోడ్ షోలో భాగంగా శనివారం హెలీప్యాడ్ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. గోకవరం రోడ్డులో కోడూరి రంగారావుకు చెందిన స్థలం వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

News April 21, 2024

ఏలూరు ఆశ్రంకు ఐఎస్ఓ గుర్తింపు

image

ఏలూరులోని అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఆశ్రం)కు ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్డాండర్డ్‌రైజేషన్‌ (ఐఎస్‌ఓ) గుర్తింపు దక్కినట్లు డైరెక్టర్‌ జి.రతీదేవి తెలిపారు. ఆశ్రంలో అందుబాటులోకి తెచ్చిన ప్రపంచస్థాయి సౌకర్యాలు, వైద్య సేవలు, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలు, శక్తి, పర్యావరణ అనుకూల వ్యవస్థకు ఐఎస్‌ఓ 5 సర్టిఫికెట్లు అందించిందన్నారు.

News April 21, 2024

విధుల్లో ఉన్న వారందరికీ పోస్టల్‌ బ్యాలెట్: కలెక్టర్

image

ఎన్నికల రోజున విధుల్లో ఉన్న వారందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఇస్తారని తూ.గో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవిలతా తెలియజేశారు. అవసరమైన వారు దీనిని ఉపయోగించుకోవచ్చని అన్నారు. జిల్లాలో సుమారు 6 వేల మందికి పైగా పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోనున్నారని వెల్లడించారు. జిల్లాలో ఉద్యోగ నిర్వహణలో ఉన్నవారు 12D ద్వారా పోస్టల్‌ ఓటు నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు.

News April 21, 2024

కడప: వివాహేతర సంబంధం.. నలుగురి ప్రాణాలు తీసింది

image

గాలివీడులో ముగ్గురు పిల్లలతో వివాహిత నాగమణి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భర్త మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే విషయంపై ఏడాదికి పైగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త విక్రమ్‌కు వేరే మహిళతో ఓ బిడ్డ పుట్టిందని తెలియడంతో.. తీవ్ర మనస్తాపంతో నాగమణి వెలుగల్లి జలాశయం వద్దనున్న గండిమడుగు వద్దకు వెళ్లి పిల్లలతో ఆత్మహత్య చేసుకుంది.

News April 21, 2024

నేడు ప.గో.లో పవన్ ప్రచారం.. షెడ్యూల్ ఇదే

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ప.గో జిల్లాలో
పర్యటించనున్నారు. సాయంత్రం 5గంటలకు నరసాపురం మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో  ఆయన ప్రసంగిస్తారు. అనంతరం ముత్యాలపల్లి, లోసరి, బర్రెవానిపేట, గొల్లవానితిప్ప గ్రామాల మీదుగా భీమవరం పట్టణానికి చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు ప్రకాశం చౌక్‌లో జరిగే బహిరంగ సభలో వారాహి పైనుంచి మాట్లాడుతారు. రాత్రి స్థానిక నిర్మలాదేవి ఫంక్షన్‌హాల్‌లో బస చేస్తారు.

News April 21, 2024

డిప్యూటీ మేయర్ పదవికి ఖలీల్ రాజీనామా

image

నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవికి ఖలీల్ అహ్మద్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని మేయర్ స్రవంతికి అందజేశారు. ఆయన వైసీపీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈక్రమంలోనే రాజీనామా చేసినట్లు చెప్పారు. రాజీనామా విషయాన్ని మేయర్ రహస్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది.

error: Content is protected !!