India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అక్రమంగా మద్యం విక్రయిస్తూ పలుమార్లు పట్టుబడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని తహశీల్దార్ హనుమంతురావు తెలిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎస్ఈబీ ఎస్సై ఆర్.రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో మండలంలోని పలుగ్రామాలకు చెందిన ఆరుగురిపై సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బైండోవర్ చేశారు. వీరంతా గతంలో పలుమార్లు మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డారని, వీరిపై నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు.
➤ అసెంబ్లీ: రాప్తాడు
➤ భర్త: పరిటాల రవీంద్ర
➤ విద్యార్హతలు: 8వ తరగతి పాస్
➤ చరాస్తి విలువ: రూ. 2.50 లక్షలు
➤ స్థిరాస్తులు రూ.28.53 కోట్లు
➤ కేసులు: 8
➤ అప్పులు: రూ.31.68
➤ బంగారం: 750 గ్రాముల
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం 13వ సారి ఎన్నికలు జరగబోతున్నాయి. గత రెండు ఎన్నికల్లో భారీ విజయాలను చవిచూసి, హ్యాట్రిక్ సాధించేందుకు టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ బరిలో నిలవగా.. వైసీపీ తరఫున మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాశ్ మొదటిసారిగా తూర్పు బరిలో ప్రత్యర్థిగా తలపడుతున్నారు. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అవినాశ్ అంటున్నారు. మరి మీ కామెంట్.
పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల ఈనెల 28వ తేదీన జిల్లాకు రానున్నారు. పర్యటనలో భాగంగా టెక్కలి, పలాసలో పర్యటించనున్నారు. ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు టెక్కలి, రాత్రి 7.30 గంటలకు పలాసలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గోనున్నారు. షర్మిల పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు దువ్వాడ తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, ఇండియా ఫోరం పార్టీల శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు.
ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఆర్వోకు సమర్పించారు. 11 క్రిమినల్ కేసులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. 2022-23లో వార్షిక ఆదాయం రూ.24,04,909గా చూపించారు. ప్రస్తుతం చేతిలో రూ.66 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. స్థిరాస్తులు రూ.4.20 కోట్లు, చరాస్తులు రూ.118 కోట్లుగా చూపించారు.
➤ పార్లమెంట్: గుంటూరు
➤ అభ్యర్థి: కిలారి వెంకట రోశయ్య (YCP)
➤ భార్య: లక్ష్మీ సరస్వతి
➤ విద్యార్హతలు: BA
➤ చరాస్తి విలువ: రూ.5.87 కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.5.01కోట్లు
➤ కేసులు: 4
➤ అప్పులు: రూ.3.17కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.1.07 లక్షలు
➤ బంగారం: 623 గ్రాములు, భార్యకు 1000 గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు 29 నుంచి మే 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఉదయ భాస్కర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు గమనించాలన్నారు.
అరుకు ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత 22న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమానికి కూటమి నేతలు భారీగా వచ్చి విజయవంతం చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గీత తప్పకుండా విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.
నర్సీపట్నం నియోజకవర్గం బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మసాగరం గ్రామానికి చెందిన జె.చంద్రమౌళిని ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ఈమెరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. తన మీద నమ్మకం ఉంచి సీటు కేటాయించిన అధినేత రామచంద్ర యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో నామినేషన్ వేస్తానని తెలిపారు.
24 గంటల్లోగా రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో పూర్తి స్థాయి సదుపాయాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమీషనర్, ఆర్అండ్బీ అధికారులను కలెక్టర్ డా.జి.సృజన అదేశించారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో జరుగుతున్న మరమ్మత్తు పనులను మున్సిపల్ కమీషనర్ భార్గవ తేజతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ అతిథి గృహ ఆవరణంలో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.