India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవం పలు కారణాలతో వాయిదా పడింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ సుధీర్ ప్రేమ్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాన్వకేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు గమనించాలని కోరారు.

రాజమండ్రి సిటీలో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శంభూనగర్ ఫ్లై ఓవర్ కింద శనివారం ఉదయం ఇద్దరు వ్యక్తులు మృతి చెంది ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రెండో పట్టణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. వీరిద్దరూ సోదరులని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఏళ్ల కాలం నుంచి ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో బకాయిలు పెరిగిపోతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లా కలెక్టర్ కార్యాలయం రూ.2.80 కోట్లు, హౌసింగ్ డీఈ కార్యాలయం రూ.2.10 కోట్లు, తపాలా శాఖ కార్యాలయం రూ.1.13 కోట్లు, జిల్లా పరిశ్రమల కేంద్రం రూ.62.95 లక్షలు, జిల్లా కోర్టు రూ.3.93 కోట్లు రావాల్సి ఉంది. వడ్డీతో కలిపితే రెట్టింపు బకాయిలు చెల్లించాల్సి ఉంది.

అనంతపురం జిల్లాలో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 2,795 మంది అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 8500292992కు సంప్రదించాలన్నారు.

నిరుద్యోగులకు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి దీప్తి పేర్కొన్నారు. సీ.క్యాంపులోని కార్యాలయంలో వివిధ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించారు. ఇనోవిజన్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ప్రై. లిమిటెడ్, జియో టవర్స్, నవభారత్ ఫర్టిలైజర్స్, అమర్ రాజా కంపెనీల వారు హాజరయ్యారు. మొత్తం 197 మంది హాజరు కాగా.. 64 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఆమె తెలిపారు.

కృష్ణా జిల్లా నూజివీడులో వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి చెందిందని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగిరిపల్లికి చెందిన నరసింహారావు కుమార్తె వాసంతి(28)ని కాన్పు కోసం ఈనెల 12న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. డెలివరీ చేసేందుకు 13న ఆసుపత్రి సిబ్బంది వాసంతిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లగా ఆమె మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పొంగూరు నారాయణను శనివారం ఉదయం నెల్లూరు మంత్రి నివాసంలో జిల్లా కలెక్టర్ హరినారాయణ్, ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకంక్షలు తెలియజేశారు. అనంతరం వారు కొంత సేపు జిల్లా అభివృద్ధి, శాంతిభద్రతలు ఇతర అంశాల విషయాలపై చర్చించుకున్నారు.

గుమ్మఘట్ట మండలం క్రిష్ణాపురానికి చెందిన రైతు మంజునాథ(55) శుక్రవారం రాత్రి బస్సు ఢీకొని మృతిచెందారు. మంజునాథ సాగుచేసే దానిమ్మ పంటకు మందులు తెచ్చేందుకు బైక్‌పై కర్ణాటక వెళ్లారు. తిరిగి స్వగ్రామం వస్తుండగా కర్ణాటక ప్రాంతం హనుమంతపల్లి క్రాస్ వద్ద బైక్‌ను ప్రైవేట్ బస్సు ఢీకొంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రైతు మృతిచెందారు. పోలీసులు విచారణ చేపట్టారు.

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత శనివారం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో కొలువుదీరిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన హోం మంత్రి అనితకు అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆమె అర్చకుల నుంచి వేద ఆశీర్వచనం అందుకున్నారు. ఈవో సత్యనారాయణ మంత్రికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత శనివారం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో కొలువుదీరిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన హోం మంత్రి అనితకు అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆమె అర్చకుల నుంచి వేద ఆశీర్వచనం అందుకున్నారు. ఈవో సత్యనారాయణ మంత్రికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
Sorry, no posts matched your criteria.