India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీలో ఎన్నికలను పూర్తి పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగం అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటర్లు అందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులను కల్పించాలన్నారు.
మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకి సేవను ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి, ఆలయ వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో మేళతాళాలతో పల్లకి సేవ నిర్వహించారు. ఈ పల్లకి ఉత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
నెల్లూరు జిల్లాలో రెండో రోజు 8 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ హరినారాయణ్ తెలిపారు. జిల్లాలో 8 స్థానాలకు 14 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు ఆయన తెలిపారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కొప్పుల రాజు నామినేషన్ సమర్పించారన్నారు. కోవూరు, నెల్లూరు సిటీ, సర్వేపల్లి, ఉదయగిరి నుంచి ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో మహిళా ఓటర్లు – పురుష ఓటర్లు
1.ఇచ్ఛాపురం 1,37,254 – 1,30,544
2.పలాస 1,11,709 – 1,06,877
3.టెక్కలి 1,18,129 – 1,17,511
4.పాతపట్నం 1,12,696 – 1,12,095
5.శ్రీకాకుళం 1,37,488 – 1,34,866
6.ఆముదాలవలస 97,477 – 95,987
7.నరసన్నపేట 1,07,434 – 1,06,841
8.మొత్తం ఓటర్లు 8,22,187 – 8,04,721
తిరుపతి జిల్లా పరిధిలోని ఒక పార్లమెంటు స్థానానికి మూడు నామినేషన్లు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 17 నామినేషన్లు వచ్చినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు 24 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేశారన్నారు. నామినేషన్ల పురస్కరించుకొని నియోజకవర్గాల్లోని ఆర్వో కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈనెల 25 వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుందన్నారు.
సివిల్ సర్వీసులో ఉత్తీర్ణత సాధించిన సింగరాయకొండకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డిని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ శుక్రవారం అభినందించారు. ఇటీవల సివిల్ సర్వీసులో కృష్ణారెడ్డి ఆల్ ఇండియా 780 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉదయ్ కృష్ణారెడ్డిని శాలువతో ఘనంగా సత్కరించారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు.
ఏ ప్రభుత్వ ఉద్యోగి ఓటు హక్కు మిస్ అవ్వకుండా సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లో అత్యవసర శాఖల పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులలో ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. వచ్చే నెల 5,6,7 తేదీలలో పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడా మైదానంలో ఏప్రిల్ 21న ఆదివారం హంటింగ్ టైగర్స్ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అండర్ 14 బాలుర ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శివప్రసాద్ నాయక్ శుక్రవారం తెలిపారు. ఈ పోటీలకు జిల్లాలో ఆసక్తిగలవారు ఎవరైనా జట్టుగా వచ్చి పోటీ చేయవచ్చని అన్నారు. ఈ పోటీలు ఉదయం 6 గంటలకు మొదలవుతాయని అదే రోజు సాయంత్రం విజేతలకు బహుమతులు కూడా అందజేస్తామన్నారు.
గుంటూరులో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గుజ్జనగుండ్ల సెంటర్ నుంచి పలకలూరు వెళ్లే రోడ్డులో శుక్రవారం రాత్రి ఒక కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు. అనంతరం ఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వాహన తనిఖీల్లో భాగంగా కావలి వన్ టౌన్ పరిధిలో రూ.4లక్షలు, బాలాజీ నగర్‌లో 2లక్షల 13 వేల నగదుతో పాటు 655 టీ కప్ సెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేపీ పోర్ట్ పరిధిలో పేకాట ఆడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రూ.4,500 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.