India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆగస్టులో జరగనున్న టీటీసీ లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జూలై ఒకటో తేదీలోగా పరీక్ష రుసుము చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. ఆలస్యమైతే రూ.50 అపరాధ రుసుముతో జూలై ఆరో తేదీలోగా చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు గమనించాలని సూచించారు.

ప్రయాణీకుల రద్దీ మేరకు సికింద్రాబాద్- కాకినాడ టౌన్ (ట్రైన్ నెం. 07135) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే(SCR) పేర్కొంది. ఈ నెల 21, 22వ తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 7 గంటలకు బయలుదేరే ఈ ట్రైన్ తర్వాతి రోజు ఉదయం 7.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుతుందని, ఈ రైలు ఉమ్మడి జిల్లాలో విజయవాడ, గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది.

నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాల శాఖ కేటాయించారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ప్రతిపక్ష హోదాలో టీడీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అధికారంలోకి వస్తే రోడ్లను బాగు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ శాఖ మన జిల్లా మంత్రికి కేటాయించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పాలిటెక్నిక్ మొదటి ఏడాది క్లాస్ వర్క్ ప్రారంభమైంది. పాలీసెట్ 2024 సీట్లు అలాట్మెంట్‌ను షెడ్యూల్ మేరకు ప్రకటించారు. మొదటి విడత కౌన్సిలింగ్‌లో సీట్లు లభించిన విద్యార్థులు రెండో విడత కౌన్సిలింగ్‌లో కళాశాలలు, బ్రాంచ్‌లు మార్చుకోవచ్చని శ్రీకాకుళం ప్రభుత్వం పాలిటెక్నిక్ ఇన్‌ఛార్జ్ దామోదర్ రావు తెలిపారు.

తాడిపత్రి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం గూడ్స్ రైలు ఢీకొని ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే ఎస్సై నాగప్ప తెలిపిన వివరాల మేరకు.. రాజంపేటకు చెందిన యల్లయ్య తాడిపత్రి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల వద్ద మూత్రవిసర్జన చేస్తున్నారు. ఆ సమయంలో గూడ్స్ రైలు ఢీకొంది. గమనించిన స్థానికులు యల్లయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురానికి తీసుకెళ్లారు.

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన దర్శిలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దర్శి మండలం లంకోజినపల్లికి చెందిన నవీన్ (16), చందు (16)లు గురువారం ఇద్దరూ బయటకు వెళ్లారు. తర్వాత వీరిద్దరూ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అన్ని చోట్ల వెతికారు. శుక్రవారం ఉదయం దర్శిలోని ఎన్‌ఎపీ చెరువులో మృతదేహాలు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ప.గో జిల్లా అత్తిలి మండలం స్కిన్నెరపురానికి చెందిన ఏసురాజు అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(6)ను అత్యాచారం చేశాడనే ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేశామని SI రాంబాబు తెలిపారు. బాలిక ఆడుకుంటున్న సమయంలో ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు తెలిపారు. ఆమెకు కడుపులో నొప్పి రావడంతో తల్లి అసలు విషయం తెలుసుకుని ఈనెల 9న ఫిర్యాదు చేసింది. దీంతో ఏసురాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించామని అన్నారు.

ఎంకే దత్తారెడ్డి (122) వీర విహారం చేయడంతో సౌత్‌జోన్ అంతర్ జిల్లా అండర్-23 క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం అనంత క్రీడా గ్రామంలో ప్రారంభమైన వన్‌డే పోటీలో నెల్లూరు జట్టును 39 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అనంత జట్టు దత్తారెడ్డి శతకంతో 25 ఓవర్లలో 9 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. నెల్లూరు జట్టు 23.4 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది.

పిఠాపురం మండలం భోగాపురంలో ప్రసాద్ అనే వ్యక్తి హత్యకు గురైన విషయం<<13436940>> తెలిసిందే.<<>> ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ప్రసాద్(48), పద్మరాజు కాకినాడలో పనికి వెళ్లేవారు. డబ్బుల విషయంలో వీరి మధ్య గొడవ జరగ్గా.. ఇవ్వకపోతే చంపేస్తానని ప్రసాద్ పద్మరాజును బెదిరించాడు. కోపం పెంచుకున్న పద్మరాజు.. ఆలయం ముందు నిద్రించిన ప్రసాద్‌ను బండరాయితో మోది హతమార్చాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

యాక్షన్ కింగ్, ప్రముఖ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య రిసెప్షన్ వేడుకలు ఘనంగా జరిగాయి. తమిళ హాస్యనటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడైన ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య పెళ్లయిన విషయం తెలిసిందే. శుక్రవారం చెన్నైలోని ఓ ప్యాలెస్‌లో వీరి రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆర్కే రోజా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Sorry, no posts matched your criteria.