India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు హోంశాఖ కేటాయించి ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. ఈ ప్రాంతంవారికి హోంశాఖ రావడం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో ఎన్టీఆర్ కేబినేట్‌లో చీపురుపల్లి టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు హోంమంత్రిగా పనిచేశారు. నాడు ఆయన ప్రాతినిధ్యం వహించిన ఉణుకూరు నేడు రాజాం నియోజకవర్గంలో భాగమైంది.

సీఎం చంద్రబాబు నాయుడు తనకు అప్పగించిన బాధ్యతను దైవ కార్యంగా భావిస్తానని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తనకు కీలకమైన హోం శాఖను అప్పగించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.

గత ఐదేళ్లలో పెద్దిరెడ్డి, ఆయన కుటుంబం, అనుచరులు అరాచకాలు, భూకబ్జాలు, గనుల దోపిడీ చేశారని బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ఆరోపించారు. విద్యుత్తు ఒప్పందాల్లోనూ అవినీతి జరిగిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. వీటిపై సమగ్ర విచారణకు మూడు రకాల కమిటీలు వేయాలని.. పెద్దిరెడ్డిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

వల్లూరు మండలంలోని నల్లపురెడ్డిపల్లెకు చెందిన ఉపాధి కూలీలు శుక్రవారం ఉపాధి పనులు చేయడానికి ఆటోలో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న ఆటో తోల్ల గంగన్న పల్లె సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ముంతా రాములమ్మ, స్వాతి, కృపావతి అనే మహిళా కూలీలు గాయపడ్డారు. చికిత్స కోసం వారిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎంపీడీవో విజయ భాస్కర్, ఏపీఓ సుధారాణి, ఉపాధి సిబ్బంది వారిని పరామర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన జలవనరుల శాఖను సీఎం చంద్రబాబు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు కేటాయించారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ శాఖకు మంత్రిగా జిల్లాకు చెందిన దేవినేని ఉమ ఐదేళ్లపాటు పనిచేశారు. సమర్థుడైన నిమ్మల ఈ శాఖకు న్యాయం చేస్తారని, మంత్రిత్వ శాఖల కేటాయింపులో చంద్రబాబు మార్క్ కనిపించిందని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. విశాఖ విచ్చేసిన మంత్రి ఐఎన్ఎస్ డేగాలో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రక్షణ రంగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ బలమైన స్వావలంబన కలిగిన రక్షణ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల ఆనందానికి హద్దుల్లేవు. తమ ఆనందాన్ని, టీడీపీకి తమ మద్దతును ఆ పార్టీ శ్రేణులు వివిధ రూపాల్లో తెలియజేస్తున్నాయి. తాజాగా పలువురు తమ బైక్‌లపై విజయవాడ ఎంపీ గారి తాలూకా అంటూ స్టిక్కర్లు ముద్రిస్తున్నారు. విజయవాడ ఎంపీ చిన్ని ఫోటో, ఎన్నికల్లో ఆయన సాధించిన మెజారిటీతో తిరుగుతున్న బైక్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్థవంతంగా పని చేస్తానని నారా లోకేశ్ తెలిపారు. హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖల మంత్రిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలుపుతూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పటి వరకు 21 మంది మంత్రులుగా పనిచేశారు. కోటిరెడ్డి, మునిరెడ్డి, రామచంద్రయ్య, ఖలీల్ బాషా, అహ్మదుల్లా, అంజాద్ బాషా, సరస్వతమ్మ, రత్నసభాపతి, బ్రహ్మయ్య, B. వీరారెడ్డి, డీఎల్, శివారెడ్డి, రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి, వివేకానందరెడ్డి, బసిరెడ్డి, మైసూరారెడ్డి, YSR, రాజగోపాల్ రెడ్డి, జగన్ మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం మండిపల్లి మంత్రి అయ్యారు.

పెనుకొండ ఎమ్మెల్యేకు మరోసారి బీసీ సంక్షేమశాఖ దక్కింది. వైసీపీ ప్రభుత్వంలో పెనుకొండ ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందిన శంకరనారాయణ ఈ శాఖతో పాటు రోడ్డు, భవనాల శాఖ మంత్రిగా పనిచేయగా.. ఈసారి కూడా తొలిసారి గెలుపొందిన సవితకు ఇదే బీసీ సంక్షేమశాఖ దక్కడం గమనార్హం. కాగా వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు <<13439231>>మంత్రులు<<>> ఉండగా ఈసారి ముగ్గురు ఉండటం విశేషం.
Sorry, no posts matched your criteria.