India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుతో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది. వంగర మండలం మద్దివలస గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పొలంలో పశువులు మేపడానికి వెళ్లి వర్షం పడడంతో చెట్ల కింద నిలబడ్డారు. అదే సమయంలో సీతారాం (33) నిలపడిన చెట్టుపై పిడుగు పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. చెట్టుకు కూతవేటు దూరంలో ఉన్న వెంకటనాయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మొదటి హోంమంత్రిగా అనిత రికార్డు సృష్టించారు. 62 ఏళ్ల తర్వాత పాయకరావుపేట నియోజకవర్గానికి మంత్రి పదవి వరించింది. మొదటి సారి కేబినెట్‌లో చోటు సంపాదించుకున్న అనితకు చంద్రబాబు హోంశాఖను అప్పజెప్పి రాష్ట్ర శాంతిభద్రతలు ఆమె చేతిలో పెట్టారు. వృత్తి పరంగా టీచర్ కావడం ప్లస్ పాయింట్. ప్రతి విషయంపై సమగ్రమైన అవగాహన ఉండటం, వాగ్ధాటి, సూటిగా మాట్లాడేతత్వం ఆమెకు కలిసొచ్చే అంశాలు.

రెండోసారి కేంద్ర రక్షణ శాఖ పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా విశాఖపట్నం వచ్చిన రాజ్ నాథ్ సింగ్‌కు విశాఖ ఎంపీ శ్రీభరత్ స్వాగతం పలికారు. మంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో ఐఎన్ఎస్ జలస్వా నౌకపై దిగారు. అనంతరం ఈస్ట్రన్ ప్లీట్‌లో డేట్ సీ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ షిప్ బిల్డింగ్ సెంటర్లో సందర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేవీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం నగరం అరసవల్లి కన్నయ్య కాలనీలోని ఆదిత్య ఆర్చరీ అకాడమీలో ఆదివారం రాష్ట్రస్థాయి ఆర్చరీ జట్టు క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టిబాబు శుక్రవారం తెలిపారు. అండర్ 15 బాల, బాలికల విభాగంలో నిర్వహించనున్న ఈ ఎంపికలకు ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు ఆధార్ కార్డు, పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఫొటోలతో పాటు రూ.300 ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు.

సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు గ్రామాల్లో ప్రజా సమస్యలపై పోరాడాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర ఆధ్వర్యంలో శుక్రవారం తన నివాసంలో మెంటాడ మండల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్నారు. అందరికీ నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు.

కడప నగరం దేవునికడపలో గురువారం రాత్రి 8 గంటలకు మోహన్ కృష్ణ (25) అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి వెనక నుంచి కత్తితో పొడిచాడు. ఈ క్రమంలో ఆయన పొట్ట, వెనుక భాగంలో తీవ్రమైన గాయం అవ్వడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా పోలీసులకు దొరికింది. విజయవాడకు చెందిన సూర్యకుమారి HYD మధురానగర్‌లో ఉంటోంది. అక్కడే ఆమెకు తిరుపతికి చెందిన విజయశేఖర్ రెడ్డి పరిచయమయ్యాడు. అతను కస్టమర్ల డేటా యాప్‌లో ఉంచుతాడు. యువతులకు డబ్బు ఆశ చూపి వాళ్లని వేణుగోపాల్ బాలాజీ(తిరుపతి) సహకారంతో కస్టమర్లు చెప్పిన హోటళ్లకు తీసుకెళ్లేవాడు. సూర్యకుమారి డబ్బులు తీసుకునేది. నిన్న పంజాగుట్టలోని ఓ హోటల్లో సోదాలు చేయగా దొరికిపోయారు.

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సత్రాగచ్చి- చెన్నై సెంట్రల్ (నం.06006) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే(ECOR) తెలిపింది. ఈ ట్రైన్ ఆదివారం ఉదయం 7.50 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై చేరుకుంటుందని పేర్కొంది. ఏపీలో ఈ ట్రైన్ విజయవాడతో పాటు గూడూరు, నెల్లూరు, ఒంగోలు స్టేషన్లలో ఆగుతుందని ECOR తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

ట్రాఫిక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా రద్దు చేసిన కింది రైళ్లను యథావిధిగా నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. రైలు నం.07630 తెనాలి- విజయవాడ, నం.07629 విజయవాడ- తెనాలి నం.07781 విజయవాడ-మాచర్ల నం.07782 మాచర్ల- విజయవాడ.

త్వరలో మేయర్‌ను కూడా దించేస్తామని టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సీతంరాజు సుధాకర్ అన్నారు. శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు అత్యంత అవినీతి పరులుగా వ్యవహరించారని, కొన్ని సాంకేతిక మార్పులు చేశాక.. మేయర్ మార్పులు జరుగుతాయని అన్నారు. జగన్ ఐదేళ్లలో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేశారని ఆయన విమర్శించారు.
Sorry, no posts matched your criteria.