India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గతంలో ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులుగా వ్యవహరించారు. నారాయణ స్వామి డిప్యూటీ CM, ఎక్సైజ్ మంత్రిగా పని చేశారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కీలకమైన విద్యుత్తు, మైనింగ్ శాఖ.. రోజా పర్యాటక, క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజా కేబినెట్‌లో ఎవరికీ చోటు లేకపోయినా.. కుప్పం నుంచి గెలిచిన CM చంద్రబాబు సాధారణ పరిపాలన, లాండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలు ఉంచుకున్నారు.

ఉమ్మడి తూ.గో నుంచి గత ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులుగా చేశారు. చెల్లుబోయిన- బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, I&PR శాఖ, పినిపే విశ్వరూప్- సాంఘిక సంక్షేమ శాఖ, దాడిశెట్టి రాజా- రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా చేశారు. ఇప్పుడు పవన్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పర్యావరణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్&టెక్నాలజీ, అటవీ శాఖలు, వాసంశెట్టికి లేబర్, ఫ్యాక్టరీలు, వైద్య, బీమా సేవలు శాఖలు దక్కాయి.

పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలన్నది ఉమ్మడి ప.గో. జిల్లా ప్రజల కళ. ఏలూరు జిల్లా పరిధిలోని పోలవరం సమీపంలో 2004లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2015లో జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపుపొందింది. అయితే తాజాగా మన జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడిని జలవనరుల శాఖ వరించింది. దీంతో జిల్లా ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ప్రాజెక్టు పనులు పరుగులు పెడతాయని, నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని చర్చ జరుగుతోంది.
– మీ కామెంట్..?

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లాకు జలవనరులశాఖ(అంబటి రాంబాబు), వైద్యారోగ్య శాఖ(విడదల రజిని)లు దక్కాయి. మంత్రులుగా చేసిన విషయం తెలిసిందే. తాజా, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండగా.. ఐటీ, మానవ వనరుల శాఖ(లోకేశ్).. ఆహార, పౌర సరఫరాల శాఖ(ఎన్.మనోహర్).. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్(అనగాని సత్యప్రసాద్) శాఖలు దక్కాయి.

నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండీ ఫరూక్ 1985లో తొలిసారి MLAగా ఎన్నికై ఉమ్మడి ఏపీలో ఎన్టీ రామారావు కేబినెట్‌లో చక్కర, వక్ఫ్&ఉర్దూ అకాడమీ శాఖ మంత్రిగా చేశారు. 1999లో చంద్రబాబు కేబినెట్‌లో ఉన్నత విద్యా, ఉర్దూ అకాడమీ, మున్సిపల్ శాఖలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం 2018లో మైనారిటీ సంక్షేమ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. ప్రస్తుతం మైనార్టీ సంక్షేమం, న్యాయ శాఖలు కేటాయించారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పౌరసరఫరాల శాఖ(కొడాలి నాని), జోగి రమేశ్(గృహ నిర్మాణ శాఖ), పేర్ని నాని(సమాచార శాఖ), దేవాదాయ శాఖ(వెల్లంపల్లి)లు దక్కిన విషయం తెలిసిందే. తాజా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో భూగర్భ గనులు, ఎక్సైజ్ శాఖ(కొల్లు రవీంద్ర), హౌసింగ్, సమాచార శాఖ(కొలుసు పార్థసారథి)లను కేటాయించారు.

➤ 1983, 85: రోడ్లు, భవనాల శాఖ మంత్రి
➤ 2007-09: సమాచార, పౌర సరఫరాల మంత్రి
➤ 2009-12: మున్సిపల్ శాఖ మంత్రి
➤ 2012-14: ఆర్థిక శాఖ మంత్రి
➤ 2024: దేవదాయ శాఖ మంత్రి
NOTE: రాష్ట్రం విడిపోయాక తొలి మున్సిపల్ శాఖా మంత్రిగా పొంగూరు నారాయణ 2014 నుంచి 2019 వరకు పని చేశారు. మరోసారి టీడీపీ అధికారంలోకి రావడంతో ఇప్పుడూ ఆయనకు అదే శాఖ అప్పగించారు.

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 మంది MLAలలో గత వైసీపీ ప్రభుత్వంలో ముగ్గురు MLAలు మంత్రులుగా వ్యవహరించారు. 2019లో తాడేపల్లిగూడెం నుంచి గెలుపొందిన కొట్టు సత్యనారాయణ దేవాదాయశాఖ, కొవ్వూరు నుంచి MLAగా గెలిచిన తానేటి వనితకు హోంశాఖ, తణుకు MLA కారుమూరి వెంకట నాగేశ్వరరావు పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రిగా పనిచేశారు. తాజాగా నిమ్మలకు జలవనరులు, దుర్గేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు.

టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖలు కేటాయించారు. కాగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఈయన ఒక్కరికే కేబినెట్‌లో చోటు దక్కిన విషయం తెలిసిందే.

ఉమ్మడి తూ.గో నుంచి ముగ్గురికి మంత్రివర్గంలో చోటు దక్కగా.. వారికి నేడు శాఖలు కేటాయించారు. ☞ పిఠాపురం MLA పవన్ కళ్యాణ్- డిప్యూటీ సీఎం, పర్యావరణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్&టెక్నాలజీ, అటవీ శాఖలు. ☞ రామచంద్రపురం MLA వాసంశెట్టి సుభాశ్- లేబర్, ఫ్యాక్టరీలు, ఇన్‌స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్. ☞ నిడదవోలు MLA కందుల దుర్గేశ్- కందుల దుర్గేశ్ – పర్యాటకం, సినిమాటోగ్రఫీ.
Sorry, no posts matched your criteria.