India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాలటీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి NMD ఫరూక్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. మంగళవారం మధ్యాహ్నం కర్నూల్ వెళుతుండగా పాణ్యం సమీపంలోని తమ రాజుపల్లె వద్ద ఫరూక్ కాన్వాయ్ అదుపుతప్పి బర్రెలను ఢీకొంది. దీంతో కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో మాజీ మంత్రి ఫరూక్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. పాణ్యం అభ్యర్థి గౌరు చరిత అక్కడికి చేరుకొని ఆయనను ఆసుపత్రికి తరలించారు.
విజయవాడ భవానిపురం ఖబరస్థాన్ వద్ద రోడ్డు పక్కన సైడ్ కాలవలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు భవానిపురం పోలీసులు తెలిపారు. మృతుడు వయసు 40 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పారు. ఈ ఫొటోలోని వ్యక్తి ఆచూకీ తెలిస్తే భవానిపురం పోలీసులకు తెలియజేయాలని సీఐ కృష్ణ కోరారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు.
హీరో సాయికుమార్ తనయుడు ఆది హీరోగా షణ్ముఖ సినిమా తీస్తున్నారు. ఈ చిత్రాన్ని చిత్తూరు వైసీపీ నాయకులు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వైసీపీ పాలసముద్రం మండల కన్వీనర్ సప్పని తులసిరామ్, ఆయన సోదరులు షణ్ముగం యాదవ్, రమేశ్ యాదవ్ చిత్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ కూడా షణ్ముగం యాదవ్ కావడం విశేషం. వీళ్లంతా బెంగళూరులో బిల్డర్స్‌గా రాణిస్తున్నారు.
విశాఖ బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి దత్తత ఆలయం అయిన అంబికా బాగ్‌లో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సీతారాముల కళ్యాణానికి సంబంధించి పెళ్లి రాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈనెల 17వ తేదీన నిర్వహించే శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామచంద్రుని పెండ్లి కొడుకును చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారి తిరుమలేశ్వరరావు పాల్గొన్నారు.
ఉమ్మడి శ్రీకాకుళంలో జిల్లాలో 2019ఎన్నికలలో నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది. ఇచ్ఛాపురం- 69.5, పలాస-72.8, టెక్కలి-78.5, పాతపట్నం-70, ఆమదాలవలస-79, ఎచ్చెర్ల-84, నరసన్నపేట-79.6, రాజాం-73.8 పాలకొండ -73.9 శాతంగా నమోదైంది. కాగా శ్రీకాకుళంలో అత్యల్పంగా 69 శాతం నమోదైంది. ఈ సారి ఆ శాతం పెరిగేలా అధికారుల చర్యలెలా ఉన్నాయి. కామెంట్ చేయండి.
అనంతపురం జిల్లా ఏపీ ఈసెట్ 2024కు మొత్తం 26,436 దరఖాస్తులు అందినట్లు ఏపీ ఈసెట్ రాష్ట్ర ఛైర్మన్ ప్రొఫెసర్ జీవీఆర్ శ్రీనివాస్ రావు, రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి మీడియాకు తెలిపారు. ఏపీ ఈసెట్ దరఖాస్తుకు ఈనెల 15వ తేదీ వరకు గడువు ఉందన్నారు. రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 22 వరకు, రూ.2వేల అపరాధ రుసుముతో ఈనెల 29 వరకు, రూ.5వేల రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
శ్రీ క్రోధి నామ నూతన సంవత్సరం ఉగాది వేడుకలు దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జాయింటు కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను ప్రారంభించారు. శ్రీ క్రోధి నామ నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలకు అన్ని విధాలా మేలు జరగాలని, అన్ని కుటుంబాలు ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలు కలగాలని జాయింటు కలెక్టర్ ఆకాక్షించారు.
ప్రయాణీకుల రద్దీ మేరకు బుధవారం విజయవాడ మీదుగా భువనేశ్వర్- మైసూరు మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ (నెం. 06216)భువనేశ్వర్‌లో రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరి గురువారం ఉదయం 03.25 నిమిషాలకు విజయవాడ, రాత్రి 7.15కి మైసూరు చేరుకుంటుందన్నారు. ఈ ట్రైన్ ఏపీలో విజయవాడతో పాటు శ్రీకాకుళం, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు తదితర స్టేషన్లలో ఆగుతుందని చెప్పారు.
సి – విజిల్ యాప్ ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదుల గురించి కలెక్టర్ DK బాలాజీ తాజాగా ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. సి – విజిల్ యాప్‌లో వచ్చే ఫిర్యాదులను 100 నిముషాల్లో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు మచిలీపట్నంలోని డీఈఓ ఆఫీసు ఆవరణలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పరిశీలన కేంద్రంలో విధులలో ఉన్న సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.
కడప రైల్వే స్టేషన్‌లో కేరళకు చెందిన అధిలా(22) అనే వైద్య విద్యార్థి గాయపడ్డాడు. నీటి కోసం రైలు దిగాడు. తిరిగి ఎక్కడానికి ప్రయత్నించగా అప్పటికే రైలు కదిలింది. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. గమనించిన తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఎడమ మోకాలు పూర్తిగా తెగిపోయిందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.