Andhra Pradesh

News April 9, 2024

చెరువులు నింపేందుకు చర్యలు: కలెక్టర్‌

image

కలెక్టర్‌ డీకే బాలాజీ సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తాగునీటి సమస్య ఉన్న పెడన, కత్తివెన్ను, బంటుమిల్లి, మచిలీపట్నం రూరల్‌, నాగాయలంక, కోడూరు మండలాల్లో తాగునీటి చెరువులు నింపుటకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాలువల ద్వారా విడుదల చేసిన నీటిని జిల్లాలో అన్ని చెరువులు నింపేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. 

News April 9, 2024

కడప: ప్రత్యేక రైలు గడువు పొడిగింపు

image

కడప మీదుగా రాజస్థాన్‌ రాష్ట్రంలోని భగత్‌కి కోటికి వెళ్లే ప్రత్యేక రైలు గడువును మే 1వ తేది వరకు పొడిగించినట్లు కడప రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌ తెలిపారు. భగత్‌కి కోటి (04811) నుంచి ఈనెల 18, 27 తేదీల్లో బయలుదేరే రైలు కడప మీదుగా కోయంబత్తూరుకు వెళుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో కోయంబత్తూరు (04812) నుంచి ఈనెల 22, మే 1 తేదీలలో బయలుదేరి భగత్‌కి కోటికి చేరుతుందన్నారు.

News April 9, 2024

ఈనెల 16న ఎమ్మిగనూరుకు నందమూరి బాలకృష్ణ రాక

image

ఈనెల 16న ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ రోడ్ షో నిర్వహించనున్నట్లు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. వేముగోడు, పుట్టపాశం, హెచ్.కైరవాడి, గాజులదిన్నె స్టేజ్, గోనెగండ్ల, రాళ్లదొడ్డి, ఎర్రకోట మీదుగా ఎమ్మిగనూరు చేరుకుంటారన్నారు. సాయంత్ర 4 గంటలకు శివా సర్కిల్‌లో బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు తెలిపారు. ఈ సభకు అభిమానులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

News April 9, 2024

పవన్ కళ్యాణ్‌తో రఘురామ భేటీ

image

చేబ్రోలులో పవన్ కళ్యాణ్‌‌తో రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎంపీగా పోటీ చేస్తానో, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో అసంపూర్తిగా ఉందని, దీనిపై పవనే త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డే పిఠాపురంలో ఉన్నా .. పవన్‌కు 65వేలకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

News April 9, 2024

నెల్లూరు సిటీ బీసీవై పార్టీ అభ్యర్థిగా చెంచు మహేశ్

image

భారత చైతన్య యువజన పార్టీ నెల్లూరు సిటీ అభ్యర్థిగా కాళహస్తి చెంచు మహేశ్ బరిలో నిలవబోతున్నారు. ఈ మేరకు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో నెల్లూరు సిటీ అభ్యర్ధిగా చెంచు మహేశ్‌ను ప్రకటించారు.

News April 9, 2024

పుంగనూరు నుంచి రామచంద్రయాదవ్ పోటీ

image

ఏపీలో భారత చైతన్య యువజన పార్టీ తరఫున పోటీ చేసే 32 మంది అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్(RCY) విడుదల చేశారు. పుంగనూరు నుంచి RCY పోటీ చేయనుండగా తిరుపతిలో కృష్ణవేణి యాదవ్, శ్రీకాళహస్తిలో దినాడ్ బాబు, పూతలపట్టులో నాంపల్లి భాను ప్రసాద్ బరిలో ఉంటారు. మిగిలిన అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు.

News April 9, 2024

పవన్ కళ్యాణ్‌తో రఘురామ భేటీ 

image

చేబ్రోలులో పవన్ కళ్యాణ్‌‌తో రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎంపీగా పోటీ చేస్తానో, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో అసంపూర్తిగా ఉందని, దీనిపై పవనే త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డే పిఠాపురంలో ఉన్నా .. పవన్‌కు 65వేలకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

News April 9, 2024

దుత్తలూరు: భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

చికెన్ ధరలు రోజురోజుకీ పెరుగుతుండడంతో వినియోగదారులు హడలిపోతున్నారు. మొన్నటివరకు 200 నుండి 220 రూపాయల వరకు పెరిగిన చికెన్ ధరలు మంగళవారం నాటికి 310 కి చేరుకుంది. దీంతో మాంసాహార ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉగాది పండుగ సందర్భంగా చికెన్ దుకాణాల వద్ద వినియోగదారులు రద్దీగా ఉన్నప్పటికీ అధిక మోతాదులో చికెన్ విక్రయాలు జరగడంలేదని వ్యాపారస్థులు తెలిపారు.

News April 9, 2024

అయ్యన్న, సీఎం రమేశ్‌కు నోటీసులు జారీ

image

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని టీడీపీ నేత అయ్యన్న, బీజేపీ నేత సీఎం రమేశ్‌కు ఆర్డీఓ జయరాం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6న బీజేపీ సమావేశానికి హాజరైన మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారన్న ఫిర్యాదుపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీ చేసేందుకు వచ్చారు. వారి ఎదుట అయ్యన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలను తీవ్ర పదజాలంతో విమర్శించారని, సీఎం రమేశ్‌ పక్కనే ఉన్నారని.. ఇద్దరి సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేశారు.

News April 9, 2024

సాలూరు: కేజీన్నర బంగారం చీరతో అలంకరణ

image

సాలూరులో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఉగాది పర్వదినం సందర్భంగా బంగారు చీరతో అలంకరించారు. సుమారు 1500 గ్రాముల బంగారు తాపడంతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ బంగారు చీరలో తల్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల నుంచి అధిక మొత్తంలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

error: Content is protected !!