India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రాణం ఉన్నంతవరకు తాను CM జగన్‌తోనే ఉంటానని వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి(VSR) అన్నారు. 35 ఏళ్లుగా జగన్ కుటుంబంతో ఉన్నానని.. ఇకపై కూడా ఉంటానని చెప్పారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఆ కుటుంబంతో తన బంధం శాశ్వతమని పేర్కొన్నారు. వేమిరెడ్డి దంపతుల్లా తనకు వెన్నుపోటు పొడవడం, పార్టీలు మారడం తెలియదన్నారు. విడవలూరు రోడ్ షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పత్తికొండ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు గద్దల రాజు తెలిపారు. ఆదివారం పత్తికొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం అభివృద్ధి చేయాలని తపనతో తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నానని అన్నారు. గతంలో అనేక పార్టీల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు.. మంత్రి పదవులు చేపట్టినా నియోజకవర్గం అభివృద్ధి నోచుకోలేదన్నారు. తాగు, సాగునీరు అందించడంలో స్థానిక ఎమ్మెల్యేలు విఫలమయ్యారన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలకు, జిల్లా పోలీస్ సిబ్బందికి ఎస్పి మాధవరెడ్డి శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగతో అందరి జీవితాల్లో వెలుగు రావాలని, చీకట్లను పారద్రోలి ప్రజల జీవితాల్లో మరిన్ని కాంతులు వెదజల్లాలని కోరారు. ఎన్నికల దృష్ట్యా నియమ నిబంధనలతో పండుగలు జరుపుకోవాలని , గొడవలకు అల్లర్లకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 MLA, 3 ఎంపీ సీట్లు ఉన్నాయి. ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలు మాత్రమే బరిలో ఉన్నారు. వైసీపీ జీడీ నెల్లూరు MLA అభ్యర్థిగా కృపాలక్ష్మి, నగరి అభ్యర్థిగా రోజా పోటీ చేయనున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో మహిళకు అవకాశం దక్కలేదు. గతంలో గల్లా అరుణ కుమారి నాలుగు సార్లు, గుమ్మడి కుతూహలమ్మ ఐదు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మూడు సార్లు మంత్రులుగా పనిచేశారు.
సీపీఎం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు పోటీ చేయనున్నారు. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజయవాడలో ఆయన పేరును ప్రకటించారు. జగ్గునాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు.
మండలంలోని ముట్లూరు గ్రామంలో సోమవారం విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ముట్లూరుకు చెందిన అలెక్స్ (24) తన నివాసంలో మంచినీటి మోటారు మరమ్మతులు చేస్తుండగా.. విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. అలెక్స్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల తండ్రికి అనారోగ్యంగా ఉండడంతో ముట్లూరు వచ్చాడు.
తోటమూల ఎస్ఆర్ కళ్యాణ మండపం సమీంలో సోమవారం మధ్యాహ్నం ట్రాక్టర్ ఇంజిన్ తిరగబడింది. డ్రైవర్ ట్రాక్టర్ అడుగుభాగాన ఇరుక్కోగా.. సమచారం అందుకున్న పోలీసులు జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను పైకి లేపారు. అయితే ట్రాక్టర్ కింద ఇరుక్కున్న డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పడంతో అందరూ అతన్ని మృత్యుంజయుడన్నారు. ఇతను ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తని. దుక్కుల నిమిత్తం ఎన్టీఆర్ జిల్లాకు వచ్చినట్లు సమాచారం.
యలమంచిలి మండలం కలగంపూడి పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి కొబ్బరిదింపు కార్మికులు కాజ గ్రామం వైపు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో భీమవరం నుంచి కాకినాడ వైపు వెళ్తున్న కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోనసీమలోని గుడిమూడిలంకకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. యలమంచిలి SI శివనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే విధంగా అందరూ సహకరించాలని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం హిందూపురంలో సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో కలిసి కవాతు నిర్వహించారు. శాంతి భద్రతలను కాపాడడానికి కేంద్ర బలగాల పోలీసులతో కవాతు నిర్వహించామని ఎస్పీ తెలిపారు.
నెల్లిమర్ల మండలం కొండగుంపాంలో పెన్షన్‌తో జీవనం సాగిస్తున్న సతివాడ రాములమ్మకి విద్యుత్ బిల్లు షాకిచ్చింది. సర్వీసు నెంబరు 759కి నెల బిల్లు రూ.44718 వచ్చింది. సోమవారం రీడింగ్ సిబ్బంది రాములమ్మ కొడుకు కాంతరావుకు బిల్లు అందజేశారు. దీంతో ఆయన బిల్లు చూసి ఆశ్చర్య పోయారు. వెంటనే సచివాలయానికి వెళ్లి బిల్లు కోసం తెలియజేయగా విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లాలని సలహా ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.